Tollywood: చిరంజీవితో ఉన్న ఈ చంటోడిని గుర్తు పట్టారా?7వ తరగతిలోనే నంది అవార్డు.. ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో

ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్నతనంలోనే బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తన నటనా ప్రతిభకు నంది పురస్కారం వంటి ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు హీరోగానూ, యాంకర్ గానూ అదరగొడుతున్నాడు.

Tollywood: చిరంజీవితో ఉన్న ఈ చంటోడిని గుర్తు పట్టారా?7వ తరగతిలోనే నంది అవార్డు.. ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో
Chiranjeevi

Updated on: Oct 21, 2025 | 6:39 PM

పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఈ చంటోడిని గుర్తు పట్టారా? చూస్తుంటే ఇదొక ఫొటో ఫ్రేమ్ లా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు, సీరియల్స్ , టీవీ షోల్లో నటిస్తోన్న ఓ ప్రముఖ నటుడి సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ఫొటో దర్శనమిచ్చింది. మరి ఈ ఫొటోలో చిరంజీవి పక్కన ఉన్నదెవరో కనిపెట్టారా? అతను ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. వెండితెరతో పాటు బుల్లితెరను ఏలుస్తున్నాడు. హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా, యాంకర్ గా.. ఇలా మల్టీ ట్యాలెంట్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా బుల్లితెరపై ఈ నటుడికి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వెళతారు.. కానీ ఇతను చాలా డిఫరెంట్. ఛైల్డ్ ఆర్టిస్టుగా చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. చిన్నప్పుడే తన నటనతో అందరినీ మెప్పించాడు. తన నటనా ప్రతిభకు ఏకంగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. అది కూడా దివంగత సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా.. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. అయితే ఎందుకోగానీ వర్కవుట్ అవ్వలేదు.

దీంతో నిరాశపడకుండా బుల్లితెరకు వచ్చేశాడు. అంతే ఒకే ఒక్క సీరియల్ ఈ నటుడి జీవితాన్ని మార్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటిల్లి పాదికి దగ్గర చేసింది. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న అతను మరెవరో కాదు బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగుల పల్లి.

ఇవి కూడా చదవండి

కుమారుడి ఫస్ట్ బర్త్ డే వేడుకల్లో మానస్..

ఛైల్డ్ ఆర్టిస్టుగా బాలయ్య నరసింహనాయుడు, మహేష్ బాబు అర్జున్, రవితేజ వీడే సినిమాల్లో నటించాడు మానస్. ఏడో తరగతిలోనే ఓ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా తీసుకున్నాను. ఇక ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ఝలక్, గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌లో పాల్గొని గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నాడు. ఈ షో నుంచి బయటకు రాగానే కోయిలమ్మ, బ్రహ్మముడి సీరియల్స్ తో బుల్లితెర హీరోగా బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పలు సీరియల్స్ తో పాటు జబర్దస్త్ షోకు యాంకర్ గానూ వ్యవహరిస్తున్నాడు.

భార్యతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.