పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అప్‌డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూంటారన్న విషయం తెలిసిందే. రాజకీయాల వల్ల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వరుసగా రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి వేణు శ్రీరామ్ దర్మకత్వంలో బాలీవడ్ మూవీ ‘పింక్’ రీమేక్ ”వకీల్ సాబ్” ఒకటి. దాదాపు ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తయింది. ఈ పాటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
ఇక మరొకటి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది. దీంతో చిత్రీకరణలన్నీ నిలిచిపోయాయి. ఈ మూఈలో పవన్‌కి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుంది. అయితే తాజాగా పవర్ స్టార్ మరో కొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.
పవర్ స్టార్ తన నెక్ట్స్ మూవీని మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహా రెడ్డి చిత్రానికి దర్మకత్వం సురేందర్ రెడ్డితో చేయబోతున్నారని సమాచారం.ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారట. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో.. ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 1వ తేదీన ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
#PSPK29 : Pawan Kalyan ? – Surender reddy – SRT Entertainments . Ofcl Announcement On #Sep01 .#PSPKBdayCDPTrendOnAug15@PawanKalyan • #VakeelSaab pic.twitter.com/fjsubOReSG
— KingKalyan FC (@KingKalyanFC) August 12, 2020
Read More:
ఈ రోజు రాత్రి 8 గంటలకు మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం
బిగ్‌బాస్ సీజన్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జరుగుతుందో?