Tollywood: 46 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. మళ్లీ తండ్రికానున్న టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

ఈ టాలీవుడ్ ప్రముఖ నటుడు గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక పాప కూడా పుట్టింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో కొన్నాళ్ల క్రితమే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు.

Tollywood: 46 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. మళ్లీ తండ్రికానున్న టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
Tollywood Actor

Updated on: Oct 07, 2025 | 6:41 PM

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సాయికిరణ్‌ శుభవార్త చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నానని వెల్లడించాడు. తన సతీమని స్రవంతి ప్రస్తుత గర్భంతో ఉందన్న విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు బేబీబంప్ తో ఉన్న తన భార్యతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ మా ఇంటికి కొత్త మెంబర్ వస్తున్నాడు’ అంటూ తన పోస్టుకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు సాయి కిరణ్- స్రవంతి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లెజెండరీ సింగర్, గాన కోకిల సుశీలమ్మకు మనవడైన సాయి కిరణ్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. హీరోగా, సహాయక నటుడిగా ఆడియెన్స్ ను మెప్పించాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’, డార్లింగ్ డార్లింగ్, మనసుంటే చాలు, ఆడంతే అదో టైపు, పెళ్లి కోసం, సత్తా, జగపతి, దేవీ అభయం, మానస, గోపి గోడమీద పిల్లి, రామ్ దేవ్, జగద్గురు ఆది శంకర, సప్తగిరి ఎల్ ఎల్ బీ, నక్షత్రం, బింబిసార తదితర సినిమాల్లో నటించాడు సాయి కిరణ్. వీటిలో నువ్వే కావాలి, ప్రేమించు సినిమాలు సాయి కిరణ్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

కాగా ప్రస్తుతం తెలుగు సీరియల్స్ తో బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం తదితర సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ నటుడు. ఇదే క్రమంలో కోయిలమ్మ సీరియల్ లో తనతో పాటు కలిసి నటించిన స్రవంతిని గత డిసెంబర్ లో ప్రేమ వివాహం చేసుకున్నాడు సాయి కిరణ్. ఇప్పుడు తమ బంధానికి ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు రెడీ అయ్యారీ సెలబ్రిటీ కపుల్.

ఇవి కూడా చదవండి

బేబీ బంప్ తో సాయి కిరణ్ భార్య స్రవంతి

కాగా ఇదివరకే సాయి కిరణ్ కు వైష్ణవి అనే అమ్మాయితో వివాహమైంది. ఇద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

సాయి కిరణ్- స్రవంతి పెళ్లి ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.