ఎన్టీఆర్‌తో జోడిక‌ట్ట‌నున్న‌ జాన్వీ?

| Edited By:

Aug 03, 2020 | 5:32 PM

జూనియ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రానున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే దీనిపై అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న రావ‌డంతో నంద‌మూరి అభిమానుల్లో స‌రికొత్త ఉత్సాహం నెల‌కొంది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న ఈ సినిమాకు..

ఎన్టీఆర్‌తో జోడిక‌ట్ట‌నున్న‌ జాన్వీ?
Follow us on

జూనియ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రానున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే దీనిపై అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న రావ‌డంతో నంద‌మూరి అభిమానుల్లో స‌రికొత్త ఉత్సాహం నెల‌కొంది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న ఈ సినిమాకు ‘అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో పెట్టారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో త్రివిక్ర‌మ్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ని టాక్‌.

తాజాగా ఇందులో ఒక హీరోయిన్ రోల్‌కి కియారా అద్వానీని, మ‌రో క‌థానాయిక ప్లేస్‌లో జాన్వీ క‌పూర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రినీ త్రివిక్ర‌మ్ ఫైనల్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రంలో న‌టించ‌డం కోసం జాన్వీకి బాగా రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు టాక్ కూడా న‌డుస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ మూవీలో హీరోయిన్స్‌ ఎవ‌రు అనేది అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. అలాగే ఈ సినిమా క‌థ మొత్తం ఓ పాత కోట చుట్టూ న‌డ‌వ‌బోతుంద‌ట‌. త్వ‌ర‌లోనే వీట‌న్నింటిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వ‌బోతుంద‌ట‌. కాగా ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై ఎస్ రాధాకృష్ణ, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

Read More:

రాఖీ పండుగః మ‌హిళ‌ల‌ కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక

టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌