మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!

| Edited By: Pardhasaradhi Peri

Mar 10, 2020 | 2:51 PM

మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరు చెబితే చాలు…తెలుగువారు ఎక్కడ ఉన్నా ప్రకంపనలు చెలరేగుతాయి. స్వశక్తితో పైకి వచ్చి..అనతికాలంలోనే సుప్రీం హీరో, మెగాస్టార్ ట్యాగ్స్ అందుకున్నారు చిరంజీవి. ముఖ్యంగా ఆయన డ్యాన్స్‌లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ప్రస్తుతం 60 ప్లస్‌ ఏజ్‌లోనూ ఆయన వరస సినిమాలతో దుమ్మురేపుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఆచార్య(వర్కింగ్ టైటిల్‌) మూవీలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా దాదాపు ఫైనల్ అయిపోయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అబ్డేట్ మెగా ఫ్యాన్స్‌ను […]

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!
Follow us on

మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరు చెబితే చాలు…తెలుగువారు ఎక్కడ ఉన్నా ప్రకంపనలు చెలరేగుతాయి. స్వశక్తితో పైకి వచ్చి..అనతికాలంలోనే సుప్రీం హీరో, మెగాస్టార్ ట్యాగ్స్ అందుకున్నారు చిరంజీవి. ముఖ్యంగా ఆయన డ్యాన్స్‌లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ప్రస్తుతం 60 ప్లస్‌ ఏజ్‌లోనూ ఆయన వరస సినిమాలతో దుమ్మురేపుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఆచార్య(వర్కింగ్ టైటిల్‌) మూవీలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా దాదాపు ఫైనల్ అయిపోయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అబ్డేట్ మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది. ఉగాదికి మూవీ ఫస్ట్‌ లుక్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఉగాది కానుకగా మార్చి 25న ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం. దేవాదాయ శాఖ థీమ్‌తో కథ ఉంటుందని తెలియడంతో మూవీపై మంచి ఆసక్తి నెలకుంది. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ మూవీని సంయక్తంగా నిర్మిస్తున్నారు.