HIT 2 : సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న హిట్ 2కు భారీ క్రేజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ డీల్ సెట్

|

Dec 03, 2022 | 7:27 AM

పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. మీనాక్షి చౌద‌రి ఇందులో అడివి శేష్ జోడీగా న‌టించింది. న్యాచురల్ స్టార్ నాని స‌మ్ప‌ర‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మించారు.

HIT 2 : సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న హిట్ 2కు భారీ క్రేజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ డీల్ సెట్
Hit 2
Follow us on

అడవి శేష్ నటించిన హిట్ 2 సినిమా నిన్న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శైలేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. మీనాక్షి చౌద‌రి ఇందులో అడివి శేష్ జోడీగా న‌టించింది. న్యాచురల్ స్టార్ నాని స‌మ్ప‌ర‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది ఈ మూవీ..ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ అన్నపుడు కచ్చితంగా ఆ ప్రెజర్ ఉంటుంది. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి.. అంచనాలు అందుకుంటేనే రిజల్ట్ పాజిటివ్‌గా ఉంటుంది. ఈ విషయంలో ‘హిట్’ దర్శకుడు శేలేష్ కొలను సక్సెస్ అయ్యాడు. అడివి శేష్ మరోసారి అద్భుతంగా నటించాడు.. స్క్రీన్ మీద హిట్ ఆఫీసర్‌గా సూపర్ హిట్ అయ్యాడని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ కోసం భారీ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ కు డీల్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ 2 సినిమా హక్కులను కూడా కైవసం చేసుకుందని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమా హక్కులను డిస్ని హాట్ స్టార్ సొంతచేసుకోవాలని ప్రయత్నించినా.. ఫైనల్ గా అమెజాన్  హిట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక హిట్ 2 సినిమాకు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. శేష్ కెరీర్ లో బిగెస్ట్ ఓపినింగ్స్ వచ్చిన సినిమాగా హిట్ 2  నిలిచిందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో రావు ర‌మేష్‌, శ్రీనాథ్‌ మాగంటి, కోమ‌లి ప్రసాద్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక త్వరలో హిట్ 3 సినిమా రానుందని హింట్ ఇచ్చారు.