Tollywood: షాకింగ్.. ప్రముఖ నటికి క్యాన్సర్.. లివర్‌లో టెన్నిస్ బాల్ సైజుల్ కణితి.. నా కోసం ప్రార్థించాలంటూ..
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా ఇప్పటి వరకు క్యాన్సర్ కు సరైన మందు దొరకలేదు. దీంతో చాలా మంది ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ బుల్లితెర నటి తనకు క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడించింది.

ప్రముఖ బాలీవుడ్ నటి టీవీ నటి దీపికా కక్కర్ తన అభిమానులతో చాలా విచారకరమైన వార్తను పంచుకుంది. తనకు క్యాన్సర్ ఉందని, కాలేయంలో టెన్నిస్ బాల్ సైజులో కణితి ఉందని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా స్టేజ్-2 క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిందీ అందాల తార. ఈ సందర్భంగా తన ప్రియవైన వారందరూ తన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరింది దీపిక. ‘గత కొన్ని వారాలు నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా ఉన్నాయి. నాకు చాలా రోజులుగా నా పొత్ తికడుపు పైభాగంలో నొప్పిగా ఉంది. దీంతో మేం ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నా. అక్కడ నా కాలేయంలో టెన్నిస్ బంతి పరిమాణంలో కణితి ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఇది స్టేజ్-2 క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది.
‘ నేను ఇప్పటికే చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాను. అయినా నేను ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నాను. క్యాన్సర్ మహమ్మారిని పూర్తి ధైర్యంతో ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే దీని నుంచి కోలుకుంటానని భావిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో నా కుటుంబం మొత్తం నాకు తోడుగా నిలిచింది. అలాగే మీ ప్రేమాభిమానాలు, ప్రార్థనలు కూడా మాతో ఉన్నాయి. దయచేసి నాకోసం ప్రార్థించండి’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది దీపిక.
ప్రస్తుతం ఈ బుల్లితెర నటి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దీపిక పోస్టుకు స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, దీపిక కక్కర్ భర్త షోయబ్ ఇబ్రహీం తన వ్లాగ్‌లో దీపికకు కడుపులో నొప్పిగా ఉందని పేర్కొన్నారు. తరువాత, పరీక్షల్లో ఆమె కాలేయంలో కణితి ఉన్నట్లు తేలింది. దీపికకు గతంలో శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. కానీ ఫ్లూ కారణంగా అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆ కణితి క్యాన్సర్ అనే వార్త దీపిక కుటుంబాన్ని మాత్రమే కాకుండా లక్షలాది మంది అభిమానులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.
భర్త, కుమారుడితో దీపిక..
View this post on Instagram
ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల పాత్రలతో బాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా చేరువైంది దీపిక. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచింది. అదే ఏడాదిలో షోయబ్ ఇబ్రహీంతో వివాహం జరిగింది. వీరికి 2023లో ఒక అబ్బాయి పుట్టాడు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








