Bigg Boss 5 Telugu: నామినేషన్‌లో లేకున్నా ఆ బిగ్ బాస్ కాంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయాలంటున్న నెటిజన్స్..

|

Sep 17, 2021 | 12:39 PM

బిగ్ బాస్ సీజన్ 5 మొదలై ఇప్పటికే 10 రోజులు దాటింది. ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సారి బిగ్ బాస్ గేమ్ షో 106 రోజులు జరగనుంది.

Bigg Boss 5 Telugu: నామినేషన్‌లో లేకున్నా ఆ బిగ్ బాస్ కాంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయాలంటున్న నెటిజన్స్..
Bigg Boss
Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 మొదలై ఇప్పటికే 10 రోజులు దాటింది. ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సారి బిగ్ బాస్ గేమ్ షో 106 రోజులు జరగనుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు.. ఒకరు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి.. ఇప్పుడు 18 మంది ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు హౌస్ మేట్స్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ పైన చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎపిసోడ్స్ పైన నెటిజన్లు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ట్రోల్స్ అయితే ఒక రేంజ్‌లో జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎవరైనా ఏదైనా తప్పు చేసినా లేదా మరే రకంగా అయినా బిల్డప్ చూపించినా సోషల్ మీడియాలో ఇచ్చిపడేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఈ అమ్మడి పై నెటిజన్లు మండి పడుతున్నారు. నామినేషన్‌లో లేకున్నా ఆ బిగ్ బాస్ కాంటెస్టెంట్‌ను ఎలిమినెట్ చేయాలంటున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సిరి, శ్వేతా వర్మ. ఈ ఇద్దరు బ్యూటీలు అబ్బాయిలకు మేమేమి తక్కువ కాదు అంటూ టాస్క్‌లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నువ్వా -నేనా అంటూ ఇతరులతో పోటీ పడుతున్నారు సిరి, శ్వేతా వర్మ. అయితే ఈ ఇద్దరు భామలు ఓవర్ చేస్తున్నారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. శ్వేతా మరీ ఎక్కువ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆమెను బిగ్ బాస్ హౌస్‌లో అనవసరంగా ఉంచుతున్నారని.. వీలైనంత త్వరగా ఎలిమినేట్ చేయాలంటూ.. పోస్ట్‌లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే శ్వేత వర్మను బిగ్ బాస్ బయటకు పంపించే అవకాశం లేదనే అనిపిస్తుంది. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్వేతా. అలాగే టాస్క్‌లలో కూడా చాల యాక్టివ్‌గా ఉంటుంది. పైగా ఆమె ఈ వారం నామినేషన్‌‌లో కూడా లేదు.చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: నేడు ఈడీ అధికారుల ముందుకు హీరో తనీష్.. ప్రశ్నల వర్షం కురిపించనున్న అధికారుల..

Sonu Sood: సోనూసూద్ పై ఇన్‌కం టాక్స్ దాడులు.. ఐదు వేల రూపాయలతో ముంబాయి వచ్చిన మెస్సియా ప్రస్తుత ఆస్తులు ఎంతో తెలుసా?

Prabhas: షూటింగ్‌ గ్యాప్‌లో ప్రభాస్‌ ఏం చేస్తుంటాడో తెలుసా.? అసలు విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు ఓంరౌత్‌..