Raksha Bandhan: జబర్దస్త్‌ సెలబ్రెటీల రాఖీ పండగ సెలబ్రేషన్స్.. ఇమాన్యుయేల్‌కు రాఖీ కట్టిన రోహిణి

|

Aug 22, 2021 | 7:14 PM

Raksha Bandhan: మన హిందూ సంప్రదాయంలో ప్రతి పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా రాఖీ పండగ.. అన్నాచెల్లెల్లు, అక్కతమ్ముళ్ల మధ్య..

Raksha Bandhan: జబర్దస్త్‌ సెలబ్రెటీల రాఖీ పండగ సెలబ్రేషన్స్.. ఇమాన్యుయేల్‌కు రాఖీ కట్టిన రోహిణి
Follow us on

Raksha Bandhan: మన హిందూ సంప్రదాయంలో ప్రతి పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా రాఖీ పండగ.. అన్నాచెల్లెల్లు, అక్కతమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా రాఖీ పండుగను జరుపుకొంటారు. తమ తొబుట్టువులకు రక్షణగా, అండగా.. ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తుంటారు. మన దేశంలో ఈ పండగును ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. సౌత్, నార్త్ ఇండియాలలో రాఖీ పండుగకు అనేక పేర్లు ఉన్నాయి. భాయ్ దూజ్, రాక్షా బందన్, రాఖీ పండగ అని పిలుస్తుంటారు.

ఈరోజు తొబుట్టువులు ఎంత దూరంలో ఉన్నా.. తమ సొదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తుంటారు. ఈరోజు రాఖీ పౌర్ణమి.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖుల నుంచి సెలబ్రేటీల వరకు ఈ రాఖీ పండగను జరపుకొన్నారు. ఇక జబర్దస్త్‌ సెలబ్రేటీలు కూడా రాఖీ పండగను ఘనంగా జరుపుకొన్నారు. ఇమాన్యుయేల్‌కు రోహిని రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు తినిపించి పండగ సెలబ్రేట్‌ చేసుకున్నారు. కాగా, జబర్దస్త్‌లో ఇమాన్యుయేల్‌ చేసే స్కిట్టు ద్వారా ఎంతో మంది అభిమానులు పెరిగిపోతున్నారు. అందులో రోహిణి కూడా మంచి ఫార్మమెన్స్‌ ఇస్తోంది. ఈ సందర్భంగా వారి వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వీరే కాకుండా సినీ ప్రముఖులు కూడా రక్షాబంధన్‌ సెలబ్రేషన్‌ చేసుకున్నారు. అన్నలకు, తమ్ముళ్లకు చెల్లెళ్లు, అక్కలు రాఖీ కట్టి పండగను జరుపుకొన్నారు.

కాగా, రాఖీ పండుగ.. అన్న చెల్లెలకు, అక్క తమ్ముల్ల మధ్య ప్రేమను, ప్రాధాన్యతను తెలిపే ప్రత్యేకమైన రోజూ.. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిన ఈ పండుగ జరుపుకొంటారు. ఈరోజున సోదరి తన సోదరులకు కట్టే రాఖీతో వారు జీవితాతంతం ఆమెకు తోడుగా, రక్షణగా నిలుస్తారు.

 

Raksha Bandhan 2021: మీ సోదరులకు రాఖీ ఎందుకు కట్టాలి.. ఏ సమయంలో కడితే మంచిదో తెలుసా..

Rakshabandhan 2021: వాట్సప్‌లో రాఖీ శుభాకాంక్షలు.. మీ ఫోటో స్టిక్కర్‌తో ఇలా పంపించండి..