బుల్లితెర బాహుబలి కార్తీకదీపం. గత ఆరేళ్లుగా ఈ సీరియల్ టెలివిజన్ లో అగ్రస్థానంలో ఉంది. ఇక దీని తర్వాత రెండవ స్థానంలో గుప్పెడంత మనసు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. కొన్నేళ్లుగా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న కార్తీక దీపం సీరియల్‌ను పక్కకు నెట్టి అగ్రస్థానానికి చేరింది గుప్పెడంత మనసు. ఈ సీరియల్‌కు రోజు రోజుకీ ప్రేక్షకాదరణ పెరిగిపోతుంది. ఈ సీరియల్‌కు స్పెషల్ అట్రాక్షన్ రిషి, వసుధార. వీరిద్దరి మధ్య వచ్చే చిలిపి తగదాలు.. అల్లరి.. పంతాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు.. బుల్లితెర హీరో రిషికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రిషి.. ఇతని అసలు పేరు ముఖేష్ గౌడ. ఇందులో చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమై… అమ్మ అంటేనే విపరీతమైన కోపం పెంచుకుంటాడు రిషి. అమ్మ ప్రేమకు దూరమై తనలో తానే కుమిలిపోయిన ఓ కుర్రాడు చెప్పే మాటలు ఆడియన్స్ మనసును కలిచివేస్తాయి. ముక్కుమీద కోపం.. ఇగో మాస్టార్‌గా ఉండే రిషి.. ఇప్పుడు వసుధార ప్రేమలో మునిగితేలుతున్నాడు. అటు తల్లిని కోప్పడే కొడుకుగానే కాకుండా.. తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకుగాను మెప్పిస్తున్నాడు రిషి. తన తండ్రి మహేంద్ర, రిషి మధ్య వచ్చే సీన్స్ చూస్తే వీరిద్దరు రియల్ తండ్రికొడుకులా అన్న సందేహం రాకమానదు. అంతగా తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాందించుకున్న రిషి.. జీవితంలో మాత్రం ఎంతో విషాదం ఉంది. ఇటీవల స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో స్టార్ పరివార్ అవార్డ్స్ వేదికపై తన తండ్రిని పరిచయం చేశాడు రిషి.
కొడుకు అన్ని తానై భరోసాగా ఉండాల్సిన తండ్రి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో నిజజీవితంలో తండ్రికి తానే తండ్రిగా మారి సేవలు చేస్తున్నాడు. చిన్నపిల్లాడిగా తన తండ్రికి సేవలు చేస్తూ.. అన్నం తినిపిస్తూ.. కంటికి రేప్పాల కాపాడుకుంటున్నాడు. అంతేకాకుండా.. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని రిషి చెప్పడంతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. ” మా నాన్నను నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను. అందరి జీవితంలో ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ నా జీవితంలో జరిగింది. నాన్నకు నేనే నాన్నను కావడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ” అంటూ తన తండ్రిని చూసి భావోద్వేగానికి గుర్యయాడు రిషి. తన తండ్రికి అన్నం తినిపిస్తూ.. ఎంతో అప్యాయంగా చూసుకుంటూ.. కన్న తండ్రిని కొడుకులా చూసుకున్న వీడియోను ప్లే కావడంతో ప్రేక్షకులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
గుప్పెడంత మనసు సీరియల్ కంటే ముందు రిషి కన్నడలో పలు సీరియల్స్ లో నటించాు. మెడలింగ్ తో కెరీర్ ఆరంభించిన రిషి.. ఆ తర్వాత 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెలుచుకున్నాడు. నాగకన్నిక అనే సీరియల్ ద్వారా బుల్లితెర అరంగేట్రం చేసిన రిషి.. ఆ తర్వాత ప్రేమ నగర్ సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా గుర్తింపు వచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.