Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? స్టార్ నటుడి కుమారుడు..ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్.. క్రేజ్ వేరే లెవెల్

ఇతని తండ్రి టాలీవుడ్ లో బాగా ఫేమస్. నటుడిగా, రచయిత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఇతను కూడా తండ్రి జాడల్లోనే నడిచాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అతి పిన్న వయసులోనే ట్యాలెంటెడ్ నటుడిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? స్టార్ నటుడి కుమారుడు..ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్.. క్రేజ్ వేరే లెవెల్
Tollywood Serial Actor

Updated on: Nov 17, 2025 | 8:56 PM

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. అలాగనీ స్టార్ హీరో ఏమీ కాదు. కానీ అంతకు మించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల ఇతనంటే పడి చస్తారు. ఇతను విజయవాడలోనే పుట్టి పెరిగాడు. ఆ తర్వాత చెన్నై లో ఎంబీఏ వరకు చదువుకున్నాడు. తండ్రి సినిమా రంగంలో ఉండడంతో చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 20 ఏళ్ల వయసులోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చి అతి పిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు టీవీ ఉంటే ప్రతి ఇంట్లో ఇతని పేరు వినిపిస్తుంటుంది. అంతలా తన నటనతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇంతకీ ఆ కుర్రాడని గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? మరోసారి జాగ్రత్తగా గమనించండి అప్పుడు మీకే అర్థమవుతుంది. ఆ కుర్రాడెవరో కాదు కార్తీక దీపం సీరియల్ నటుడు నిరుపమ్ పరిటాల అలియాస్ కార్తీక్. ఇది అతని చిన్ననాటి ఫొటో. చిన్నతనంలో బొద్దుగా ఉండే నిరుపమ్ ఇప్పుడు స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా మారిపోయాడు. ముఖ్యంగా అమ్మాయిల ఫేవరెట్ యాక్టర్ గా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

కాగా నిరుపమ్ పరిటాలా మరెవరో కాదు.. టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత ఓంకార్ పరిటాల కొడుకు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట్లో కొన్ని సీరియల్స్ చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే చంద్రముఖి సీరియల్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఆ తర్వాత కాంచన గంగ, కలవారి కోడలు, మావి చిగురు, కన్యాదానం, కలియుగ రామాయణం, కలవారి కోడళ్లు, మూగ మనుషులు, అత్తారింటికి దారేది, గృహ ప్రవేశం, ప్రేమ, హిట్లర్ గారి పెళ్లాం, ప్రేమ, రాధకు నీవేరా ప్రాణం, జీన్స్, క్యాష్, 100 పర్సెంట్ లక్ లాంటి సీరియల్స్‌, టీవీ షోలతో బుల్లితెర స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ నిరుపమ్ కు ఎనలేని క్రేజ్ ను తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

నిరుపమ్ లేటెస్ట్ ఫొటోస్..

కాగా నిరుపమ్ సినిమాల్లోనూ నటించాడు. 2009లో ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన అతను 2014లో ఎన్టీఆర్ రభస సినిమాలో నటించాడు. అలాగే 2017లో విడుదలైన నెక్ట్స్‌ నువ్వే సినిమాకి మాటలు కూడా రాశాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.