దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు 2 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా విధించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలు మూసివేశారు. ఈ మాహమ్మారి అటు సినీ పరిశ్రమను కూడా ఏ మాత్రం వదలడం లేదు. ఇప్పటికే టాలీవుడ్‌లో కొందరు స్టార్ సెలెబ్రిటీలు కరోనా బారినపడ్డారు. దీంతో పలు సినిమా షూటింగ్స్ నిలిపివేయగా.. కొన్ని సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవిడ్ వైరస్ మరోసారి బుల్లితెరను తాకింది. జబర్థస్త్ బ్యూటీ వర్షకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా లైవ్‌లోకి వచ్చి ఈ విషయాన్ని ప్రకటిస్తూ తన ఫాలోవర్లందరికీ కొన్ని సూచనలు ఇచ్చారు.
ఇలా సడెన్‌గా లైవ్‌లోకి వచ్చాను అందరూ ఆశ్చర్యపోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితి వల్ల ఇలా రావాల్సి వచ్చింది. ఓ రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. మరి అంత సీరియస్‌గా ఏమీ అనిపించలేదు కానీ కరోనా పరీక్షలు చేసుకున్నాను. అందులో పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని లైవ్‌లోకి వచ్చి ఎందుకు చెప్పాలి అని అనుకున్నాను అంటే.. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది.ఇక్కడ జరిగిందేది ఎవ్వరికీ తెలియదు.. చూస్తే భయపడతారు. చనిపోయిన వారిని అలా ప్యాక్ చేసి పడేస్తున్నారు. అది చూడగానే లైవ్‌లోకి వచ్చిచెప్పాలని అనుకున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి.. రోజూ వేడి నీళ్లు తాగండి.. ఇంకా ఏ జాగ్రత్తలు ఉంటే అవన్నీ తీసుకోండి అని వర్ష అందరికీ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపింది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలకు తప్పని కరోనా కష్టాలు… షూటింగ్స్ పై కోవిడ్ ఎఫెక్ట్..
Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ గురించి చెప్పుకోచ్చిన డైరెక్టర్..
పుష్ప సినిమాలో యాక్షన్ సీన్లే హైలైట్ గా ఉండనున్నాయట.. ఫైట్స్ కోసం ఏకంగా అంత ఖర్చు చేస్తున్నారా
Keerthy Suresh: రేసులో వెనకబడ్డ అందాల భామ.. మహేష్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న మహానటి