Karthika Deepam March 12 Episode: మురళికృష్ణ, కార్తీక్ మధ్య మాటల యుద్ధం.. ఎమోషనల్‏గా మారిన డాక్టర్ బాబు..

|

Mar 13, 2021 | 7:50 AM

టెలివిజన్లో నంబర్ సీరియల్ గా కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్ మార్చి 12 ఎపిసోడ్ లో ఎం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. 

Karthika Deepam March 12 Episode: మురళికృష్ణ, కార్తీక్ మధ్య మాటల యుద్ధం.. ఎమోషనల్‏గా మారిన డాక్టర్ బాబు..
Karthika Deepam
Follow us on

టెలివిజన్లో నంబర్ సీరియల్ గా కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్ మార్చి 12 ఎపిసోడ్ లో ఎం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

దీప, కార్తీక్‌ల ఫోటో చూస్తూ కుమిలిపోతాడు మురళీ కృష్ణ . మీరు తీస్తే బీరువాలో ఉంటుంది. నేను తీస్తే మళ్లీ మీకు దొరకదు అని గతంలో కార్తీక్ గోడ మీద పెట్టిన ఆ ఫోటోని మురళీ కృష్ణ చేతే తీయించిన సీన్ గుర్తు చేసుకుని.. ‘ఈ ఫోటోనే కాదమ్మా.. నిన్ను అజ్ఞాతంలోకి పంపించాడు ఆ మహానుభావుడు.. ఎక్కడున్నావో ఎలా ఉన్నావో..’ అని మనసులో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో కార్తీక్ వచ్చి ఆ ఫోటో తీసుకొని కిందపడేస్తాడు. దాంతో మురుళీ కృష్ణ ముక్కలైన ఫోటోనూ చూస్తూ.. ఆవేశంగా ‘డాక్టర్ బాబు.. ఏంటీ ఈ దౌర్జన్యం? ఎప్పుడు ఏం అన్నా సహిస్తున్నామని మా సహనాన్ని పరీక్షిస్తున్నారా? ఆడపిల్ల తండ్రి సహనానికి కూడా హద్దు ఉంటుంది. కొంచెం సంస్కారం నేర్చుకోండి అంటాడు. వీరిద్దరి గొడవకు భాగ్యం కంగారుగా బయటికి వస్తుంది.

వెంటనే కార్తీక్.. ‘ఏంటీ నేను సంస్కారం నేర్చుకోవాలా.. అదీ మీ దగ్గర నుంచి..? మీ సంస్కారం అంత గొప్పదా? మీ సహనం అద్దులు దాటిపోయిందా? ఎందుకు? ఏం గణకార్యం సాధించారు.. ఇద్దరినీ కన్నారు.. రూపాయి ఖర్చులేకుండా మా ఇంటికి పంపించారు. సంస్కారం మాదా మీదా? మీ దగ్గర నేను సంస్కారం నేర్చుకోవాలా? ఎందుకు? మా సంస్కారం సర్వనాశనం చేసిన ఘనత సాధించినందుకా? అంటూ ఫైర్ అవుతాడు కార్తీక్. ఒకవేళ నేను నిజం చెబితే.. ఆ నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు. సంసారం ముక్కలై మీ కూతురు రోడ్డున పడితే ఆశ్రయం ఇవ్వడం మానేసి రెండో భార్యకు భయపడి కూతుర్ని పట్టించుకోవడం మానేశారు. అలాంటి పెద్దరికం నుంచే నేను సంస్కారం నేర్చుకోవాలా ? ఎంతో ప్రేమగా నా కూతుర్ని నేను పెంచుకున్నాను. దాన్ని కూడా నీ కూతురు తీసుకెళ్ళింది. ఇంకా నీ బిడ్డని నేను క్షమించాలా? అసలు ఎక్కడ దాచిపెట్టింది నా కూతుర్ని?’ అంటూ కార్తీక్ మురళి కృష్ణపై ఫైర్ అవుతాడు. కార్తీ్క్ మాటలు విన్న మురళి కృష్ణ ఆవేశంగా.. ఆగండీ.. ఇందాక ఏం అన్నారు మీ కూతురా? ఎక్కడ నుంచి వచ్చింది మీ కూతురు? ఏ భార్యకు కన్నారు మీ కూతురిని? నా కూతురు లేకుండా నీ కూతురు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిందయ్యా?’ అంటాడు. వెంటనే కార్తీక్… ఎలా పుట్టింది.. అంటూ తన మాటను ఆపేస్తాడు. ఆ విషయం తెలిసాకే.. నీ కూతుర్ని నేను దూరం పెట్టాను.. అంటూ సమాధానం ఇస్తాడు కార్తీక్. వెంటనే ఆవేశం, బాధ కలిగిన కంఠంతో మురళి కృష్ణ.. డాక్టర్ బాబు మర్యాద.. మర్యాదగా మాట్లాడండీ.. పదేళ్ల నుంచి ఇదే మాట.. సంవత్సరాలు గడిచినా అదే మాట, ఎన్ని సంవత్సరాలని నా కూతురు మీ మాటలు పడుతుంది. అది మనిషే కాదా, దానికీ మనసుంది కదా.. మీకు దాన్ని మాటలతో చిత్రవథ చేసే హక్కు ఎవరు ఇచ్చారు? దాన్ని దారుణంగా అవమానించే అధికారం ఎవరు ఇచ్చారు’ అంటూ మండిపోతారు. హక్కు అధికారం గురించి ప్రశ్నిస్తున్నారా? ఏ హక్కుతో నా కూతుర్ని తీసుకుని వెళ్లింది మరి అంటాడు కార్తీక్. నీ కూతురిని నా కూతురు.. నవమాసాలు మోసి కన్నది. అందుకే అదే హక్కుతో తీసుకెళ్ళింది అని మురళికృష్ణ చెప్పగానే.. మరీ నేను పదేళ్లు పెంచి దాన్ని పెద్ద చేశాను. దాని విషయంలో నాకేం హక్కులేదా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. మరీ అధికారం ఉంటే ఆరోజు ఎందుకు ఆపలేదు? ఆ పసిదాని పుట్టుక మీద అనుమానంతోనే కదా? ఇప్పుడు పెంచిన మమకారం గుర్తొచ్చింది. అప్పుడేం అయ్యింది ఆ మమకారం..? మంటకలిసిందా?’ అంటాడు మురళీ కృష్ణ. నాలో మనిషిని చంపేసింది నీ కూతురే.. నాలో ఉన్న తండ్రి మనసుని చిదిమేసింది. నేను మోసపోయానని తెలుసుకునే సరికి ఈ సమయం అయ్యింది. పెంచిన ప్రేమని చంపుకోలేక నా కూతుర్ని అడిగితే ఇవ్వను అని ముఖం మీదే చెప్పెసింది నీ కూతురు. అయినా ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే దూరం నుంచైనా చూడొచ్చులే అనుకుంటే కావాలనే నీ కూతురు నా బిడ్డని దూరంగా తీసుకుని వెళ్లిపోయింది అంటూ మురళి కృష్ణ ముందు తన బాధను చెప్పుకుంటాడు కార్తీక్.
కార్తీక్ మాటాలకు సమాధానం ఇస్తూ మురళికృష్ణ.. నీ కూతుర్ని నా బిడ్డ కావాలని తీసుకుని పోయిందా? గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి ఆ మాట.. మీరు అనుమానిస్తే వెళ్లింది. అవమానిస్తే వెళ్లింది. తిన్నా తినకపోయినా కష్టపడి సౌర్యని పెంచుకుంది. బట్టలు కుట్టకుని బతికింది. ఏనాడు ఎవరినుంచి నయాపైసా ఆశించకుండా ఆత్మాభిమానంతో బతికింది. అయినా నా కూతుర్ని మీరు కుదురుగా ఉండనివ్వలేదు.. మీ మాటలతో దాన్ని చిత్రవథ చేశారు. చెడిపోయిందనే నిందలతోనే దాని మనసును మరింత గాయపరిచారు. మీ పసిబిడ్డల పుట్టుకు మీదే అనుమనం పెంచుకున్నారు. ఏ ఆడదైనా ఎంతకాలం భరిస్తుందయ్యా? ఇక ఈ మనిషి మారడు అని మనసు ముక్కలు చేసుకుని దూరంగా వెళ్లిపోయింది. వెళ్లిపోయిన దాని మీద సానుభూతి చూపించాలన్న సంస్కారం ఎలాగో లేదు.. కనీసం దాన్ని విమర్శించడం మానెయ్యండి.. చదువుకున్న చదువుని బ్రష్టు పట్టించకండి అంటూ ఎమోషనల్ అవుతాడు మురళికృష్ణ. ఆ మాటలు విన్న కార్తీక్.. మురళికృష్ణను.. పోవయ్యా నా వంశాన్నే బ్రష్టుపట్టించిపోయింది నీ కూతురు.. మా కుటుంబ గౌరవాన్నే కాలరాసి పోయింది.. దాని గురించి మర్యాదగా మాట్లాడటం ఏంటీ? నా కూతురు నాకు కావాలి. చెప్పు ఎక్కడుంది నా కూతురు అంటాడు కార్తీక్. మురళి కృష్ణ ఎక్కడుండటం ఏంటీ..? అడవిలో ఉందో అడుక్కుతింటూ ఉందో.. పస్తులతో మాడిపోయి ఉంటుందో..? అంటూ బాధపడిపోతుంటాడు. అటు అత్తాగారింటికి.. ఇటు పుట్టింటికి దూరమైన ఆడది ఏ నుయ్యో గొయ్యో చూసుకుందో ఎవరికి తెలుసయ్యా? నన్ను అడుగతారేంటీ.? మీ ఇంటి గడప దాటిన నాడే నా ఇంటి గడప తొక్కలేదు.. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తుంది? మీ నీడ కూడా తాకని చోటకే వెళ్లి ఉంటుంది అంటాడు. నాటకాలు ఆడకండీ.. మీ కూతురు అలా బతకడానికి కారణం నేను కాదు.. దాని బతుకుని అదే నాశనం చేసుకుంది. అందుకే నాకు సానుభూతి ఉంది. కానీ.. నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో.. ఏం అయ్యిందో అంటూ బాధపడిపోతాడు కార్తీక్. వెంటనే మురళీ కృష్ణ ఏడుస్తూ.. నిజంగా నాకు తెలియదు డాక్టర్ బాబు.. తండ్రి గుండే ఎవరిదైనా ఒక్కటే.. నా బిడ్డ కనబడక నేను ఏడుస్తూనే ఉన్నాను.. నిజంగా నాకు తెలియదు. ఆ విషయాన్ని భాగ్యం కూడా సమర్ధించడంతో… నా కూతుర్ని నేను ఎలాగైనా వెతుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. సీన్ కట్ చేస్తే.. శంకర మటంలో శివరాత్రి జాగారం చెయ్యడానికి వెళ్తున్నాం అని ఆదిత్యా, శ్రావ్యాలకు చెబుతూ ఉంటారు సౌందర్య, ఆనందరావులు. అదే సమయానికి ఎదురుగా వస్తున్న కార్తీక్.. మొక్కా, మొక్కుబడిగా చెప్పాలని జాగారం అని చెబుతున్నారా? అంటాడు. ఆ మాటలు విన్న కార్తీక్ తండ్రి.. రాను రాను మనిషినే నమ్మడం మానేస్తున్నావ్ కార్తీక్ నువ్వు. చివరికి నీ నీడని నమ్మలేని స్థితికి వచ్చేలా ఉన్నావ్‌రా? అంటాడు. సరే సరే వెళ్లి రండీ.. ఆరోగ్యం బాగోలేని మనిషిని తీసుకుని పూజలు మొక్కలు అంటున్నావ్ మమ్మీ.. సరే హిమని అడగానని చెప్పండి.. వాళ్లని డబ్బులకు ఇబ్బంది పడొద్దని చెప్పండి.. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాస్త గడ్డిపెట్టి ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టండి.. అని వెళ్తాడు కార్తీక్. దీప చీరలు మడతపెడతుంటే.. కార్తీక్ దీప.. అని పిలిచినట్లుగా అనిపించి మొదట సంతోషంతో చుట్టూ చూసి వెంటనే బాధతో కోపంతో చేతిలోని చీరలన్నీ విసిరి కొట్టి సోఫాలో కూలబడిపోతుంది దీప. ఇంతలో సౌర్య రావడంతో మొదట అదే కోపంతో మాట్లాడి తర్వాత తగ్గి ప్రేమగా మాట్లాడుతుంది. మేము చదువుతామని ఎవరు అన్నారు? నీకు హెల్ప్ చేస్తూ ఉంటాం. అని అంటుంది. ఆ మాటలకు దీప నాకు కష్టాలుకొత్తెమి కాదమ్మ. మిమ్మల్ని కూడా చదివించుకోలేనా అంటుంది.. వెంటనే సౌర్య బాధగా.. ఒకమాట అడుగుతాను అమ్మా చెబుతావా? అని రిక్వస్ట్ చెస్తుంది. సౌర్య మాటలకు అనునయంగా… చెప్పేదే అయితే చెబుతాను అని దీప అనగానే నాన్న నాకు గుర్తు వచ్చినట్లు నీకు గుర్తురావట్లేదా అమ్మా? అంటుంది. వెంటనే దీపకు కార్తీక్ తనని ప్రేమగా చూసుకున్న సన్నివేశాలు గుర్తొస్తాయి. వెంటనే మాట మారుస్తూ తొందరగా పడుకో.. పొద్దున్నే లేవాలి.. అంటుంది. ఇప్పుడు మన టిఫిన్ సెంటర్ అదే కదా.. అవును హిమ ఏది? అని మాట మార్చే ప్రయత్నం చేస్తుంది దీప. నిజమే హిమ ఏదీ? అని సౌర్య అంటుంది.

కార్తీక్ ముందు హిమ..

హిమ ఆదిత్య, శ్రావ్య మధ్య కూర్చుని.. నేను వచ్చేశాను పిన్నీ.. డాడీని చూడాలని అనిపించి వచ్చేశాను.. ఇంకెక్కడికి వెళ్లను నేను.. డాడీ నన్ను చూడకుండా ఉండలేడు కదా.అంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ పరుగెత్తుకుంటూ వచ్చి హిమని పట్టుకుని.. ‘నాకు తెలుసమ్మా.. నువ్వు వస్తామని నాకు తెలుసు.. బంగారం.. వచ్చేశావా.. హిమా.. అంటూ మురిసిపోతాడు. కార్తీక్ వాలకం చూసిన ఆదిత్య, శ్రావ్యలు హిమ ఎక్కడొచ్చింది అంటూ ప్రశ్నిస్తారు. వెంటనే కార్తీక్ ఎదురుగా ఉండే హిమ కనిపించదు. దీంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. మరిన్ని వివరాలు వచ్చే ఎపిసోడ్‎లో చూద్దాం.

Also Read:

Karthika Deepam : అందరినీ అనుమానించే స్టేజ్‌లో డాక్టర్ బాబు.. అమ్మకు సాయంగా వంటలక్క కూతుర్లు