Actor Gufi Paintal: మహాభారతంలో శకుని మామ ఇకలేరు.. అనారోగ్యంతో గూఫీ పెంటల్ మృతి..

గూఫీ పెంటల్ చాలా కాలం పాటు వయస్సు సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇప్పుడు మరణానికి కారణం అతని గుండె వైఫల్యం కారణమనే తెలుస్తోంది. మా తండ్రి మిస్టర్ గూఫీ పెంటల్ (శకుని మామ) మరణించారని ఈ సంగతిని విచారంతో   తెలియజేస్తున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు.  

Actor Gufi Paintal: మహాభారతంలో శకుని మామ ఇకలేరు.. అనారోగ్యంతో గూఫీ పెంటల్ మృతి..
Gufi Paintal Dead

Updated on: Jun 05, 2023 | 12:29 PM

ప్రముఖ టీవీ సీరియల్ మహాభారతంలో శకుని మామగా నటించిన గుఫీ పెంటల్ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న గుఫీ పెంటల్ కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం మెరుగైందని వార్తలు వినిపించాయి. అయితే అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. కొంతకాలంగా గుఫీ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆరోగ్యం బాగా క్షీణించడంతో మే 31న ఆసుపత్రికి తరలించారు. గూఫీ పెంటల్ చాలా కాలం పాటు వయస్సు సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇప్పుడు మరణానికి కారణం అతని గుండె వైఫల్యం కారణమనే తెలుస్తోంది. మా తండ్రి మిస్టర్ గూఫీ పెంటల్ (శకుని మామ) మరణించారని ఈ సంగతిని విచారంతో   తెలియజేస్తున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు.

నటుడిగానే  కాదు గూఫీ కొన్ని టీవీ షోలు, శ్రీ చైతన్య మహాప్రభు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.  అతను BR ఫిల్మ్స్‌లో అసోసియేట్ డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్ , ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా పనిచేశారు.

సత్తె పే సత్తా, రఫు చక్కర్, పరిచయం వంటి అనేక చిత్రాలలో పనిచేసిన ప్రముఖ హాస్యనటుడు పైంటల్ సోదరుడు గూఫీ పెంటల్. గూఫీ పెంటల్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నా మహాభారతంలో శకుని మామ పాత్రలో నటించినప్పుడు వచ్చిన కీర్తి మరే పాత్రకీ దక్కలేదంటే అతిశయోక్తి కాదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..