దిల్‌రాజుపై పవన్ సీరియస్.. ఎందుకంటే?
హిందీలో ‘అమితాబ్ బచ్చన్’ హీరోగా నటించి, ఘన విజయం సాధించిన సినిమా ‘పింక్’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాన్ని నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో.. పవన్ మళ్లీ మేకప్ […]
హిందీలో ‘అమితాబ్ బచ్చన్’ హీరోగా నటించి, ఘన విజయం సాధించిన సినిమా ‘పింక్’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాన్ని నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో.. పవన్ మళ్లీ మేకప్ వేసుకుని, కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ షురూ చేశారు. ‘అజ్ఞాతవాసి’ మూవీ తర్వాత పవన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యి పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు. కానీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన జనసేన అంతగా సత్తా చాటలేకపోయింది. ఇటీవలే బీజేపీతో షేక్‌హ్యాండ్ ఇచ్చి బూస్టప్ తెచ్చుకున్న పవన్.. తన ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తూ ఫిల్మ్ కెరీర్‌ను రీస్టార్ట్ చేశారు.
కాగా.. సినిమావాళ్లకి సెంటిమెంట్స్ మామూలుగా ఉండవు. కొన్నింటిని తప్పక పాటిస్తూ ఉంటారు. అలాగే చాలా సినిమాలు హిట్ కూడా సాధించాయి. ఇదే విధంగా.. ఈ నెల 20వ తేదీ బావుందంటే.. పవన్ మొదటి రోజు షూటింగ్ చిత్రీకరణ స్టార్ట్ చేశారు. అంతలోనే ఏపీలో.. పాలిటిక్స్ హాట్‌గా ఉండటంతో.. షూటింగ్ రోజు సాయంత్రమే అమరావతి చేరుకున్నారు. అయితే.. షూటింగ్ జరిగిన వివరాలు బయటకు రాకుండా.. పవన్‌తో పాటు నిర్మాత దిల్ రాజు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా పవన్ షూటింగ్ పిక్స్, వీడియోలు లీక్ అయ్యాయి. ఈ విషయంపైనే దిల్ రాజుపై పవన్ కాస్త సీరియస్ అయ్యారట. ఇప్పటి నుంచైనా.. షూటింగ్‌కి సంబంధించిన వివరాలు కాస్త జాగ్రత్తగా ఉంచాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలాంటి సమాచారం బయటకు రాకూడదని చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల టాక్.