Bigg Boss Season 6: ‏బిగ్‏బాస్‏లోకి ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటి ?.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న..

యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో అర్జున్ కళ్యాణ్, కామెన్ సామాన్యుడు రాజశేఖర్, శ్రీహాన్, సింగర్ రేవంత్, దీపిక పిల్లి, వాసంత కృష్ణన్, గలాటా గీతూ,

Bigg Boss Season 6: ‏బిగ్‏బాస్‏లోకి 'గుప్పెడంత మనసు' సీరియల్ నటి ?.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న..
Dharani
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 02, 2022 | 5:11 PM

మరో రెండు రోజుల్లో బుల్లితెరపై అసలైన ఎంటర్టైన్మెంట్ మొదలు కానుంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షో ఈ ఆదివారం (సెప్టెంబర్ 4న) గ్రాండ్‏గా ప్రారంభం కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‏బాస్ చర్చ మొదలైంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ క్వారంటైన్‏లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ లీస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. చలాకి చంటి.. యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో అర్జున్ కళ్యాణ్, కామెన్ సామాన్యుడు రాజశేఖర్, శ్రీహాన్, సింగర్ రేవంత్, దీపిక పిల్లి, వాసంత కృష్ణన్, గలాటా గీతూ, నటి శ్రీసత్య, అభినయ శ్రీ, రోహిత్, మెరీనా అబ్రహాం వీళ్లు షోలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈసారి షోలోకి ముందుగా 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారని.. ఆ తర్వాత నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సీరియల్ ధరణి సైతం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కార్తీక దీపం తర్వాత రెండవ స్థానంలో ఉన్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో రిషికి వదిన పాత్రలో నటిస్తోన్న ధరణి తన అమాయకపు నటనతో.. అందంతో.. బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరైన సంగతి తెలిసిందే. ఆమె అసలు పేరు జ్యోతి పూర్ణిమ. అయితే ఇటీవల ఎపిసోడ్‏లో ధరణి పాత్రలోకి నటి సీతామహాలక్ష్మి ఎంట్రీ ఇచ్చింది. దీంతో పాత ధరణీ మారిపోయింది. అయితే ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న.. గుర్తింపు తెచ్చుకున్న ధరణి పాత్ర నుంచి జ్యోతి మిస్ కావడంతో ఆమె బిగ్‏బాస్‏ షోలోకి వెళ్తుందని.. అందుకే సీరియల్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. బిగ్‏బాస్‏ సీజన్ 6 లోకి జ్యోతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ నడుస్తోంది. చూడాలి మరీ.. ధరణిగా అమాయకపు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతి.. బిగ్‏బాస్‏ రియాల్టీ షో ద్వార ఎంతవరకు మెప్పిస్తోందో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి