Jabardasth Faima: చేతికి సెలైన్‏తో ఆసుపత్రిలో జబర్ధస్త్ ఫైమా.. కంగారు పడుతున్న అభిమానులు..

|

Nov 26, 2023 | 7:35 AM

తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియో చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఫైమాకు ఏం జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ తన కామెడీతో నవ్వించే ఫైమా.. ఇప్పుడు ఆసుపత్రిలో చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించింది. నా గతమంతా నే మరిచానే అనే పాటను ఈ వీడియోకు జోడించింది. ఆవీడియోలో ఫైమాకు బ్లడ్ టెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ తనకు ఏం అయ్యిందనే విషయాన్ని చెప్పలేదు. ప్రస్తుతం పైమా వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో ఫైమాకు ఏం జరిగిందని ?..

Jabardasth Faima: చేతికి సెలైన్‏తో ఆసుపత్రిలో జబర్ధస్త్ ఫైమా.. కంగారు పడుతున్న అభిమానులు..
Jabardasth Faima
Follow us on

ఫైమా అంటే తెలియిని తెలుగువారుండరు. జబర్దస్త్ కామెడీ షోలో తన యాక్టింగ్, పంచులతో తెగ ఫేమస్ అయిపోయింది. బుల్లెట్ భాస్కర్ టీంలో ఫైమా కామెడీ హైలెట్. తన మాటల గారడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది. ఈ షోను నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో చలాకీగా ఉంటూ రీల్స్ చేస్తూ సందడి చేసే ఫైమా.. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియో చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఫైమాకు ఏం జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ తన కామెడీతో నవ్వించే ఫైమా.. ఇప్పుడు ఆసుపత్రిలో చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించింది. నా గతమంతా నే మరిచానే అనే పాటను ఈ వీడియోకు జోడించింది. ఆవీడియోలో ఫైమాకు బ్లడ్ టెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ తనకు ఏం అయ్యిందనే విషయాన్ని చెప్పలేదు. ప్రస్తుతం ఫైమా వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో ఫైమాకు ఏం జరిగిందని ?.. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఓ సాధారణం కుటుంబం నుంచి వచ్చినా ఫైమా.. పటాస్ షోకు అడియన్ గా వెళ్లింది. అక్కడ తన అల్లరి చూసి కంటెస్టెంట్ గా అవకాశం ఇచ్చారు. ఇక పటాస్ స్టేజ్ పై తనదైన పంచులతో, కామెడీతో అందరిని నవ్వించింది. ఆ తర్వాత పలు షోలలో పాల్గొన్న ఫైమాకు జబర్ధస్త్ షోలో అవకాశం వచ్చింది. ఇక ఈ షోలో ఫైమా మేనరిజమ్, కామెడీ టైమింగ్, డాన్స్ తో అదరగొట్టేసింది. ఫైమా స్కిట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూసే క్రేజ్ సంపాదించుకుంది. జబర్ధస్త్ షోలో ఎవరూ ఊహించని ఫాలోయింగ్ అందుకుంది.

దీంతో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ దాదాపు 10 వారాలు హౌస్ లో ఉంది. చాలా సంవత్సరాలుగా అమ్మకు ఓ మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేదే తన కోరికి అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక అనుకున్నట్లే.. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకుంది ఫైమా. తన తండ్రితో కలిసి కొత్తింట్లోకి వెళ్తున్న వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.