ఎవరు మీలో కోటీశ్వరుడు.. హోస్ట్‌గా తారక్.. ఛానెల్ మారింది.. టైటిల్ మారింది.. అసలు వివరాలేంటి..?

Evaru Meelo Koteeswarlu : మా టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలుసు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు

ఎవరు మీలో కోటీశ్వరుడు.. హోస్ట్‌గా తారక్.. ఛానెల్ మారింది.. టైటిల్ మారింది.. అసలు వివరాలేంటి..?

Evaru Meelo Koteeswarlu : మా టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలుసు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్‌గా ఈ ప్రోగ్రాం ప్రారంభించారు. చాలామంది ఈ ప్రోగ్రాంలో పాల్గొని బహుమతులను కూడా గెలుచుకున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. జెమినీ టీవీ ఈ రోజు దీన్ని అధికారికంగా ప్రకటించింది.

`ఎవరు మీలో కోటీశ్వరులు. మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు. త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి` అని జెమినీ టీవీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే గతంలో స్టార్‌ మాలో ప్రసారమైన ఈ షో హక్కును జెమినీ టీవీ దక్కించుకోవడం.

మరోవైపు హోస్ట్ కూడా మారారు. గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ లుగా వ్యవరించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా నిర్వహించబోతున్నారు. కాకపోతే హోస్ట్ ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాదు టైటిల్‌ కూడా మారింది. గతంలో `మీలో ఎవరు కోటీశ్వరులు` అని ఉండేది. ఇప్పుడు `ఎవరు మీలో కోటీశ్వరులు` అని మార్చారు. ఈ చిన్న చిన్న మార్పులతో ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌పై ప్రోమోని షూట్‌ చేశారు. దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. త్వరలో కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఎంట్రీలను జెమినీ టీవీ ఆహ్వానించింది.

రెండో సారి ఎన్టీఆర్‌ టీవీ షోలో మెరవబోతున్నారు. ఇప్పటికే ఆయన `బిగ్‌బాస్‌` మొదటి సీజన్‌కి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. ఈ షో కోసం ఎన్టీఆర్‌ భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకోబోతున్నాడట. ఇదిలా ఉంటే దాదాపు 120 దేశాల్లో ఈ షో విజయవంతం కావడం విశేషం. మొదటి మూడు సీజన్లకి నాగార్జున హోస్ట్ చేయగా, నాల్గో సీజన్‌కి చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు.ఇప్పుడు ఐదో సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్. త్వరలో ఈ ప్రోమో విడుదల చేయబోతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Gemini TV (@geminitv)

Click on your DTH Provider to Add TV9 Telugu