Jabardasth Avinash: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న జబర్ధస్త్ అవినాష్.. ఎంగెజ్‏మెంట్ ఫోటోస్ వైరల్… అమ్మాయి ఎవరంటే..

|

Sep 01, 2021 | 7:32 AM

బుల్లితెర ప్రేక్షకులకు జబర్ధస్త్ అవినాష్ సుపరిచితమే. జబర్ధస్త్ షో ద్వారా కమెడియన్‏గా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ అదే ఫేమ్‏తో ఫేమస్

Jabardasth Avinash: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న జబర్ధస్త్ అవినాష్.. ఎంగెజ్‏మెంట్ ఫోటోస్ వైరల్... అమ్మాయి ఎవరంటే..
Avinash
Follow us on

బుల్లితెర ప్రేక్షకులకు జబర్ధస్త్ అవినాష్ సుపరిచితమే. జబర్ధస్త్ షో ద్వారా కమెడియన్‏గా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ అదే ఫేమ్‏తో ఫేమస్ రియాల్టీ షో బిగ్‏బాస్‏లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‏బాస్‏లో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు అవినాష్. అందులో ఆరియానాతో ఎక్కువగా స్నేహం చేసి.. నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు. దాదాపు పైనల్ వరకు వెళ్లిన అవినాష్.. అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు షాకయ్యారు. ఇక బిగ్‏బాస్‏ ఇంటి నుంచి వచ్చిన తర్వాత నెట్టింట్లో అవినాష్ చేసిన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీముఖితో కలిసి అవినాష్ వీడియోలు చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ వచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల అవినాష్ నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవినాష్ తన ఇన్‏స్టాలో షేర్ చేశారు.

అయితే బిగ్‏బాస్‏లో ఉన్న సమయంలో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు అవినాష్. గతంలో ఓసారి అవినాష్ పెళ్లి గెటప్‏లో ఉన్న ఫోటోను సైతం నెట్టింట్లో షేర్ చేయడంతో నిజంగానే అవినాష్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రూమర్లకు చెక్ పెడుతూ.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు అవినాష్. అనూజ అనే అమ్మాయితో ఎంగెజ్‏మెంట్ జరిగినట్లుగా తెలిపాడు అవినాష్. ఎంగెజ్‏మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎక్కువ రోజులు వెయిట్ చేసిన తర్వాత సరైన వ్యక్తి మీ జీవితంలో వచ్చేస్తారు. మా రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. అలాగే మేము కలుసుకున్నాము. మా నిశ్చితార్థం. మీరందరూ నన్ను చాలాసార్లు అడిగారు మీ పెళ్లి ఎప్పుడూ అని.. అతి త్వరలోనే నా అనూజతో.. ఇలాగే మీ ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటూ మీ ముక్కు అవినాష్.. సారీ అనూజ అవినాష్ అంటూ పోస్ట్ చేశాడు అవినాష్.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Seetimaar Trailer Review: యాక్షన్ ఓరియెంటెడ్‏గా సీటీమార్ ట్రైలర్.. అదరగొట్టిన గోపీచంద్..

Tollywood Drug Case: ఇవాళ్టికి ముగిసిన విచారణ.. పూరీ బ్యాంకు లావాదేవీలపై ఈడీ ఫోకస్.. అసలేం జరిగిందంటే..