27ఏళ్ల తర్వాత వెండితెరపై క్రేజీ కాంబినేషన్..!
తెలుగు తెరపై చిరంజీవి, విజయశాంతి జోడీ అంటే ఓ మ్యాజిక్. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పటివరకు 15కు పైగా సినిమాలు రాగా..వాటిలో మూడు, నాలుగు చిత్రాలు మినహా మిగతావన్నీ సంచలన విజయాలుగా నిలిచాయి. ఇక వీళ్లిద్దరూ చివరిసారిగా 1993లో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో నటించాక మళ్లీ..జంటగా వెండితెరపై కనిపించలేదు. కానీ, ఇప్పుడు దాదాపు 27ఏళ్ల తర్వాత వీరిద్దరూ సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రజంట్ చిరంజీవి హీరోగా కొరటాల శివ […]

తెలుగు తెరపై చిరంజీవి, విజయశాంతి జోడీ అంటే ఓ మ్యాజిక్. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పటివరకు 15కు పైగా సినిమాలు రాగా..వాటిలో మూడు, నాలుగు చిత్రాలు మినహా మిగతావన్నీ సంచలన విజయాలుగా నిలిచాయి. ఇక వీళ్లిద్దరూ చివరిసారిగా 1993లో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో నటించాక మళ్లీ..జంటగా వెండితెరపై కనిపించలేదు. కానీ, ఇప్పుడు దాదాపు 27ఏళ్ల తర్వాత వీరిద్దరూ సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ప్రజంట్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతుంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించడం ఇప్పటికే కన్ఫామ్ అయ్యింది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దీన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు స్టార్టయ్యాయి. ఇప్పుడీ మూవీలోనే విజయశాంతికి ఓ కీలక పాత్ర ఉందని సమాచారం. వాస్తవానికి ఈ పాత్రపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టబు, త్రిష, జెనీలియా తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న చర్చల ప్రకారం దీన్ని విజయశాంతి కోసం స్పెషల్ గా తీర్చిదిద్దుతోన్నట్లు తెలుస్తోంది. మరి దీంట్లో నిజమెంత? అసలా క్యారెక్టర్ ఏంటి? ఎలా ఉండబోతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.




