Brahmamudi, May 24th Episode: పాపం కళావతి అడ్డంగా బుక్కైపోయింది.. రాజ్‌తో మాయ పెళ్లి!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్ గదిలోకి వస్తాడు. కళ్యాణ్‌ని చూసిన అనామిక.. మీ వదిన ఎంతో తెలివైనది అనుకుంటే అనుకున్నాను. కానీ ఇంత తెలివైనది అనుకోలేదు. ఇలాంటి అమ్మాయిని నేను ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదు. ఎందుకు అంత కోపం.. ఎవరైనా ఇంట్లోకి సవతిని తీసుకొచ్చి పెట్టుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి. నేను అయితే ఇలా చేయను బాబోయ్.. అని అనామిక అంటుంది. మా వదిన ఇాలా ఎందుకు చేసిందో తెలీదు కానీ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్ గదిలోకి వస్తాడు. కళ్యాణ్‌ని చూసిన అనామిక.. మీ వదిన ఎంతో తెలివైనది అనుకుంటే అనుకున్నాను. కానీ ఇంత తెలివైనది అనుకోలేదు. ఇలాంటి అమ్మాయిని నేను ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదు. ఎందుకు అంత కోపం.. ఎవరైనా ఇంట్లోకి సవతిని తీసుకొచ్చి పెట్టుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి. నేను అయితే ఇలా చేయను బాబోయ్.. అని అనామిక అంటుంది. మా వదిన ఇాలా ఎందుకు చేసిందో తెలీదు కానీ.. దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. అవును చాలా బలమైన కారణం ఉంటుందిలే అనామిక అంటుంది. మా వదినకు జరిగిన నష్టానికి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నావ్ అని కళ్యాణ్ అంటాడు. నేను ఏం మాట్లాడినా నీకు ఎప్పుడూ అర్థం కాదు. మీ వదిన ఇంట్లోంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే మౌనంగా చూస్తున్నావ్ కదా.. అని అనామిక అంటే.. మా వదిన ఇంట్లోంచి వెళ్లిపోతుందని నీతో ఎవరు చెప్పారని కళ్యాణ్ అడుగుతాడు. ఒకరు చెప్పాల్సిన పనేంటి? కళ్ల ముందే కనిపిస్తుంది కదా.. ఆ బిడ్డ తల్లి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఆవిడని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత మీ వదిన స్థానం ఏంటి? అప్పుడు మీ వదిన పరాయిది అవుతుందని అనామిక అంటుంది. అలా జరిగితే ఇంట్లో ఎవరూ చూస్తూ ఊరుకోరని కళ్యాణ్ అంటాడు. అలా ఎదురు చెప్పేవాళ్లే అయితే అసలు ఆమెని ఇంట్లోకే రానిచ్చేవాళ్లే కాదు. ఇంట్లోనే పెట్టుకోరని అనామిక అంటే.. ఏదో ఒకటి చేసి వదినకు సహాయం చేయాలని కళ్యాణ్ అనుకుంటాడవు.
కావ్యకు సహాయం చేయాలనుకున్న సుభాష్..
ఆ తర్వాత బయట నిలబడి.. సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. నా కోసం కావ్య ఇబ్బందులు పడుతుంది. అపర్ణ అనుకున్నట్టు పెళ్లి చేస్తే.. కావ్య జీవితం అన్యాయం అవుతుంది. మాయ అంటూ నాటకం ఆడుతున్న మనిషిని ఇంట్లోంచి పంపించేయాలని సుభాష్ అనుకుంటాడు. ఈలోపు రావే నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థం అవుతుందా.. నీ సవతిని తీసుకొచ్చి ఇంట్లోనే పెడతావా.. అసలు నువ్వు చేసిన పని వల్ల నీకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఊహించావా అని స్వప్న చెడామడా తిడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చేయాలేను అక్కా.. మా ఆయన దూరం అవుతాడు అంతే కదా.. అని కావ్య అంటుంది. ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? మీ ఆయనతో ఉండేందుకు నువ్వు ఎంత పోరాడావు? ఎన్ని అవమానాలు పడ్డావు మర్చిపోయావా.. అలాంటిది ఈ ఇంట్లోంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నావా.. అని స్వప్న అంటుంది. ఇంకోసారి నేను ఈ ఇంటి గడప దాటి వెళ్లాలి అనుకుంటే అది నా ప్రాణం పోయాకే అని కావ్య అంటుంది.
నీ జోలికి ఎవరు వచ్చినా సరే లాగి పెట్టి నాలుగు పీకుతా..
ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తున్నావ్ కదా.. బిడ్డ తల్లి రాకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతాను అంటుంది. తనని ఆపడానికి ఇది తప్ప వేరే దారి లేదని కావ్య అంటుంది. ఆ తర్వాత స్వప్న ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తుంది. కానీ కావ్య మాత్రం నాకేం తెలీదని చెప్తుంది. సరే కానీ మీ అత్త మాత్రం నిన్ను ఓడించాలని అనుకుంటుందని స్వప్న అంటే.. మా అత్తయ్య నన్ను ఓడించాలని ఎప్పుడూ అనుకోలేదు. నేనేంటో ఆవిడకు తెలిసిన రోజు ఈ ఇంట్లో ఆవిడే నాకు అండగా నిలబడుతుంది. సరే నువ్వు అప్పటివరకు నువ్వు దయచేసి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు అని చెప్పి వెళ్తుంది కావ్య. నీ జోలికి ఎవరు వచ్చినా సరే లాగి పెట్టి నాలుగు పీకుతా. అది నీ అత్త అయినా సరే.. నీ మొగుడు అయినా సరే అని అంటుంది స్వప్న.
సుభాష్‌కి వార్నింగ్ ఇచ్చిన చిత్ర..
ఆ తర్వాత చిత్రను మాట్లాడటానికి రమ్మని పిలుస్తాడు. నువ్వు ఆ బిడ్డకు తల్లివి కాదని తెలుసు. నాటకం ఆడుతున్నానని తెలుసు. నువ్వు ఈ ఇంటికి వచ్చింది డబ్బు కోసమే కదా అని సుభాష్ అంటే.. ఓహో ఎంత ఇస్తారు? మీ ఆవిడ అడిగితే ఏం సమాధానం చెప్తారు? అని చిత్ర అడిగితే.. నువ్వేం చెప్పాల్సిన పని లేదు నువ్వు వెళ్లిపో ఆ తర్వాత నేను చూసుకుంటాను అని సుభాష్ అంటే.. నాకు డబ్బులు ఇచ్చి.. అందరి ముందు ఇది మోసకత్తెనని నిరూపించి గెంటేయాలని చూస్తున్నారు కదా అని చిత్ర అంటే.. లేదు నేను మాట అంటే మాటే అని సుభాష్ అంటే.. సుభాష్ అక్రమ సంబంధం గురించి మాట్లాడుతుంది. మీ మాటలు నమ్మి మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. జీవితాంతం సుఖంగా బ్రతికేస్తాను. అత్తయ్య గారే నన్ను అఫీషియల్‌గా కోడల్ని చేస్తారని సుభాష్‌ని బెదిరిస్తుంది చిత్ర.
కావ్య వైపే ఇద్దరూ..
ఆ తర్వాత సీతా రామయ్య, ఇందిరా దేవి ఇద్దరూ కావ్య గురించి బాధ పడుతూ ఉంటారు. కావ్యకి శిక్ష వేయడం సరైన పద్దతి కాదు.. నాకు కావ్యకు న్యాయం చేయాలనే ఉంది బావా అని పెద్దావిడ అంటే.. నీకున్న తెగింపు కూడా నాకు లేదు చిట్టీ. కావ్యకు న్యాయం చేయాలని ఉన్నా.. ధైర్యంగా బయట పెట్టలేకపోతున్నా. ఇప్పుడు వాళ్ల అమ్మానాన్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలి? అందుకే మనం కావ్య వైపే నిలబడదామని ఇద్దరూ అనుకుంటారు.
చిత్ర చేసి కాఫీని తాగిన అపర్ణ..
ఇక తెల్లవారుతుంది. అందరూ హాలులోనే కూర్చుని ఉంటారు. చిత్ర, కావ్య ఇద్దరూ కిచెన్‌లో ఉంటారు. ఇంట్లోని వాళ్లందర్నీ మచ్చిక చేసుకోవడానికి.. చిత్ర ముందుగానే కాఫీ, టీలు కలుపుతుంది. ఈలోపు చిత్ర అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ధాన్య లక్ష్మీ, రుద్రాణి కాఫీ తీసుకుని తాగుతారు. పెద్దావిడ, స్వప్న, రాహుల్, ప్రకాశం తీసుకోరు. అప్పుడే చిత్ర అపర్ణకు కాఫీ తీసుకోమని చెబుతుంది. సరిగ్గా అదే సమయానికి కావ్య కూడా కాఫీ ఇస్తుంది. కానీ అపర్ణ మాత్రం చిత్ర తీసుకొచ్చిన కాఫీ తీసుకుంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి.








