Uma Maheswari Dead: తమిళ ప్రముఖ సీరియల్ నటి ఉమా మహేశ్వరీ కన్నుమూశారు. ఆదివారం ఉదయం చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సూపర్ హిట్ తమిళ సీరియల్ మెట్టి ఒలి .. తెలుగులో మెట్టెల సవ్వడిగా ప్రసారమైన సంగతి తెలిసిందే.. ఈ సీరియల్ లో నటించిన నటీనటులు అప్పట్లో మంచి ఫేమస్. మెట్టెల సవ్వడి సీరియల్ లో అక్కచెల్లెళ్లలో ఒకరిగా నటించిన ఉమా మహేశ్వరీ మరణించింది. 40 ఏళ్ల ఉమ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఉమా మరణ వార్తను విన్న ఆమె అభిమానులు షాక్ తిన్నారు.
ఉమా మహేశ్వరి మరణవార్తను ఆమె సహనటి గాయత్రి సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఉమా మహేశ్వరి మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని .. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది గాయత్రీ.
ఉమా మహేశ్వరి ‘ఒరు కథైయిన్ కథై’, ‘మంజల్ మహిమై’వంటి సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించి తమిళ టీవీ ప్రేక్షకులుకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైయారు. అంతేకాదు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.
Also Read: తాను మరణిస్తూ పిల్లకు జన్మనిచ్చిన లేడీ.. ఆ లేడి పిల్లను పెంచుతున్న చిరుతలు