ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులను కళ్యాణ్ నుంచి లాక్కుని అందులో సగం లాగేసుకుంటాడు లిరిక్ రైటర్ లక్ష్మీ కాంత్. డబ్బు గురించి పరిగెత్తకుండా.. పని గురించి పరిగెట్టాలని అంటాడు. నా లిరిక్స్ గుర్తించి నన్ను మీ అసిస్టెంట్‌గా పెట్టుకుంటారా అని కళ్యాణ్ అడిగితే.. ఏంటి రెండు ముక్కలు పాడగానే అసిస్టెంట్ అయిపోదాం అనుకుంటున్నావా.. సరస్వతీ పుత్రుడు లక్ష్మీ ఇక్కడ.. ఎంతో మంది క్యూ లైన్‌లో ఉన్నారని అంటాడు లిరిక్ రైటర్. ప్లీజ్ సర్ ఒప్పుకోమని కళ్యాణ్ బతిమలాడుతూ ఉంటాడు. వీడిలో చాలా విషయం ఉంది. ముందు వాడేసుకుని ఆ తర్వాత ఆలోచిద్దాం. ఫోన్ నెంబర్ తీసుకో టచ్‌లో ఉండు. నీకు కొన్ని టెస్టులు పెడతాను.. అవి నువ్వు బాగా రాస్తే అప్పుడు ఆలోచిస్తానని అంటాడు. దీంతో కళ్యాణ్ ఎంతో సంతోష పడతాడు.
మరోవైపు రాజ్ ఆఫీస్‌కి వచ్చేసరికి.. ప్యూన్ కుర్చీలో కూర్చొని తుడుస్తూ ఉంటాడు. అది చూసి రాజ్ చాలా సీరియస్ అవుతాడు. రేయ్ నీకు ఎంత ధైర్యం? దీని వాల్యూ ఏంటో తెలుసా? అని చెడామడా వాయించేస్తాడు. ఇది సాధారణ చైర్ అనుకుంటున్నావా? దీని కోసం రాత్రి, పగలు కష్ట పడ్డాను. అందరూ నేను దీనికి అర్హుడిని అన్నాకే కూర్చున్నా. ఇలాంటి చైర్‌కి నువ్వు ఎలాంటి వ్యాల్యూ ఇవ్వాలి? అని రాజ్ సీరియస్ అవుతాడు. ఇందాక చైర్ కింద పడిపోయింది సర్.. ఎలా ఉందా అని కూర్చున్నా అంతే సర్. మరోసారి ఇలాంటి తప్పు చేయనని ప్యూన్ చెప్తాడు. సరేలా వెళ్లి కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. ఎవరు పడితే వాళ్లు కూర్చోవడానికి ఇదేమన్నా బస్టాప్‌లో వేసే చైరా? సిఈవో చైర్. ఇందులో కూర్చోవాలంటే అర్హత కావాలని అనుకుంటాడు రాజ్.
ఆ తర్వాత రాత్రి అవుతుంది. కళ్యాణ్.. పొట్టీ పొట్టీ అని అరుస్తాడు. అబ్బా ఎందుకు అలా అరుస్తున్నావ్? అని అప్పూ అంటుంది. ఏం జరిగిందో తెలిస్తే నా కంటే గట్టిగా అరుస్తావ్.. ఇదిగో ఐదు వేలు అని అప్పూ చేతిలో పెడతాడు కళ్యాణ్. ఇంత డబ్బు ఎక్కడిది.. నువ్వు ఆటో నడుపుతున్నావా? స్మగ్లింగ్ చేస్తున్నావా? అని అప్పూ అంటే.. నన్ను అనుమానిస్తే కళ్లు పోతాయని కళ్యాణ్ అంటాడు. ఏంటి ఎవరన్నా కోటీశ్వరుడు నీ ఆటో ఎక్కాడా? టిప్‌గా ఈ డబ్బులు ఇచ్చాడా? అని అడుగుతుంది అప్పూ.. కాదు ఓ ప్రోడ్యూసర్, లిరిక్ రైటర్ లక్ష్మీ కాంత్ నా ఆటో ఎక్కారు.. పాట రాయమని ప్రోడ్యూసర్ లిరిక్ రైటర్‌ని తొందర పెడుతూ ఉంటే.. నేను అక్కడే ఊహించి చెప్పాను. వెంటనే ప్రొడ్యూసర్ మెచ్చుకుని ఆ డబ్బు ఇచ్చారు. అలాగే త్వరలోనే నన్ను అసిస్టెంట్ రైటర్‌గా పెట్టాకుంటానని చెప్పారని కళ్యాణ్ అంటాడు. అయితే త్వరలోనే నువ్వు అసిస్టెంట్ రైటర్.. ఆ తర్వాత లిరిక్ రైటర్ అయిపోతావు. ఆ నెక్ట్స్ నువ్వు ఫేమస్ అయిపోతావని అప్పూ అంటుంది. హాలో స్లో.. ముందు ఆయన ఛాన్స్ ఇవ్వాలి కదా అని కళ్యాణ్ అంటాడు.
ఆ తర్వాత కావ్య ఆఫీస్‌కి వెళ్తూ.. దేవుడికి దండం పెట్టుకుంటుంది. స్వరాజ్ కంపెనీలో సిఈవోగా అడుగుపెట్టే సమయం ఇది. అక్కడ పులిని నేనే కావాలి.. బఫూన్‌ని నేనే అవ్వాలి.. జంపింగ్‌లు చేయాలి.. సింహం నోట్లో తల పెట్టాలి. ఇది నాకు ఓ అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో నేనే గెలవాలి. నన్ను ఆడుకునే అవకాశం రాకూడదు. అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా నాకు ఆత్మ స్థైర్యం ఇవ్వాలని నన్ను ఆశీర్వదించమని కావ్య అంటుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. నా పాదలు కూడా ఉన్నాయని కనకం అంటే.. మీరు ఏం ఆశీర్వదిస్తారో నాకు తెలుసని కావ్య అంటుంది. సరే నేను ఆశీర్వదించేది జరగాలని కనకం అంటుంది. నేను అక్కడ ఆఫీస్‌కి వెళ్లేది.. ఆయనతో కలిసిపోయి.. ఆ ఇంటికి వెళ్లాలని కాదు.. నా వల్ల ఆ కంపెనీకి నష్టం వచ్చింది. ఆ నిందని చెరిపేయాలి. ఆ నష్టాన్ని పూడ్చాలని కావ్య అంటుంది.
ఆ నెక్ట్స్ రాజ్ కిందకు దిగుతూ.. శాంతా టిఫిన్ అయ్యిందా? అని అడుగుతాడు. బాబూ నేను కావ్య అమ్మలా త్వరగా చేయను బాబు.. కాస్త సమయం పడుతుందని పనిమనిషి అంటుంది. టైమ్ పడుతుందని చెప్పు చాలు.. ఇంకొకరితో పోల్చొద్దని రాజ్ అంటాడు. అక్కడే కూర్చొన్న అపర్ణ, ఇందిరా దేవిలు కోపంగా చూస్తారు. సరే ఆ కాఫీ ఇలా ఇవ్వమని రాజ్ లాక్కుంటాడు. అది కావ్య పెట్టినట్టు లేదా? అని ఇందిరా దేవి అంటే.. నాకు ఇదే నచ్చింది. నేను ఇదే తాగుతానని రాజ్ అంటాడు. సరే నేను వెళ్లి వస్తానని రాజ్ అంటాడు. ఇంత పొద్దున్నే వెళ్తున్నావేంట్రా అని అపర్ణ అంటే.. ఇక నుంచి నేను చిత్త శుద్ధితో పని చేస్తానని రాజ్ అంటే.. సరే చేయ్.. ఇక నుంచి చెప్పినట్టే చేయమని ఇందిరా దేవి అంటుంది. నేను ఒకరు చెప్పినట్టు చేయడం ఏంటి? నేనే చెప్పినట్టు అందరూ వినాలని రాజ్ అని వెళ్తాడు.
కట్ చేస్తే రాజ్ ఆఫీస్‌కి వెళ్తాడు. అక్కడ ఎవరి పని వాళ్లు సీరియస్‌గా పని చేసుకుంటారు. గుడ్.. అందరూ ఇలాగే పని చేయాలి. కానీ బాస్ వస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలని అంటాడు. కానీ ఎవ్వరూ లేచి విష్ చేయరు. ఇంత సీరియస్ నెస్ ఏంట్రా బాబూ అనుకుంటూ క్యాబిన్‌లోకి వెళ్లబోతాడు. అప్పుడే శ్రుతి వచ్చి ఆపుతుంది. ఇక నుంచి మీరు ఆ గదిలో కూర్చొవాలని శ్రుతి అంటుంది. అదా అది మేనేజర్ రూమ్ కదా.. మరి ఇది ఎవరిది? అని రాజ్ అంటే.. కొత్త బాస్ వచ్చారు సర్.. లేడీ బాస్ అని శ్రుతి అంటుంది. ఎవరా బాసినీ అంటూ లోపలికి వెళ్లి కావ్యని చూసి షాక్ అవుతాడు రాజ్. ఏయ్ ఏంటి నువ్వు ఎక్కడ? అని అడుగుతాడు. ఎంత ధైర్యం ఉంటే నా చైర్‌లో కూర్చొంటావ్? అని రాజ్ అంటే.. కావ్య పట్టించుకోకుండా ఉంటుంది. బాస్ క్యాబిన్‌లోకి రావాలంటే మీరే మై ఐ కమిన్ అనాలని కావ్య అంటుంది. ఏంటి ఈ ఓవరాక్షన్ లే పైకి లెమ్మని రాజ్ అంటాడు. మిస్టర్ మేనేజర్ అని కావ్య అనగానే రాజ్ షాక్ అవుతాడు. మీరు లిమిట్స్‌లో ఉండాలని కావ్య అంటుంది.
ఇక రాజ్ కోపంతో సెక్యూరిటీ సెక్యూరిటీ అని పిలుస్తూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య కూడా వస్తుంది. సెక్యూరిటీ వచ్చి ఏంటి మేడమ్ పిలిచారని అడుగుతాడు. అరిచింది నేను.. అసలు ఎవరు పడితే వాళ్లు వచ్చి నా క్యాబిన్‌లో కూర్చుంటే ఏం చేస్తున్నారు? డిస్మిస్ చేసేస్తానని రాజ్ అంటాడు. ఇవాళ్టి నుంచి మేడమ్ గారే బాస్ అని చెప్పారని సెక్యూరిటీ అంటాడు. దీంతో నవ్వుతూ.. అసలు సిఈవో మీనింగ్ తెలుసా? అని రాజ్ అంటాడు. అవును అని ఇంగ్లీషులో దంచుతుంది కావ్య. ఆ తర్వాత సీతా రామయ్య ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తుంది. అది చూసి రాజ్ నోరెళ్లబెడతాడు. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..