అదిరిపోయే కాంబో..అంచనాలు ఆకాశంలో..

| Edited By: Pardhasaradhi Peri

Dec 06, 2019 | 8:48 PM

రజనీకాంత్, కమల్ హాసన్..ఇద్దరూ కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. రజనీ తన స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటే, కమల్..అదిరిపోయే నటనతో విశ్వనటుడిగా ఎదిగారు. తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరు నటులు గతంలో చాలా సినిమాల్లో కలిసి నటించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. అయితే మరోసారి ఈ క్రేజీ స్టార్స్ కలిసి నటించబోతున్నారనే న్యూస్ తమిళనాట తెగ చెక్కర్లు కొడుతుంది. ఇటీవలే.. ‘ఖైదీ’ సినిమాతో సెన్సేషన్ హిట్ అందుకున్నాడు దర్శకుడు లోకేశ్ కనక్‌రాజ్‌. అతను చెప్పిన స్టోరీ […]

అదిరిపోయే కాంబో..అంచనాలు ఆకాశంలో..
Follow us on

రజనీకాంత్, కమల్ హాసన్..ఇద్దరూ కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. రజనీ తన స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటే, కమల్..అదిరిపోయే నటనతో విశ్వనటుడిగా ఎదిగారు. తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరు నటులు గతంలో చాలా సినిమాల్లో కలిసి నటించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. అయితే మరోసారి ఈ క్రేజీ స్టార్స్ కలిసి నటించబోతున్నారనే న్యూస్ తమిళనాట తెగ చెక్కర్లు కొడుతుంది. ఇటీవలే.. ‘ఖైదీ’ సినిమాతో సెన్సేషన్ హిట్ అందుకున్నాడు దర్శకుడు లోకేశ్ కనక్‌రాజ్‌. అతను చెప్పిన స్టోరీ లైన్ ఇద్దరు అగ్ర నటులుని ఎగ్జైట్ చేసినట్టు సమాచారం.

ప్రజంట్ సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘దర్బార్‌’లో యాక్ట్  చేస్తున్నాడు. మరోవైపు వరుసపెట్టి సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఇక కమల్ భారీ అంచనాలు నడుమ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయడు 2’ చేస్తున్నాడు. ఈ ఇద్దరి నటుల డేట్స్ ఒకేసారి కుదరడం అంటే మాములు విషయం కాదు. దర్శకుడు లోకేశ్ కనక్‌రాజ్‌..తన సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడు? ..ఇద్దరి నటుల్ని ఎలా మేనేజ్ చేస్తాడో..? మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడు విడదలుతుంది లాంటి విషయాలు తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. వీరిద్దరూ కలిసి నటిస్తే మాత్రం ఆ చిత్రంపై అంచనాలు గగనానికి రీచ్ అవుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.