Mahesh Babu-NTR: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. తారక్‌తో కలిసి సందడి చేయడానికి రెడీ అయ్యిన సూపర్ స్టార్..

|

Nov 20, 2021 | 12:09 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతోపాటు ఇటు బుల్లితెర పై కూడా తన డైన మార్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Mahesh Babu-NTR: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. తారక్‌తో కలిసి సందడి చేయడానికి రెడీ అయ్యిన సూపర్ స్టార్..
Mahesh Ntr
Follow us on

Evaru Meelo Koteeswarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతోపాటు ఇటు బుల్లితెర పై కూడా తన డైన మార్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వెండితెరపై టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్.. బిగ్‏బాస్‌‌షోతో బుల్లితెరపై కూడా కింగ్ అనిపించుకున్నారు. షో నిర్వహించడంలో తనదైన స్టైల్‏ను క్రియేట్ చేశారు ఎన్టీఆర్. ఇక ఆ తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు తారక్. ఇటీవల మరోసారి హోస్ట్‌గా సందడి చేస్తున్నారు. తారక్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతుంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి షో ఆధారంగా వచ్చింది ఎవరు మీలో కోటీశ్వరులు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కింగ్ నాగార్జున బుల్లితెరపై సందడి చేయగా.. తాజాగా తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ అలరిస్తున్నారు.

ఇప్పటికే ఈ షోకు చాలా మంది సినిమా తారలు వచ్చారు. మొదటి గెస్ట్‌గా తారక్ మిత్రుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆతర్వాత టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కు వచ్చి సందడి చేశారు. ఆతర్వాత బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత , మ్యూజిక్ సెన్సేషన్స్ తమన్ – దేవీశ్రీ హాజరయ్యారు. ఇక ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. మహేష్ తారక్ తో కలిసి సందడి చేయనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు ఛానెల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. మహేష్ గెస్ట్ గా రాబోతున్న షోకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని ప్రకటించారు. దాంతో తారక్ ఫాన్స్ , మహేష్ ఫాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Keerthy Suresh: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ అయిన బ్యూటీ.. హోమ్ బ్యానర్‌లో సినిమా మొదలుపెట్టిన కీర్తి సురేష్..

సినిమా కోసం కష్టపడుతున్న అందాల భామ.. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Priyanka Chopra: క్రిస్మస్‌ కానుకగా రానున్న మ్యాట్రిక్స్4.. కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసిన ప్రియాంక..