Brahmamudi, August 13th Episode: కొడుకు కోసం అల్లాడి పోయిన ప్రకాశం.. కావ్యకి పూనకం వచ్చేసిందిగా..

|

Aug 13, 2024 | 12:26 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్.. అప్పూ ఫ్రెండ్ రూమ్ నుంచి కళ్యాణ్ బయటకు వెళ్తాం అంటారు. అదేంటి? ఎందుకు? మా వల్ల ఇబ్బంది ఏమన్నా జరిగిందా? అని వాళ్లు అడుగుతారు. అదేమీ లేదు.. కళ్యాణ్ ఫ్రెండ్ ఇక్కడ లేక పోయే సరికి.. గెస్ట్ హౌస్‌కి వెళ్లలేదు. అతను వస్తున్నాడు. గెస్ట్‌ హౌస్ మాకు హ్యాండోవర్ చేస్తున్నాడు. ఎన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు అక్కడ ఉండమన్నాడని అప్పూ చెబుతుంది. పాపం కళ్యాణ్‌ ఇక్కడ ఉంటే..

Brahmamudi, August 13th Episode: కొడుకు కోసం అల్లాడి పోయిన ప్రకాశం.. కావ్యకి పూనకం వచ్చేసిందిగా..
Brahmamudi
Image Credit source: disney hotstar
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్.. అప్పూ ఫ్రెండ్ రూమ్ నుంచి కళ్యాణ్ బయటకు వెళ్తాం అంటారు. అదేంటి? ఎందుకు? మా వల్ల ఇబ్బంది ఏమన్నా జరిగిందా? అని వాళ్లు అడుగుతారు. అదేమీ లేదు.. కళ్యాణ్ ఫ్రెండ్ ఇక్కడ లేక పోయే సరికి.. గెస్ట్ హౌస్‌కి వెళ్లలేదు. అతను వస్తున్నాడు. గెస్ట్‌ హౌస్ మాకు హ్యాండోవర్ చేస్తున్నాడు. ఎన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు అక్కడ ఉండమన్నాడని అప్పూ చెబుతుంది. పాపం కళ్యాణ్‌ ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది. అందుకే అక్కడికి వెళ్తున్నామని అప్పూ అంటుంది. థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.. మరీ చేసిన ఈ సహాయం మర్చిపోలేమని అంటాడు కళ్యాణ్. ఇది కూడా ఒక సహాయమేనా.. జాగ్రత్త అని అప్పూ ఫ్రెండ్స్ అంటారు.

కళ్యాణ్‌ని రమ్మన్న ప్రకాశం..

కట్ చేస్తే దుగ్గిరాల ఫ్యామిలీలో ధాన్య లక్ష్మి, ప్రకాశం తప్ప అందరూ హాలులో కూర్చొంటారు. అందరికి కావ్య కాఫీ ఇస్తుంది. ధాన్య లక్ష్మి రాలేదా? అని ఇందిరా దేవి అడిగితే.. ఎలా వస్తుంది? అయిన వాళ్లే వెన్నుపోటు పొడిచి.. కన్నవాళ్లే దూరం చేశారు కదా.. అని రుద్రాణి అంటే.. అయిన వాళ్లు ఎవరు అని పెద్దావిడ అడుగుతుంది. ఇంకెవరు రాజ్, కావ్యలే అని అంటుంది రుద్రాణి. చేతిలో కాఫీ చాలా వేడిగా ఉందని స్వప్న ఇన్ డైరెక్ట్‌గా సమాధానం ఇస్తుంది. అప్పుడే ధాన్య లక్ష్మి వచ్చి కూర్చొంటుంది. కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తే.. విషమా అని అడుగుతుంది. కావ్య ఫీల్ అవుతుంది. అప్పుడే ప్రకాశం వచ్చి.. నాకు కాఫీ ఇవ్వమ్మా అని అంటాడు. కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కళ్యాణ్.. ఎక్కడున్నావ్? రారా కలిసి కాఫీ తాగుదాం.. అని అనే సరికి అందరూ బాధ పడతారు. ఏమ్మా కావ్యా కవి గారు కవిత్వం రాసుకుంటున్నాడా.. ఒకసారి పిలువమ్మా.. ఎందుకో వాడిని ఒకసారి చూడాలని అనిపిస్తుందని అంటాడు. అందరూ బాధతో చూస్తారు.

మర్చిపోయిన ప్రకాశం..

అయ్యో కర్మ.. కళ్యాణ్ ఆ అప్పూని పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్లి పోయాడని ధాన్య లక్ష్మి ఏడుస్తుంది. కళ్యాణ్ వెళ్లడం గుర్తొచ్చి బాధ పడతాడు ప్రకాశం. మీకు మతి మరుపు వల్ల గుర్తు లేదు. కానీ మీకే కాదు ఈ ఇంట్లో ఎవరికీ గుర్తు లేదు. ఈ ఇంట్లోంచి బయటకు ఒక వెళ్లిపోయాడన్న బాధ ఎవరికీ లేదు. చేతిలో డబ్బు లేదు.. రాత్రంతా ఏం చేస్తున్నాడో.. తిన్నాడో లేదో అని బాధ పడుతున్నా అని ధాన్య లక్ష్మి అంటుంది. పిన్నీ ఈ బాధ నీకే కాదు.. అందరికీ ఉందని రాజ్ నచ్చజెప్ప పోతాడు. కానీ ధాన్య లక్ష్మి సీరియస్ అవుతుంది. చేసుకున్నది వాడు.. తమ్ముడి ప్రేమ తెలుసుకుని రాజ్ తాళి బొట్టు ఇచ్చాడు. మధ్యలో వాడిని ఒక్కడినే దోషిని చేస్తావేంటి? అని అపర్ణ అంటుంది. అవును ధాన్య లక్ష్మి.. వెనకాల ఉండి నడిపించిన కావ్యని వదిలేశావు ఏంటి? అని రుద్రాణి చిచ్చు పెడుతుంది.

ఇవి కూడా చదవండి

రుద్రాణికి అపర్ణ స్ట్రాంగ్ వార్నింగ్..

రుద్రాణి ఏం నడిపించింది? ఎవర్ని నడిపించింది? నీకు ఎన్ని సార్లు గడ్డి పెట్టినా బుద్ధి రాదా? అని అపర్ణ అంటుంది. ఏంటండీ మీరు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఇందుకే ఇందుకే ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తారనే అప్పూ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకోకూడదని నేను గొడవ పడ్డాను. చేసిందంతా మీరు.. ఇప్పుడు మీరంతా నన్ను దోషిని చేస్తున్నారు. నేను చేయని తప్పుకు మాటలు పడే రోజులు పోయాయి. మీరు సమాధానం చెప్తారా? నేనే సమాధానం చెప్పాలా? అని కావ్య రాజ్‌ని ప్రశ్నిస్తుంది. అందరూ చూశారు కదా.. అంతా విన్నారు కదా.. మధ్యలో కళావతిని ఎందుకు లాగుతున్నారు? ఏమన్నా అంటే నన్ను అనమని రాజ్ అంటాడు. అప్పుడే ప్రకాశం ఏడుస్తూ వచ్చి.. రేయ్ రాజ్.. నాకు కళ్యాణ్‌ ముఖ్యం. చూడాలని ఉందిరా.. వెళ్లి తీసుకురారా అని అంటాడు.

కళ్యాణ్‌ని ఒక్కడినే ఇంటికి తీసుకురా..

పిన్నీ నేను వెళ్లి వాళ్ళిద్దరినీ ఒప్పించి తీసుకొస్తానని రాజ్ అంటే.. ఇద్దరు ఎవరు? నాకు నా కొడుకు మాత్రమే కావాలి.. నా కొడుకుని మాత్రమే తీసుకురా.. ఇంటికి రావాల్సింది మాత్రం నా కొడుకు ఒక్కడే.. మిగతా వాళ్లతో నాకు సంబంధం లేదని ధాన్య లక్ష్మి అంటుంది. దీంతో రుద్రాణి ఎంజాయ్ చేస్తుంది. అదేంటి? ధాన్య లక్ష్మి.. భార్యాభర్తలను విడదీసి కొడుకుని మాత్రమే తీసుకు రమ్మంటావేంటి? అని ఇందిరా దేవి అంటుంది. నాకు ఇష్టం లేకుండా వాడు దాని మెడలో తాళి కట్టాడు. కావాలంటే ఎంతో కొంత డబ్బు పడేస్తాను.. నా కొడుకును వదిలి పెట్టమని చెబుతానని ధాన్య లక్ష్మి అంటే.. నీకెంత కావాలి చెప్పవే? నేను నిన్ను వదిలేస్తాను? భరణం కింద పడేస్తానని ప్రకాశం అంటాడు. ఏం మాట్లాడుతున్నారు? మీరు అని ధాన్య లక్ష్మి అంటే.. అప్పూ కోసమే బయటకు వెళ్లినవాడు.. అప్పూని వద్దంటే.. అసలు జీవితంలో మన మొహం చూస్తాడా? నీ వల్లే వాడు ఇంటికి రాలేదని అంటాడు. ఆ నష్ట జాతకురాలు ఈ ఇంట్లో కాలు పెడతానంటే ఎలా ఒప్పుకుంటానని ధాన్య లక్ష్మి అంటుంది.

అప్పూని ఎప్పటికీ నా కోడలిగా ఒప్పుకోను..

నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావ్? అప్పూ కళ్యాణ్‌ని ప్రేమించిన మాట నిజమే. కానీ కళ్యాణ్ పెళ్లి కాగానే అప్పటి నుంచి దూరంగా ఉంది. వేరే పెళ్లికి కూడా సిద్ధ పడింది. పెళ్లి నుంచి అప్పూని నీ ముద్దుల కోడలే మాయం చేసింది. నువ్వు, రుద్రాణి అన్న మాటలకు పెళ్లి కొడుకు మనసు విరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆస్తి నుంచి వల పన్నారని అనకు.. వాళ్లకు ఈ కుటుంబం నుంచి చిల్లి గవ్వ కూడా వెళ్లలేదని అపర్ణ అంటుంది. మధ్యలో రుద్రాణి దూరి మరో చిచ్చు పెడుతుంది. దీంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది స్వప్న. కళ్యాణ్ వస్తే అప్పూతోనే రావాలి.. లేదంటే అప్పూతోనే ఉండాలి. నా చెల్లెలికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని స్వప్న అంటుంది. ఇది అన్యాయం.. అక్రమం.. వాడు మనస్ఫూర్తిగానే అప్పూని పెళ్లి చేసుకున్నాడు. కళ్యాణ్ ని ఒక్కడినే తీసుకు రావడం పాపమని రాజ్ అంటాడు. అవును.. పాపమే. ఈ పాపానికి నేను ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చింది.. నువ్వు పక్కన ఉండి దాని మెడలో తాళి కట్టించావు కదా.. అప్పూ అనే మహమ్మారిని నేను ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోను గుర్తు పెట్టుకోమని ధాన్య లక్ష్మి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

రాజ్, కావ్యల మధ్య యుద్దం..

కట్ చేస్తే.. రాజ్ అప్పటికే బెడ్ రూమ్‌లో ఉంటాడు. అప్పుడే కావ్య రాగానే రాజ్ కావాలనే వెటకారంగా మాట్లాడతాడు. నేను ముందే అంటానని ఊహించి.. నన్ను తిరిగి అంటారా? పడటానికి నేను ఒక్కదాన్ని తేరగా దొరికాను కదా మీ అందరికీ.. అని కావ్య అంటే.. ఎప్పుడూ నశ పెడుతూనే ఉంటావ్ అని రాజ్ అంటాడు. మధ్యలో కావ్య బూత్ బంగ్లాని తీసుకొస్తుంది. దీంతో రాజ్ మండి పడుతూ.. అసలు నేను ఏం మాట్లాడుతున్నా? నువ్వేం మాట్లాడుతున్నావ్? అని అంటాడు. నేనేం తక్కువా? నేను అన్ని మాటలు కూడా అంటానని కావ్య అంటుంది. ఇలా ఇద్దరూ మాటలతో యుద్ధం ఆడుకుంటారు. ముందు మీరు వెళ్లి అప్పూని, కళ్యాణ్‌ని ఇద్దర్నీ ఇంటికి తీసుకురావడానికి మీ పిన్నిని ఒప్పించండి. లేదంటే మానుకోమని అంటుంది కావ్య. కన్న తల్లిలా చూసిన మరిది బయటకు వెళ్లిన వాడిని ఇంటికి రావాలని నువ్వెందుకు కోరుకుంటావే? అని రాజ్ అని వెళ్తాడు.