కృష్ణకు ముకుంద ప్రేమ విషయం తెలుస్తుంది. దీంతో తన కాపురాన్ని నిలబెట్టుకొలనుకున్న కృష్ణ హాస్పటల్ కు లాంగ్ లీవ్ పెడుతుంది. ఈ రోజు సెప్టెంబర్ 22 వ తేదీ ఎపిసోడ్ లో కృష్ణ, ముకుంద, మురారీల మధ్య ఏమి జరుగుతుందో చూద్దాం.. అబ్బాయిల ఆలోచనల గురించి కృష్ణకు బోర్డు మీద వివరించి మురారీ చెబితే.. ఆడవాళ్ళ మైండ్ సెట్ గురించి కృష్ణ చెబుతుంది. కృష్ణ ఆగకుండా చెబుతూనే ఉంటుంది.
ముకుంద ని తండ్రి శ్రీనివాస్ ఒక్కసారి కలవమని అడుగుతాడు. ముకుందకు అన్నీ మరచిపోయి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేయమంటే.. నా ప్రేమని చంపేసింది నువ్వే.. నా జీవితం ఇలా కావడానికి కారణం నువ్వే.. మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది అని అంటుంది. అంతేకాదు నేను ప్రేమించిన వాడి కోసం ఎదురుచూస్తా అంటే.. మంచి ఫ్యామిలీ మంచి సంబంధం అంటూ నన్ను కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించి ఈ రోజు నా ప్రేమ నాకు దక్కకుండా చేసావు.. ఇప్పుడు ఎవరికోసమో అన్నీ తెలిసినా నిజం చెప్పడం లేదు అంటూ నిందలు వేసి.. తండ్రిని నానా మాటలు అంటుంది. అది విన్న రేవతి ఏమిటి తండ్రిని కూడా ఇలా తిట్టేస్తుంది అనుకుంటుంది.
మరోవైపు అఖిల మధుని షాపింగ్ వెళ్తానని అడిగి కార్డు తీసుకుని వెళ్లి 50 వేలు ఖర్చుపెడుతుంది. తమది ప్రేమ వివాహం కనుక ముకుందకి సపోర్ట్ చేస్తానని అని అలేఖ్య అంటే.. మనం పెళ్లి అయిన వాళ్ళం కనుక పెళ్ళికి ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చి తాను కృష్ణ, మురారీలకు సపోర్ట్ చేస్తానని అంటాడు.
డైనింగ్ టేబుల్ దగ్గర మురారీ పక్కన ముకుంద కూర్చోబోతుంటే కృష్ణ వచ్చి భార్య భర్త పక్కనే కూర్చోవాలి అని అంటూ తాను కూర్చుంటుంది. దీంతో మురారీ పక్కన ఉన్న మధుని అలేఖ్య దగ్గరకు వెళ్ళమని చెప్పి అక్కడ తాను కూర్చుంటుంది. ఇంతలో మళ్ళీ గోంగూర పచ్చడా అంటూ ప్రసాద్.. ముకుంద నిజం చెప్పు నీకు ఇష్టమని చేస్తున్నావా.. లేక మురారీకి ఇస్తామని చేస్తున్నావా అంటాడు. అప్పుడు అఖిల మధుతో మామయ్యకు కూడా ముకుంద మురారీల మ్యాటర్ తెలిసిందా ఏమిటి అంటుంది. నువ్వు కానీ చెప్పావా అంటే లేదే అని అంటుంది అఖిల.. అయితే తెలిసి ఉండదు.. అని అంటాడు మధు. అంటే నేను అక్కడివి ఇక్కడ ఇక్కడివి అక్కడ చెప్పేదానిలా కనిపిస్తున్నానా నీకు అని అంటే లేదే.. ఎక్కడ చెప్పకూడదో అక్కడ చెప్పేదానిలా కనిపిస్తున్నావు. నోరు మూసుకుని తిను అని అంటాడు మధు.
అలా ఏమీ లేదు మామయ్య.. మీకు ఇష్టమైన పకోడీ, ఆలు కూర చేశాను అంటే ప్రసాద్ సంతోషపడతాడు. చిన్నత్తయ్య ములక్కాయ కూర బాగుంటుంది వడ్డించండని ముకుంద అంటే.. రేవతి ఎప్పటిలా నువ్వు వడ్డించు అంటే.. చిన్నత్తయ్య ఉండగా నేను వడ్డిస్తే ఏమి బాగుంటుంది అంటూ .. మురారీ అప్పడం వేసుకో అంటూ వేయబోతుంటే.. కృష్ణ కలుగజేసుకుని నేను ఉండగా నువ్వు వడ్డించడం కూడా బాగుండదు ముకుంద అని షాక్ ఇస్తుంది కృష్ణ.
నేను ఇక్కడే ఉన్నాగా నేను వడ్డిస్తా నువ్వు తిను అంటే.. భవానీ కలుగజేసుకుని తింగరి పిల్లా ఏమిటి నీ ప్రాబ్లెమ్ అంటే.. ఏమీ లేదు అత్తయ్య.. ముకుందే చెప్పింది కదా భర్తకు భార్యే వడ్డించాలని అందుకే అంటే.. ముకుంద నువ్వు వడ్డించుకోమ్మా అని భవానీ చెబుతుంది. అంతేకాదు అయినా భాద్యతలు తీసుకున్నప్పుడు అందరికి ప్రేమని ఒకేలా పంచాలి అని అంటుంటే.. రేవతి అలా గడ్డిపెట్టు అక్క అనుకుంటుంది. అందుబాటులో ఉన్నాం కదా అని నాకు మురారీకి మాత్రమే వడ్డిస్తూ.. మిగతావాళ్ళని మాత్రం స్మార్ట్ గా మ్యానేజ్ చేస్తున్నావు అని అంటుంది భవానీ.. ఆ మాత్రం గమనించలేని అనుకుంటున్నావా రేవతి ఎప్పుడైనా ఇలా చేసిందా.. అసలు ఇష్టంగానే నువ్వు ఇంటి బాధ్యతలు తీసుకున్నావా.. దీనిలో ఇంకెవరి ప్రోద్భలమైనా ఉందా అని ముకుంద ప్రశ్నమీద ప్రశ్నవేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది భవానీ.
లెదత్తయ్యను మనస్ఫూర్తిగానే తీసుకున్నాను అని అంటే.. అలాంటప్పుడు వంట చేసినా వడ్డన చేసినా నిండు మనసుతో చేయలని చెబుతుంది భవానీ.. అలాగే అత్తయ్య అంటూ చెబుతుంది ముకుంద.
ఇంతలో కృష్ణ పెద్దతయ్య అంటూ మొదలు పెడుతుంది.. రేపు ప్రపంచ భర్తల దినోత్సవం. ఇంతలో అలేఖ్య ఉమెన్స్ డే, మదర్స్ డే లా గా హస్బెండ్స్ డేనా అని అంటే.. అలాంటిదే అని కృష్ణ అంటూ ఈ రోజుకి ఒక స్పెషల్ ఉంది. భర్తలకు సన్మానం చేస్తారు అని అంటుంది. భర్తకు ఇష్టమైన వంటకాలు.. వాళ్ళ అభిరుచికి తగ్గట్టు.. ప్రేమతో చెయ్యాలి.. భర్త కోసం ఒక ప్రామిస్ చెయ్యాలి.. అబ్బో ఇంకా చాలా తతంగం ఉంటుంది. అంటే ప్రసాద్ అర్ధం అయిందా రేపు ఒక్కరోజైనా నాకు ఇష్టమైనట్లు ఉండనివ్వు అంటాడు ప్రసాద్. అపుడు సుమలత అలాగే అని అంటుంటే.. రేపు ఒక్క రోజైనా ఆదర్శ్ కు ఇష్టమైన వంటకాలు ముకుందతో చేయిస్తా అని చెబుతున్న కృష్ణ.. అప్పుడు రేవతి నా కోడలా మజాకా.. తింగరి దానికి అసలు విషయం తెలియక పోయినా ముకుందకు బాగానే బుద్ధి చెబుతుంది. అనుకుంటుంటే.. ముకుంద ఆదర్శ్ కోసం అన్నీ నేర్చుకుంటుదని కదా.. ఆదర్శ్ వచ్చే లోపు ఆదర్శ్ కు ఇష్టమైనవి అన్నీ నేర్చుకుంటుంది అని కృష్ణ చెబుతుంది. డౌటే లేదు కృష్ణకు ముకుంద మ్యాటర్ తెలిసింది.. ఈ విషయం ముకుందకు చెప్పినా నమ్మడం లేదు అని అలేఖ్య అనుకుంటుంటే.. భవానీ సరే కృష్ణ .. రేవతి, సుమలత, అలేఖ్య అందరూ రేపు భర్తల దినోత్సవానికి రెడీ చేయండి అని చెబుతుంది.
కృష్ణ ఫోకస్ అంతా నామీదనే పెడుతుంది ఎందుకు.. తాను ఎంతో కష్టపడి సాధించిన డాక్టర్ జాబ్ కు కూడా లాంగ్ లీవ్ పెట్టింది. పైగా ప్రతి సారీ ఆదర్శ్ మ్యాటర్ తీసుకొస్తుంది. ఎందుకు ప్రతిసారీ నామీద ఫోకస్ పెట్టింది. అని ఆలోచిస్తుంటే.. అలేఖ్య తనకు చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. అదేకనుక నిజం అయితే కృష్ణ ఇంక ఈ ముసుగులో గుద్దులాట వద్దు.. డైరెక్ట్ గా తేల్చుకుందాం నువ్వే నేను అని ఛాలెంజ్ చేసుకుంటుంది ముకుంద..
పూజ చేసిన తర్వాత అందరికి ప్రసాదం ఇస్తూ.. కృష్ణ చేతిలో ప్రసాదం పెట్టి.. దీనిని భార్య భర్తలు ఇద్దరూ ఖచ్చితంగా తినమని అని చెబుతారు.. మధు అలేఖ్యల రగడలో కృష్ణ చేతిలో ప్రసాదం కింద పడిపోతుంది. అప్పుడు ముకుంద తన చేతిలో ప్రసాదాన్ని తినమని ఇస్తుంది..