జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. ఆ తర్వాత పలు షోలలో కనిపించిన ఆర్పీ.. ఇటీవలే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఓ కర్రీ పాయింట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ షాపుకు వచ్చిన రెస్పాన్స్ చూసి షాకయ్యాడు. కర్రీస్ కోసం అతని షాప్ ముందు బారులు తీరారు.. అతి తక్కువ సమయంలోనే అతని కర్రీ పాయింట్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఎంతో విజయవంతంగా రన్ అవుతున్న షాప్ ను కొన్నిరోజులకే మూసేశాడు. దీంతో దానిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. ఆర్పీ వ్యాపారం మానేశాడని.. దుకాణం క్లోజ్ చేశాడంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఆర్పీ స్పందిస్తూ.. అలాంటి మాటలను నమ్మొద్దని ఆర్పీ క్లారిటీ ఇచ్చాడు. కేవలం కర్రీ పాయింట్ కు వస్తోన్న తాకిడిని తట్టుకోలేకనే క్లోజ్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
తన షాప్ మధ్యలోనే క్లోజ్ చేసిన మాట నిజమే అని.. కానీ కారణం వేరు అని అన్నాడు. నెల్లూరు చేపల పులుసు కోసం ఎగబడుతున్న జనాన్ని చూసే తన షాప్ క్లోజ్ చేశానని.. అంతమందికి సప్లై చేయలేనని తెలిసి తాత్కాలికంగా ఇలా మూసివేసినట్లు చెప్పుకొచ్చాడు. తాజాగా నెల్లూరు చేపల పులుసు ప్రారంభించిన నెల రోజులు అయిన సందర్భంగా తనకు కాబోయే భార్య.. తన స్టాఫ్ తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన షాప్ తిరిగి రీఓపెన్ చేయబోతున్నట్లు తెలిపారు.
కానీ సంక్రాంతి పండగా సందర్భంగా నాలుగు రోజులు కర్రీ పాయింట్ కు సెలవు ఇస్తున్నానని.. పండగ తర్వాత రోజు నుంచి నెల్లూరు చేపల పులుసు అందించేందుకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఇక ఈ షాప్ కోసం కొత్త స్టాఫ్ ను తీసుకున్నట్లు.. అలాగే సప్లై కూడా పెంచనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. రీఓపెనింగ్ తర్వాత నెల్లూరు చేపల పులుసు మెనూలోకి మరో రెండు మూడు కొత్త డిష్ లు కూడా చేర్చనున్నట్లు తెలిపాడు.