Megastar Chiranjeevi: ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. స్వయం కృషితో ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. హీరోగా అడుగు పెట్టినా .. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు చిరు. యంగ్ జనరేషన్ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికీ తాను నటించే ప్రతి సినిమాను మొదటి సినిమా భావిస్తారని టాక్.
టాలీవుడ్ లో తన 40 ఏళ్ల సినిమా కెరీర్ లో చిరంజీవి ఎన్నో రికార్డులను సృష్టించారు.. దక్షిణాదిలో చిరంజీవి అంటే తెలియనివారుండరు. అయితే మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయవేత్తగా, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాడు. ఫ్యాన్స్ ను సేవా కార్యక్రమాల వైపు నడిపిన ఘనత కూడా మెగాస్టార్ చిరంజీవి కే సొంతమని చెప్పవచ్చు.. చిరంజీవి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.. అరుదైన రికార్డులను కూడా నెలకొల్పారు.
చిరంజీవి వెండి తెరపై అడుగు పుట్టకముందు.. చెన్నైలో నటనకు సంబంధించిన కోర్సును చేశారు. కెరీర్ మొదట్లో మెగాస్టార్ చిరంజీవి చిన్న పాత్రలనే కాదు.. విలన్ పాత్రలను కూడా పోషించారు. అంచెలంచెలుగా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ గా ఎదిగారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 150కి పైగా చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో హీరోగా నటించారని మాత్రమే అందరికీ తెలుసు.. అయితే స్టార్ మా లోని మీలో ఎవరు కోటీశ్వరు షో కి హోస్ట్ గా చేసి బుల్లి తెరపై అడుగు పెట్టారు చిరంజీవి.. కానీ చిరంజీవి నిజానికి ఓ సీరియల్ లో నటించారని కొంతమందికి మాత్రమే తెలుసు.. బాలీవుడ్ లోని ఓ హిందీ సీరియల్ లో చిరంజీవి నటించి బుల్లి తెర ప్రేక్షకులకు కనువిందు చేశారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమయ్యే “రజిని” అనే ధారావాహిక లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించారు. అది కూడా కేవలం ఒక్క ఎపిసోడ్ లో మాత్రమే నటించారు. ఆ తర్వాత చిరంజీవి పలు చిత్రాల్లో వరసగా అవకాశం రావడంతో సీరియల్ కి గుడ్ బై చెప్పి పూర్తిగా సినిమాల వైపు దృష్టి సారించారు.
Also Read: ప్రియమణిని ఏసీపీ ఎంక్వైరీకి .. మోనిత ను 25వ తేదీ పెళ్లి కావాలా జైలు కావాలా తేల్చుకో అంటున్న దీప