పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు రెడీ అయిపోయారు. ఇటీవలే ‘పింక్’ రీమేక్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా నుంచి పవన్ మొదటి రోజు షూటింగ్ పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే పీకే సినిమా అనగానే కమెడీయన్ ఆలీ కూడా గుర్తుకువస్తారు. తన సినిమాలో ఆలీ ఉండాలనే సెంటిమెంట్ పవన్‌కూ ఉంది. అందుకే ప్రతీ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్‌లో నైనా ఆలీ కనిపిస్తారు. అయితే రాజకీయాల వల్ల వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగినా.. వాటిని పట్టించుకోకుండా తన సినిమాలో చేయాలని ఆలీకి పవన్ కబురు పంపించారట. కాగా దీనిపై ఆలీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తన్నాయి.
‘పింక్’ రీమేక్‌లో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మరో ముగ్గురు హీరోయిన్లు అంజలి, మల్లేశం ఫేమ్ అనన్య, నివేదా థామస్‌లు కూడా నటిస్తున్నారట. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమా సమ్మర్ గిఫ్ట్‌గా మే 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.