ప్రేమ.. పెళ్లి.. మధ్య సాగే సమారంతో సాగిపోతూ బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ సీరియల్ గా దూసుకుపోతుంది కృష్ణ ముకుంద మురారీ. కృష్ణ మెడికల్ క్యాంప్ పేరుతొ ఇంటిని వదిలి వెళ్ళడానికి రెడీ అవుతుంది. తన ప్రేమకు లైన్ క్లియర్ అయిందని సంతోషంలో ముకుంద ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆగస్టు 15వ తేదీ 236వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం..
కృష్ణ నిన్ను డ్రెస్ లో చూస్తుంటే కొత్త అమ్మాయిని చూస్తున్నట్లు ఉంది.. నీకు డ్రెస్ బాగుంది.. కానీ మాకు మా తింగరి పిల్లా .. అంటే నువ్వు చీర కట్టుకున్న కృష్ణే నచ్చుతుందనని అంటాడు ప్రసాద్. మీ అందరికి మా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పలేక ఇక ఇంటికి నేను ఏమీ కాను అని చెప్పగానికే ఇలా డ్రెస్ కట్టుకున్నా అని కృష్ణ అనుకుంటుంది. భవానీ ఏయ్ తింగరి పిల్ల నువ్వు క్యాంప్ నుంచి తిరిగి రాగానే.. నీకో సర్ప్రైజ్ ఉంది అని చెబుతుంది. మళ్ళీ ఏమి ప్లాన్ చేసారు అత్తయ్య.. మాంగళ్య ధారణ అయిపొయింది.. పట్టాభిషేకం అయిపొయింది.. మళ్ళీ ఏమి చేస్తారు దానికి.. అయినా కృష్ణ మళ్ళీ తిరిగి రావాలిగా అని ముకుంద అనుకుంటుంది.. ఏమీటి పెద్దత్తయ్య ఆ సర్ప్రైజ్ అంటే.. వెళ్ళిరా అప్పుడు తెలుస్తుంది అంటే.. నేను మళ్ళీ తిరిగి రాను అని చెప్పకుండా వెళ్తుంటే చాలా గిల్టీగా ఉందని అనుకుంటే.. క్యాంప్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చెయ్యి.. జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది భవాని.. సరే పెద్దత్తయ్య అని అంటే.. రేవతి కృష్ణ క్యాంప్ అవ్వగానే త్వరగా తిరిగి వస్తావు కదా అని రేవతి అంటే.. తిరిగి రావాలంటే ముందు వెళ్ళలికదా అత్తయ్య అని అంటుంది కృష్ణ.
గౌతమ్ నువ్వు మురారీని ఓ కంట కనిపెడుతూనే ఉండు.. నేను సమయం చూసి మురారీ ప్రేమ గురించి కృష్ణకు చెబుతా అని అంటుంది నందు.. నందు ఎక్కువ ఆలోచించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. ఏమో గౌతమ్ నాకు రాత్రి అంతా నిద్రలేదు.. మన కళ్ల ముందే అంతా జరుగుతున్నా ఏమీ చెయ్యలేకపోతున్నాం.. తీరా వెళ్ళాక అయ్యో మనం ఒక్క మాట చెబితే బాగుండును అని బాధపడినా ప్రయోజనము ఉండదు గౌతం.. సరే నీ ఇష్టం నందు పద వెళ్తాము.. అంటాడు..
వదినా ఈ రోజు ఏమిటీ స్పెషల్ అంటే .. ఏమీ లేదు ఇడ్లి బోండా అంటే.. కృష్ణ ఈ రోజు వెళ్లి మళ్ళీ 10 రోజులకు కదా వస్తుంది.. ఏదైనా స్పెషల్ చేయాల్సింది అంటే.. అందరూ వచ్చారు ముకుంద రావాలి.. అంటే నేను పిలుస్తా అని అంటే.. ముకుంద వస్తుంది.. నేను పిలుద్దామనుకున్నా నువ్వే వచ్చావు అని అంటుంది కృష్ణ.. అందరూ అందరికంటే నీ గురించే ఈ ఇంట్లో ఆలోచిస్తారు అని ముకుందతో అంటుంది కృష్ణ.. రేవతి ఈ తింగరి .. నిజం తెలియక.. ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది.. నువ్వు వెళ్ళిపోయాక ముకుంద ఎలా ప్రవర్తిస్తుందో తల్చుకుంటే భయమేస్తుంది అనుకుంటుంది రేవతి..
అత్తయ్య రోజూ రేవతి అత్తయ్యనే ఎందుకు పనిచేయాలి.. అలెఖ్య ఒకరోజు.. ముకుంద ఒక రోజు ఇలా అందరూ పనిచేస్తే బాగుంటుంది కదా.. అంటుంది కృష్ణ.. అందరూ వడ్డిస్తే తినేది ఎవరు అంటుంది ముకుంద.. నేను రోజుకు ఒకరు అంటున్నా అంటుంటే.. అందరం కూర్చుని ఎవరికీ వారు వడ్డించుకుందామా.. బఫేలా అంటాడు మురారీ.. భలే చెప్పారు ఏసీపీ సార్.. నా మనసులో మాట అంటే.. ఇంతలో నందు కల్పించుకుని ఇద్దరూ ఒకటే కదా మరి..గౌతమ్ ఏమనుకుంటున్నాడో నాకు తెలుసు.. నేను ఏమనుకుంటానో గౌతమ్ కి తెలుసు.. ఇది కామన్ థింకింగ్ కృష్ణ.. మొగుడుపెళ్ళాం అంటే ఇదే.. అంటుంది..
మొగుడు పెళ్ళామ్ వినడానికి ఎంత బాగుందో కానీ నాకు అదృష్టం లేదు నందు.. అని అంటూ పెద్దత్తయ్య మీరు ఏమీ అనుకోనంటే.. ఈ రోజు బఫే తిందాం అంటే.. అలాగే అని.. దీనికి బాధ్యతను అప్పగించాను కదా.. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసినట్లు ఉంది అనుకుంటూ నవ్వుకుంటుంది భవానీ..
ఇదేదో బాగుంది కృష్ణ .. అక్క రోజు ఇలాగే చేద్దామంటుంది.. ప్రసాద్ భార్య.. అవును అత్తయ్య రోజూ ఇలాగె చేయండి.. సన్ డే మాత్రం అందరూ కూర్చుని కలిసి తినండి అని కృష్ణ అంటుంటే.. ఏమిటి కృష్ణ అప్పగింతలు చెప్పినట్లుంది అంటుంది. వచ్చే ఆదివారానికి నువ్వు కూడా క్యాంప్ నుంచి వచ్చేస్తావు కదా అంటే.. భయంతో ముకుంద.. ప్రేమగా అందరూ చూస్తూ ఉంటారు.. పెద్దత్తయ్య ఇప్పుడు నాదో రిక్వెస్ట్.. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ని మోచేయి ఫోల్డ్ చేయకుండా తినాలి అని చెబుతుంది.
కష్టం కృష్ణ అని మధు అంటే.. కాదు నేను చూపిస్తా అని కృష్ణ.. ప్లేట్ లో టిఫిన్ పెట్టి రేవతి తినిపిస్తుంది. ఇలా ఒకరికొకరు తినిపించుకుంటే.. ఎవరి ఫోల్డ్ చేయక్కర్లేదని అంటే.. అందరూ ఒకరినొకరు తినిపించుకుంటారు. ముకుంద మురారీ దగ్గరకు వచ్చి తిను మురారీ అంటుంది.. మరి నాకు తినిపించవా అని అడిగి మరీ తినిపించుకుంది మురారితో.. మురారీ కృష్ణ అంటూ వచ్చి అడిగి మరీ కృష్ణకు తినిపిస్తాడు. హాస్పటల్ నుంచి వెహికిల్ ఏమైనా వస్తుందా అని అంటే.. లేదు అత్తయ్య నేనే వెళ్ళాలి అంటుంది.. కృష్ణ .. మురారీలు ఒకరినొకరు తినిపించుకుంటారు.
లగేజ్ ప్యాకేజ్ చేసుకుంటున్న కృష్ణ దగ్గరకు మురారీ .. నందు వస్తారు.. వెళ్ళిపోతున్నావా కృష్ణ అంటే.. హా నందు క్యాంప్ కు వెళ్తున్నా అంటుంది. నాతొ ఏమైనా చెప్పాలా అని కృష్ణ అంటే.. వద్దు అని మురారీ అంటాడు. నందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా కృష్ణా అంటే.. నందు ఇలా అడుగుతుంది ఏమిటి అనుకుంటూ.. ఎందుకు నందు ఇలా అడుగుతున్నావు అంటే.. అసలు నీకు మనసు ఉందొ లేదో తెలుసుకుందాం అనిపించింది అంటుంది నందు.. నిజం చెప్పేలా ఉంది అనుకుంటూ.. కృష్ణ నువ్వు కిందకు వెళ్లు అంటే.. వెళ్లే ముందు రచ్చ చేయకు అంటూ నందుని మురారీని బతిమాలాడతాడు. తన ప్రేమ గురించి కృష్ణకు ఎక్కడ చెప్పేస్తుందో అని నందుని కట్టేస్తాడు. నన్ను క్షమించు నందు ప్లీజ్ అంటూ రూమ్ లాక్ చేసి కిందకు వచ్చేస్తాడు.
కృష్ణకు సెండాఫ్ ఇవ్వడానికి ఫ్యామిలీ అంతా వస్తుంది.. ఈ ఇంటిని మిమ్మల్ని.. ఎవరిని వదిలి వెళ్లాలని లేదు.. కానీ ఎప్పటికీ మీ ఇంట్లో మీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదు అంటూ కృష్ణ కన్నీరు పెట్టుకుంటుంది. ఒకొక్కరికి వెళ్లివస్తానని చెబుతుంది.. రేవతి తొందరగా వచ్చెయ్యి కృష్ణ టైమ్ కి తిను.. ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యి.. అంటుంది.. భవానీ ఏమిటి నువ్వు ఏదో శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్లు అంత ఇదైపోతున్నావు.. క్యాంప్ 10 రోజులే కదా మళ్ళీ తిరిగి వస్తావు కదా అని అంటుంటే.. అలేఖ్య కృష్ణ వాలకం చూస్తుంటే.. మళ్ళీ తిరిగి వచ్చేలా లేదు అంటే.. నువ్వు నోరు ముయ్యి అంటాదు మధు..
భవానీ కృష్ణకు క్యాంప్ కు వెళ్లడం ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చెయ్యి అంటే.. అలాగే అని మురారీ వెళ్లబోతుంటే.. వద్దు అని ఆపేస్తుంది.. నేను వెళ్తాను అని అంటుంది కృష్ణ.. ఈ మధ్య నీ తింగరి తనం బాగా మిస్ అవుతున్నా తెలుసా అంటుంది భవానీ.. చూడు బయటకు వెళ్ళేటప్పుడు కన్నీరు తో వెళ్ళకూడదు.. సరేనా అంటుంటే.. సరే అత్తయ్య అంటుంది కృష్ణ. మధు ఇలారా.. అని నేను వెళ్ళాక ఇది ప్లే చేసి అందరికి చూపించు అంటుంది .. ఏముంది అందులో అని రేవతి అంటే.. మీరు వంట చేస్తున్నప్పుడు తీశా అని అంటే.. కృష్ణ చెవి పట్టుకుంది రేవతి.. చూడండి అత్తయ్య మీ ముందే నా చెవి తిప్పింది అంటూ భవానికి రేవతి గురించి ఫిర్యదు చేస్తుంది. రేవతి తను నా చిన్న కోడలు.. తనని ఏమైనా అంటే ఊరుకోను అంటే.. అది ఈ తింగరి పిల్ల అంటే.. ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే.. అంటుంది కృష్ణ.. పోవే తింగరి పిల్లా అని రేవతి ముద్దుగా కసురుతుంది. నన్ను ఆశీర్వదించండి పెద్దత్తయ్య అని చెప్పి.. జాగ్రత్త మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.. అంటుంటే.. నువ్వు కూడా జాగ్రత్త, ఫస్ట్ క్యాంప్ సక్సెస్ చేసి.. వెంటనే తిరిగి వచ్చేయి అంటుంది భవానీ..
ఓ ముకుంద హ్యాపీగా పెళ్లి గురించి కలలు కనడం మొదలు పెట్టింది.. మరోవైపు కృష్ణ సరికొత్త ప్రయాణం మొదలు..