Mahesh Babu: మళ్ళీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న మహేష్ బాబు.. చికిత్స నిమిత్తం త్వరలో అమెరికా పయనం?..

|

Dec 02, 2021 | 8:15 AM

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతుంది. మహేష్ బాబు మోకాలికి సర్జరీ నిమిత్తం అమెరికా..

Mahesh Babu: మళ్ళీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న మహేష్ బాబు.. చికిత్స నిమిత్తం త్వరలో అమెరికా పయనం?..
Mahesh Babu
Follow us on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతుంది. మహేష్ బాబు మోకాలికి సర్జరీ నిమిత్తం అమెరికా పయనం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు తాజా సినిమా సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మోకాలికి మైనర్ గాయమయినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. ఇప్పటికే మహేష్ వైద్యులను సంప్రదించగా.. మోకాలికి సర్జరీ అవసరమని సూచించినట్లు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అమెరికా పయనం కానున్నట్లు టాక్. సర్జరీ అనంతరం మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో సర్కారీ వారి పాట సినిమా షూటింగ్ కు రెండు నెలలు బ్రేక్ పడనున్నదట.  ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్ లో #getwellsoonmaheshbabuanna అనే హాష్ స్టాగ్ కూడా ట్రెండ్ అవుతుంది.  అయితే మోకాలి గాయం.. అమెరికా పయనం అన్న వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

మహేష్ బాబుకి గతంలో కూడా మోకాలి నొప్పి గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే. 2014 నుంచి మోకాలి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అప్పుడు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. అప్పుడే సర్జరీ కి వెళ్లక పోవడంతో ఇప్పుడు ఆ బాధ మరింత అధిగమయినట్లు సమాచారం. మహేష్ సర్జరీ చేసుకోనున్నట్లు వార్తలు వినిపించడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సర్కారివారి పాట సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read:  ఒమిక్రాన్‌ పుట్టుకపై అనుమానం.. దక్షిణాఫ్రికా కంటే ముందు.. మా దేశంలో పుట్టిందంటున్న మరో దేశం.