Bigg Boss: హౌస్‏లో తెలుగు మాట్లాడిన కంటెస్టెంట్స్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఫన్నీ వీడియో వైరల్..

|

Nov 25, 2023 | 12:32 PM

ఇప్పుడు సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం 19 మందితో స్టార్ట్ కాగా.. ఇప్పుడు పది మంది మిగిలారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో బిగ్‏బాస్ షో నడుస్తోంది. తెలుగుకు నాగార్జున, హిందీకి సల్మాన్ ఖాన్, కన్నడ కిచ్చ సుదీప్, తమిళం కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే బిగ్‏బాస్ నియమ నిబంధనల ప్రకారం ఈ షోలో కంటెస్టెంట్స్ అందరూ స్థానిక భాష మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది.

Bigg Boss: హౌస్‏లో తెలుగు మాట్లాడిన కంటెస్టెంట్స్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఫన్నీ వీడియో వైరల్..
Bigg Boss 17
Follow us on

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్. తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తైన ఈషో.. ఇప్పుడు సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం 19 మందితో స్టార్ట్ కాగా.. ఇప్పుడు పది మంది మిగిలారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో బిగ్‏బాస్ షో నడుస్తోంది. తెలుగుకు నాగార్జున, హిందీకి సల్మాన్ ఖాన్, కన్నడ కిచ్చ సుదీప్, తమిళం కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే బిగ్‏బాస్ నియమ నిబంధనల ప్రకారం ఈ షోలో కంటెస్టెంట్స్ అందరూ స్థానిక భాష మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హిందీ బిగ్‏బాస్ షోలో ఇద్దరు కంటెస్టెంట్ తెలుగులో మాట్లాడుకుంటుండగా.. తెలుగు బిగ్‏బాస్ షోకు మీకు స్వాగతం అంటూ ఫన్ క్రియేట్ చేశాడు బిగ్‏బాస్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో సీజన్ 17 ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల నామినేషన్లలో భాగంగా హీరోయిన్ మన్నారా చోప్రా, అరుణ్ శ్రీకాంత్ మాషెట్టీ ఇద్దరూ తెలుగులో సవాలు విసురుకున్నారు. నామినేషన్స్ సమయంలో అరుణ్ మాట్లాడుతూ.. చెద్దాం చెద్దాం అన్నీ చెద్దాం అని అనగా.. నాకు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావ్ అని మన్నారా చోప్రా మాట్లాడింది. దీంతో బిగ్‏బాస్ తెలుగు షోకు అందరికీ స్వాగతం అంటూ వెల్కమ్ చెప్పారు బిగ్‏బాస్. దీంతో కంటెస్టెంట్ అంతా ఠక్కున నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. హిందీ బిగ్‏బాస్ షోలో తెలుగు మాట్లాడటం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతకుముందు పలుమార్లు కంటెస్టెంట్లకు హైదరాబాద్ లైఫ్ స్టైల్, తెలుగు భాషను నేర్పిస్తున్న వీడియోస్ సైతం నెట్టింట వైరలయ్యాయి..

వాస్తవానికి బిగ్‏బాస్ సీజన్ 17లో కంటెస్టెంట్ అరుణ్.. హైదరాబాద్‌లోని చార్మినార్‌కు చెందిన అబ్బాయి. హైదరాబాద్ జీవనశైలీ గురించి చెబుతూ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అతడికి యూట్యూబ్ ఛానల్ కు 288,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నాడు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 598,000 కంటే ఎక్కువ మంది ఫాలోయింగ్‌ ఉంది. 27ఏళ్ల అరుణ్ శ్రీకాంత్ మశెట్టికి భార్య, కుమార్తె ఉన్నారు. ఇక మన్నారా చోప్రా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. తిక్క, రోగ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.