నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 8న రీలీజై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మూవీని డిసెంబర్ 20 న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా బాలయ్య-బోయపాటి ఇటీవల తమ కాంబోలో మూడో మూవీని లాంఛనంగా స్టార్ట్ చేశారు. గతంలో వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బాస్టర్ బొమ్మలను అందించారు. త్వరలోనే వీరి తాజా మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
మరోసారి నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా ఉండబోతుందని బోయపాటి ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. అసలు బాలయ్య వెయిట్ తగ్గింది కూడా ఈ మూవీ కోసమేనట. అయితే ఈ చిత్రం లేటెస్ట్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ కనిపించనున్నారని టాక్. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం..బోయపాటి రష్మీని అప్రోచ్ అయ్యారట. దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ‘గుంటూర్ టాకీస్’ తర్వాత రష్మీకి చెప్పుకోదగ్గ పాత్రలేమీ రాలేదు. లేట్ అయినా కానీ అగ్ర కథానాయకుడి సరసన ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.