Mogalirekulu serial: ‘మొగలిరేకులు’ సీరియల్ కీర్తన గుర్తుందా..? లేటేస్ట్ ఫోటోస్ వైరల్..

|

Oct 11, 2024 | 8:28 AM

ఇందులోని ఆర్కే నాయుడు, మున్నా, శాంతి, సెల్వ, దేవి పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇందులో ఒకే అమ్మాయి రెండు విభిన్న పాత్రలు పోషించింది. అందులో తన అమాయకమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తనే కీర్తన.. అలియాస్

Mogalirekulu serial: మొగలిరేకులు సీరియల్ కీర్తన గుర్తుందా..? లేటేస్ట్ ఫోటోస్ వైరల్..
Medha
Follow us on

మొగలిరేకులు .. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని సీరియల్. అప్పట్లో బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ ప్రభంజనం సృష్టించింది. కొన్నేళ్లపాటు టెలివిజన్ రంగంలో టీఆర్పీ రేటింగ్‏లో అత్యధిక వ్యూస్ తో మొదటిస్థానంలో కొనసాగింది. అప్పుడు, ఇప్పుడు ఈ సీరియల్‏కు అభిమానులు ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు కూడా యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ బుల్లితెర ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది. మంజుల నాయుడు దర్శకత్వం వహించిన ఈ సీరియల్లో అప్పట్లో యంగ్ స్టార్స్ నటించేవారు. ఈ సీరియల్ దాదాపు మూడేళ్లు సాగింది. ఇప్పుడు టీవీల్లో రోటీన్ గా సాగుతున్న స్టోరీస్ కాకుండా.. అప్పట్లో ఈ సీరియల్లో ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠభరితంగా.. ట్విస్ట్స్.. సస్పెన్స్.. ఎమోషన్స్.. లవ్.. ఇలా అన్ని కలగలపి ఉండేది. అందుకే ఈ సీరియల్ కు అప్పట్లో మంచి యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఈ సీరియల్లో నటించిన నటీనటులకు హీరోహీరోయిన్స్ రేంజ్ లో అభిమానులు ఉండేవారు. ముఖ్యంగా ఇందులోని ఆర్కే నాయుడు, మున్నా, శాంతి, సెల్వ, దేవి పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇందులో ఒకే అమ్మాయి రెండు విభిన్న పాత్రలు పోషించింది. అందులో తన అమాయకమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తనే కీర్తన.. అలియాస్ సింధు అలియాస్ మేధ.

మొగలిరేకులు సీరియల్లో కీర్తన.. సింధు..ఇలా రెండు విభిన్న పాత్రలలో కనిపించిన తనదైన నటనతో అడియన్స్ హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ఆ అమ్మాయి పేరు మేధా. ఇప్పటికీ బుల్లితెర ఆడియన్స్ ఫేవరేట్ హీరోయిన్ గా ఉండిపోయింది. కానీ ఈ సీరియల్ కంటే ముందు మేధా చక్రవాకం సీరియల్లో కనిపించింది. మొగలిరేకులు తర్వాత అపరంజి, సూర్య పుత్రుడు సీరియల్స్ చేసిన మేధాకు అంతగా సక్సెస్ రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. మేధా చివరిగా రాజేంద్రప్రసాద్ నటించిన మీ శ్రేయోభిలాషి చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు.

ఇదిలా ఉంటే.. మేధా.. సుమిత్ అనే సాఫ్ట్ వేర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం మేధా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీ తో ఎక్కువ సమయం గడుపుతుంది. అయితే మేధాకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

Mogilirekulu Serial Actress

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.