Jr. NTR EMK: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మహేష్.. ఎప్పుడు ప్రసారం కానున్నదంటే..

Jr. NTR Evaru Meelo Koteeswarulu: జూ. ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు..

Jr. NTR EMK: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మహేష్.. ఎప్పుడు ప్రసారం కానున్నదంటే..
Ntr Mahesh

Updated on: Oct 27, 2021 | 7:53 AM

Jr. NTR Evaru Meelo Koteeswarulu: జూ. ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ లో హోస్ట్ గా చేసిన బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ మరోసారి ఎవరు మీలో కోటీశ్వరులు షో ని హోస్ట్ చేస్తున్నాడు. జెమిని టివిలో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షో త్వరలో ముగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ సాగిన ఈ షో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మొదటి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ హాట్ సీట్ లో కూర్చున్న ఈ షో కు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. మహేష్‌ బాబు ఎపిసోడ్‌ ను సీజన్ చివరి ఎపిసోడ్‌ గా టెలికాస్ట్‌ చేయాలని భావిస్తున్నారు. చివరి ఎపిసోడ్‌ కు మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. దీంతో ఈ సీజన్ ను నవంబర్‌ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్‌ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇప్పటికే మహేష్‌ బాబు తో ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్‌ చేసి నెల రోజులు దాటింది. మంచి సమయంలో ఈ ఎపిసోడ్‌ ను టెలికాస్ట్‌ చేస్తున్నారు.

Also Read:  2002 నాటి రూ. 5, రూ. 10 నాణెం మీదగ్గర ఉందా.. రూ. 10 లక్షల వరకు పొందండి.. వివరాల్లోకి వెళ్తే..