Natraj Master: నత్తా.. గుంటనక్క.. సెల్ఫిష్.. అసలైన గేమర్ ఆమెనే.. వామ్మో.. నటరాజ్ మాస్టర్ అందరిని బాగానే అంచనా వేశాడే..

|

Oct 05, 2021 | 8:30 PM

బిగ్‏బాస్ నాలుగోవారంలో అంతా అనుకున్నట్టుగానే ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు నటరాజ్ మాస్టర్. ఆయనకు కోపం ఎక్కువే...

Natraj Master: నత్తా.. గుంటనక్క.. సెల్ఫిష్.. అసలైన గేమర్ ఆమెనే.. వామ్మో.. నటరాజ్ మాస్టర్ అందరిని బాగానే అంచనా వేశాడే..
Natraj Master
Follow us on

బిగ్‏బాస్ నాలుగోవారంలో అంతా అనుకున్నట్టుగానే ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు నటరాజ్ మాస్టర్. ఆయనకు కోపం ఎక్కువే… అనుకుంటే ఆలోచించకుండా ముఖంపై అనేస్తాడు. ఆవేశం ఎక్కువే.. గమనిస్తే.. క్షణంలో పట్టేస్తాడు. ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో జంతువు పేరు ఇచ్చే నటరాజ్ మాస్టర్ తనను తాను సింహంతో పోల్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచి ఇంట్లో గుంటనక్క, నత్తా, ఉసరవెళ్లి ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన మాస్టర్.. ఎలిమినేట్ అయిన తర్వాత ఆ ముగ్గురు ఎవరెవరో చెప్పారు. ఇక ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్‏లో పాల్గోన్న నటరాజ్ మాస్టర్స్.. ఇంట్లో సభ్యులకు బిరుదులు ఇచ్చారు.

ఇక ఇంట్లో నుంచి బయటకు రావడానికి కారణం తన కోపమని తెలిపారు. అలాగే లోబో బిర్యానీ తినకపోయి ఉంటే కెప్టెన్సీ టాస్కులో ఉండేవాడినని చెప్పుకోచ్చారు. తన బెస్ట్ మెమోరీ.. తన భార్య సీమంతం వీడియో అన్నారు. అంతేకాకుండా.. తన భార్య గురించి చాలాసార్లు అడిగానని.. ఎలాంటి సమాధానం రాలేదని.. దీంతో తలుపు పగలగొట్టి వెళ్లిపోయేవాడినని చెప్పుకోచ్చారు. అలాగే.. సినిమా ఫీల్డ్‏లో ఉన్నందుకు డైలాగ్స్ ఎక్కువగా వస్తాయని.. తన గురించి ఏమనుకుంటారో ఆలోచించనని ఒక టాస్క్‌లో విశ్వ, శ్రీరామ్‌ నన్ను తొక్కేద్దామనుకున్నారని చెప్పుకొచ్చారు. మహిళలంటే తనకు చాలా గౌరవమని చెప్పుకొచ్చారు. అలాగే ఇంట్లో సభ్యులకు ఒక్కో బిరుదులు ఇచ్చారు.

సన్నీ వీజే.. ఆగం, సిరి జాతిరత్నం, ఉమ.. అమాయకపు ఆణిముత్యం, రవి.. పులిహోర రాజా, శ్వేత.. తిక్క, కాజల్.. ఫిటింగ్ మాస్టర్, విశ్వ.. ఊసరవెల్లి, నటరాజ్ మాస్టర్.. ఫైర్ స్టార్, మానస్.. మిస్టర్ పర్‏ఫెక్ట్, ప్రియాంక.. మంచి మనిషి, హమీదా.. సెల్ఫిష్, ఫిటింగ్ మాస్టర్, ప్రియ.. గేమర్, జెస్సీ.. ఫేక్ స్టార్, షణ్ముఖ్.. పరమానందశిష్యుడు.. యానీ మాస్టర్.. స్వార్థపరురాలు, లహరి.. స్నేహితురాలు, లోబో….తిండి పిచ్చోడు, శ్రీరామచంద్ర.. తారజువ్వ అంటూ ఒక్కొక్కరికి బిరుదులు ఇచ్చేశాడు.

Also Read: Mahesh Babu-namrata Photos: మహేష్‌ బాబు, నమ్రతా అరుదైన రికార్డ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ కపుల్ ఫొటోస్…

Idhe Maa Katha Movie: ఇదే మా కథ సినిమా చూడండి.. ఎన్ ఫీల్డ్ బైక్స్ గెలుచుకోండి… వివరాల్లోకి వెళ్తే..