
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది కరీనా కపూర్. రొమాంటిక్ కామెడీల నుండి క్రైమ్ డ్రామాల వరకు అనేక చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమెకు పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. సౌత్ లోనూ కరీనాకు మంచి ఫాలోయింగ్ ఉంది. కరీనా కపూర్ ‘జబ్ వి మెట్’ తర్వాత ఇంటి పేరుగా మారింది. ప్రస్తుతం ఆమె బి-టౌన్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణులలో ఒకరు. అలాగే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న ఈ కరీనా కపూర్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే కరీనా రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కరీనా. తాజాగా ఆమె కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేసింది. కరీనా కపూర్ సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కరీనాతోపాటు.. ఆమె సోదరి కరిష్మా కపూర్ సైతం కనిపిస్తున్నారు. నివేదికల ప్రకారం ఆ కారు విలువ రూ. 2 నుండి 2.3 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. భారతీయ సెలబ్రిటీలలో ఈ ల్యాండ్ రోవర్ కారు.. సన్నీ డియోల్, సునీల్ శెట్టి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
లాల్ సింగ్ చద్దా తర్వాత ఇప్పుడు కరీనా కపూర్ ప్రదాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ది బకింగ్ హామ్ మర్డర్స్. ఈ చిత్రాన్ని హన్సల్ మెహతా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కరీనా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అలాగే ఆమె రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం 3 లో కనిపించనుంది.
Presenting the poster of #TheBuckinghamMurders. Recently premiered at the British Film Institute with standing ovation pic.twitter.com/UmHU2f7SH5
— Kareena Kapoor Khan FC (@KareenaK_FC) October 17, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.