Tollywood: ఎవడీ అందగాడు? ఒక్కసారిగా స్మార్ట్ గా మారిపోయిన టాలీవుడ్ కమెడియన్.. పెద్ద ప్లానింగే!

వెండితెరపై కానీ, బుల్లితెరపై కానీ రాణించాలంటే అందంగా, ఒడ్డూ పొడవు ఉండాలన్నది చాలా మంది అభిప్రాయం. అయితే ఇవీ లేకున్నా కేవలం తమ యాక్టింగ్ ట్యాలెంట్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఈ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Tollywood: ఎవడీ అందగాడు? ఒక్కసారిగా స్మార్ట్ గా మారిపోయిన టాలీవుడ్ కమెడియన్.. పెద్ద ప్లానింగే!
Jabardasth Actor

Updated on: May 28, 2025 | 12:24 PM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ మరికొన్ని రోజుల్లో షురూ కానుంది. పలువుర బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్లు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ బిగ్ బాస్ షో కోసం ఒక కమెడియన్ స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. తెల్లగా మారిపోయి.. మంచి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశాడు. పైగా కళ్లకు గ్లాసెస్, కలర్ ఫుల్ టీషర్టూ.. ట్రిమ్మింగ్ తో ఒక హ్యాండ్సమ్ హీరోలాగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ కమెడియన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నాడు. ఎవడీ అందగాడు? అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. జబర్దస్త టీవీ షోస్ చూసే వారికి ఇతను బాగా పరిచయమే. ట్యాలెంట్ కు, అందానికి సంబంధం లేదని తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడంలో ఈ నటుడు మేటి. అయితే ఉన్నట్లుండి ఇలా స్టైలిష్ లుక్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతను మరెవరో కాదు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇమ్మాన్యుయేల్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో చాలా స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాడు. అయితే ఈ ఫొటోలకు అతను ఇచ్చిన క్యాప్షన్ తో అసలు విషయం బయటపడింది. ‘త్వరలో ఈ లుక్‌తో ఎంట్రీ ఇస్తా వెయిట్ అండ్ వాచ్’ అంటూ క్యాప్షన్ పెట్టిన ఇమ్మాన్యుయేల్ ఇవి ఏఐ ఫొటోలని చెప్పకనే చెప్పాడు. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఏఐ ఫొటోలతో ఇమ్మాన్యుయేల్ హల్ చల్..

కాగా బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ లోకి ఇమ్మానుయేల్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. అందుకోసమే అతను స్టైలిష్ గా మారేందుకు ట్రై చేస్తున్నాడని సమాచారం.

ఓ టీవీ షోలో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఇమ్మాన్యుయేల్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .