Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీతో బాలీవుడ్ కి పరిచయమయ్యాడు. తెలుగు చిత్ర సీమకు బాల రామాయణము చిత్రములో రాముడిగా పరిచయం అయ్యాడు. మూడో తరం నుంచి హీరోగా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అడుగు పెట్టి.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సింహాద్రి, యమదొంగ, బృందావనం , రాఖీ , టెంపర్ వంటి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఫేమ్ ను సంపాదించుకున్నాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతున్న తారక్ మరోవైపు స్మాల్ స్క్రీన్ పై తెలుగు బిగ్ బాస్ షో తో హోస్ట్ గా అడుగు పెట్టాడు. చిన్ని తెరపై కూడా హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అందుకున్నాడు.
అయితే మరోసారి స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. జూలై 7 నుండి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో షూట్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నట్లు సమాచారం అంతేకాదు పలు డమ్మీ ఎపిసోడ్స్ ను కూడా షూట్ చేయబోతున్నారు. వీటి కోసం సన్నద్ధమవుతున్నాడు ఎన్టీఆర్. జెమినీ టివిలో ఈ షో వచ్చే నెల నుండి ప్రసారం కానుంది.
అంతకుముందు, స్టార్ మా కోసం నాగార్జున , చిరంజీవిలు ఈ షో ను నిర్వహించగా.. తాజాగా జెమిని టీవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ టీవీ షో పూర్తి వివరాలు త్వరలో బయటకు రిలీజ్ చేయడానికి షో నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.
Also Read: క్రీడానేపథ్యం ఉండి టెన్త్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అస్సోం రైఫిల్స్ నోటిఫికేషన్