ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌కి అర్థమయ్యేలా బుద్ధి చెబుతుంది కావ్య. నేను మీ ఆస్తిపై మోజు పడ్డాను కదా.. నేను పడిన కష్టాన్ని మీరే గుర్తించడం లేదు. ఇక ఇంట్లోని వాళ్లు ఇంకేం గుర్తిస్తారు. మొత్తం తాను చేసే పనులన్నీ లిస్ట్ చదువుతుంది. ఇన్ని పనులు చేసే నన్ను పట్టుకుని ఆస్తి కావాలనుకుంటున్నావా.. అందుకే కవిగారు రాకూడదని కోరుకుంటున్నావా? అని పనికి మాలిన నిందలు వేస్తున్నారా? పదండి.. ఇప్పుడే వెళ్లి అందర్నీ నిలబెట్టి మీరు అన్న మాటలకు న్యాయం అడుగుతానని కావ్య అంటుంది. మా అమ్మ సపోర్ట్ చేసే సరికి.. నేల మీద ఆగడం లేదని అంటాడు. అమ్మా మహా లక్ష్మి.. నువ్వు మా ఇంటికి ఇలావేల్పువు. నీకు ఆస్తి ఆశ లేదు.. ఐశ్వర్యం మీద వ్యామోహం కూడా లేదు. ఏమీ లేదు సరేనా.. నువ్వు మా ఇంటిని ఉద్దరించడానికి పుట్టిన దేవ కన్యవి. నిన్ను అన్నందుకు నేను నన్ను ఉప్పుతో కొట్టుకోవాలి. ఇప్పుడు నీ ఇగో చల్లారిందా? అని అడుగుతాడు రాజ్. హా చల్లారిందని కావ్య అంటే.. గో ఇక వెళ్లి వాళ్లకు ఏం కావాలో చేసి పెట్టమని రాజ్ అంటాడు. ఇదంతా సరే కానీ.. మీ తమ్ముడు కళ్యాణ్ గారు ఇంటికి రాకూడదని నేను కోరుకుంటున్నానా? అని కావ్య అంటే.. అవును అందులో డౌటే లేదు. వాడు వెళ్లి పోతున్నా ఆపలేదు. కాబట్టి వాడు రావడం నీకు ఇష్టం లేదు. ఎప్పటికైనా సరే వాడినే ఇంటికి తీసుకొస్తానని రాజ్ అనేసి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే.. ఇంట్లోకి సరుకులు తీసుకు రావడానికి డబ్బులు ఎక్కడి నుంచి ఎలా వస్తాయని అప్పూ, కళ్యాణ్‌లు తెగ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇద్దరూ డాష్ ఇచ్చుకుంటారు. ఇదేంటి పొట్టి.. ఇక్కడ నేను ఆలోచిస్తున్నా కదా.. నువ్వు పక్కకు వెళ్లి ఆలోచించమని అంటాడు. అదే మరి ఇదేమన్నా దుగ్గిరాల ఇల్లా పక్కకు వెళ్లి ఆలోచించడానికి నువ్వు బయటకు వెళ్లి ఆలోచించమని చెబుతుంది అప్పూ. ఇక కళ్యాణ్ బయటకు వెళ్తుండగా.. అప్పుడే ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చి.. మీరు తండ్రి కాబోతున్నారని అంటాడు. దీంతో అప్పూ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. మళ్లీ ఆ వ్యక్తి తడబడతాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చావని అడిగితే.. మీకు లక్కీ డ్రాలో ఐదు లక్షలు తగిలాయి ఇదిగో అని ఇస్తాడు ఆ వ్యక్తి. మీరు షాపింగ్ చేసినందుకు ఇచ్చారు. అదేంటి నేను గంట కోసమే షాపింగ్ చేస్తే.. లక్కీ డ్రా వచ్చిందా? అని అంటాడు కళ్యాణ్. ఇది నెల రోజుల క్రితం మీరు చేసిన షాపింగ్‌కి వచ్చిన డబ్బులు అని చెప్తాడు.
నేను ఎక్కడ చేశాను షాపింగ్ చెప్పు అని కళ్యాణ్ అంటే.. పంజాగుట్ట అని చెప్తాడు. నేను అసలు పంజాగుట్టలోనే షాపింగ్ చేయలేదని కళ్యాణ్ అంటాడు. ఇక కనిపెట్టేసిన కళ్యాణ్.. బ్లూ టూత్ తీసుకుని.. అన్నయ్యా నువ్వు పంపించిన జూనియర్ ఆర్టిస్ట్ దొరికి పోయాడు కానీ.. ఇక నువ్వు రా అని అంటాడు. లోపలికి వచ్చిన రాజ్.. ఏంట్రా ఇది అని అంటాడు. ఏం చేయమంటావు రా.. నువ్వు ప్రాబ్లమ్స్‌లో ఉన్నావు కదా.. ఇదంతా చూసి నేను ఉండలేనని రాజ్ అంటాడు. ఏంటి అన్నయ్యా నేను మరీ అసమర్దుడిలా ఉన్నానా? నా భార్యను ఆ మాత్రం కూడా పోషించుకోలేనా? నువ్వు నన్ను అవమానిస్తున్నావ్ అని కళ్యాణ్ అంటే.. ఏ ఛీ ఊరుకో.. నువ్వు ఆ కళావతిలా మాట్లాడకు. ఇలా మాట్లాడే వాళ్ల పుట్టింటికి ఎప్పుడు హెల్ప్ చేస్తాను అన్నా.. చేయనివ్వలేదు. ఆ బుద్ధులు నీకు కూడా నేర్పింది. నిన్ను కాదురా ఆ కళావతిని అనాలి అని.. కావ్యని తిడతాడు రాజ్.
రాజ్ తిట్లకు కావ్య పొలమారుతుంది. అప్పుడే అపర్ణ వచ్చి మంచి నీళ్లు ఇస్తుంది. మెల్లగా తినవచ్చు కదరా అంటే.. మీ అబ్బాయి గారు నా గురించి ఎక్కడో గొప్పగా పొగుడుతున్నట్టు ఉన్నారు. అందుకే ఇలా పొలమారిందని కావ్య అంటే.. నా కొడుకు అంటే నీకు ఎప్పుడూ వెటకారమే. వాడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసా? అని అపర్ణ అంటుంది. అవును అందుకే బూత్ బంగ్లాకు తీసుకెళ్లారని కావ్య అంటుంది. ఏదో రూపంలో చెప్పాడు కదా.. అని అపర్ణ అంటే.. అప్పుడే స్వప్న వచ్చి ఏంటి నన్ను అసలు మీరు పట్టించుకోవడమే లేదని అంటుంది. నిన్ను పట్టించుకునేంత ధైర్యం ఎవరికి ఉంటుందే బాబూ.. మీ అత్తగారి ముక్కు పిండి మరీ పనులు చేయించుకుంటున్నావ్? కదా అని అపర్ణ నవ్వుతూ అంటుంది. ఊరుకోండి ఆంటీ అదేమన్నా పెద్ద విషయమా అని స్వప్న అంటుంది. నాకు తెలిసి.. రుద్రాణి ఎప్పుడూ పని చేయలేదు. నువ్వు మాత్రమే టిష్యూ పేపర్లా వాడేస్తున్నావ్ అని అంటుంది. సరే కానీ ఏంటి ఏం మర్చిపోయానో చెప్పు అని కావ్య అంటే.. ఈ రోజు డాక్టర్ అపాయింట్ మెంట్ ఉందని స్వప్న అంటుంది. అవును కదా.. పదా పదా అని కావ్య వెళ్తుంది.
కట్ చేస్తే.. కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నాడు రాజ్. అప్పుడే ఇందిరా దేవి వచ్చి.. ఏంట్రా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. కళ్యాణ్ పరిస్థితి గురించి చెప్తూ బాధ పడతాడు. దీని అంతటికీ కారణం ఆ కళావతే.. కళ్యాణ్ పెళ్లికి కావ్య కూడా సపోర్ట్ చేసి ఉంటే.. వాళ్లిద్దరూ ఇంటికి వచ్చేవారు కదా.. తన కాళ్ల మీద తను నిలబడి బతుకుతానని అంటున్నాడని రాజ్ అంటాడు. శాశ్వతంగా ఇంటికి రమ్మంటే రాడు.. కానీ ఒక్కరోజు రమ్మంటే వస్తాడు కదా.. ఎల్లుండి శ్రావణ శుక్రవారం అప్పూతో కూడా వరలక్ష్మీ వ్రతం చేయిస్తాను. అప్పూ వాళ్లు ఇంటికి రావాలని నేను కండిషన్ పెడతానని పెద్దావిడ అంటే.. సంప్రదాయం కాబట్టి ఖచ్చితంగా ఇంటికి ఇద్దరూ వస్తారని రాజ్ అంటాడు. అలా ఇంటికి వచ్చిన వాళ్లను ఎలాగైనా ఇక్కడే ఉంచేలా నేను చూసుకుంటానని రాజ్ అంటాడు.
ఇక రాజ్ సంతోషంగా గదికి వస్తాడు. రాజ్ ని చూసి కావ్య ఏంటో అని అడుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నానని రాజ్ అంటాడు. అయ్యయ్యో మీకు ఏదో అయ్యిందని కావ్య కంగారు పడుతూ డాక్టర్ కు కాల్ చేయబోతుంది. హే హే అవసరం లేదు నేను సంతోషంగానే ఉన్నానని రాజ్ అంటాడు. ఏంటో ఆ విషయం అని కావ్య అడిగితే.. నా తమ్ముడు వాళ్లను శాశ్వతంగా ఇక్కడే ఉంచేస్తానని రాజ్ అంటాడు. ఇక తెల్లవారుతుంది. కళ్యాణ్, అప్పూలను వరలక్ష్మీ వ్రతం కోసం ఇంటికి పిలిపిస్తున్నట్టు.. చెబుతుంది. అందుకు ధాన్య లక్ష్మి కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు రుద్రాణి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.