AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, June 4th Episode: ఇంట్రెస్టింగ్‌గా టుడే ఎపిసోడ్‌.. ఒంటరిగా మిగిలిపోయిన కావ్య..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అసలు మాయను వెతికి పట్టుకోవడానికి కావ్య, అప్పూలు వెళ్తారు. ఈ విషయం రుద్రాణి కూడా కావ్య, అప్పూలను ఫాలో చేస్తుంది. అప్పూ చెప్పిన అడ్రెస్‌ దగ్గరకు వెళ్తారు. వెనకాలే రుద్రాణి కూడా వెళ్తుంది. ఇంట్లోకి లోపల ఉన్న అమ్మాయి సాహితిని మాయ ఎక్కడ? అని అడుగుతారు. అప్పుడే మాయ కారు దిగుతూ కనిపిస్తుంది. తనే మాయ.. వస్తుంది చూడండి అని సాహితి చెప్పగానే కావ్య, అప్పూలు..

Brahmamudi, June 4th Episode: ఇంట్రెస్టింగ్‌గా టుడే ఎపిసోడ్‌.. ఒంటరిగా మిగిలిపోయిన కావ్య..
Brahmamudi
Chinni Enni
|

Updated on: Jun 04, 2024 | 12:41 PM

Share

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అసలు మాయను వెతికి పట్టుకోవడానికి కావ్య, అప్పూలు వెళ్తారు. ఈ విషయం రుద్రాణి కూడా కావ్య, అప్పూలను ఫాలో చేస్తుంది. అప్పూ చెప్పిన అడ్రెస్‌ దగ్గరకు వెళ్తారు. వెనకాలే రుద్రాణి కూడా వెళ్తుంది. ఇంట్లోకి లోపల ఉన్న అమ్మాయి సాహితిని మాయ ఎక్కడ? అని అడుగుతారు. అప్పుడే మాయ కారు దిగుతూ కనిపిస్తుంది. తనే మాయ.. వస్తుంది చూడండి అని సాహితి చెప్పగానే కావ్య, అప్పూలు తిరిగి చూస్తారు. కావ్య, అప్పూలను చూసిన మాయ షాక్ అవుతుంది. ఇదంతా రుద్రాణి చాటుగా వింటుంది.

కంగారు పడి పారిపోయిన మాయ..

మాయ కంగారు పడుతున్న విషయం కావ్య, అప్పూలకు అర్థం అయిపోతుంది. తాము ఎవరో మాయకు తెలుసని అర్థం చేసుకుంటారు. దీంతో రంగంలోకి దిగుతుంది కావ్య. నువ్వేనా మాయ.. నీ అసలు పేరేంటని గట్టిగా ప్రశ్నిస్తుంది. అవును అంటూ భయంతో సమాధానం చెప్తుంది మాయ. మర్యాదగా ఇప్పుడు నేను అడిగే వాటికి సమాధానం చెప్పుడు. ఇప్పటి వరకూ నువ్వు ఏమేం తప్పులు చేశావో.. నిజం చెప్పు. లేదంటే నిన్ను ఏం చేస్తామో తెలీదుని కావ్య అడిగే సరికి.. సమాధానం చెప్పలేక లగేజ్ అక్కడే పడేసి పారిపోతుంది మాయ. అది గమనించిన రుద్రాణి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మాయను కారుతో గుద్ది చంపేసిన రుద్రాణి..

మాయ ముందు పరిగెడుతూ ఉంటుంది. వెనుక నుంచి కావ్య, అప్పూలు కూడా పరిగెడుతూ ఉంటారు. ఇక సమయం కోసం చూసిన రుద్రాణి.. మాయ పరిగెడుతూ ఉండగా.. కారుతో గుద్ది చంపేస్తుంది. దీంతో మాయ అక్కడే ఉన్న ఇసుక గుట్ట మీద పడిపోతుంది. చచ్చింది.. ఇప్పుడు కావ్య ఏం చేస్తుందో నేనూ చూస్తాను అని సంతోషంతో నవ్వుకుంటూ వెళ్లిపోతుంది రుద్రాణి. ఏమైంది మాయ.. లే అని అప్పూ, కావ్యలు లేపుతూ ఉంటారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తారు.

ఇవి కూడా చదవండి

ఒంటరిగా మిగిలిపోనున్న కళావతి..

మాయను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు కావ్య. మరి ఈమె అయినా నిజమైన మాయనేనా? ఏం చేసిందో నిజం చెబుతుందా? కావ్య ఈ పరిస్థితి నుంచి బయట పడుతుందా? ఇలాంటి పరిస్థితులు మధ్య కావ్య ఒంటరిగా మిగిలిపోతుందా? తెలుసుకోవాలంటే.. మరి కాస్త సమయం పట్టేలా ఉంది. మరోవైపు రాజ్‌తో చిత్ర పెళ్లికి సమయం దగ్గర పడుతూ ఉంటుంది. దీంతో కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి పెళ్లి జరిగే సమయానికైనా అసలు మాయ వస్తుందా? కనకం కావ్యకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? చూడాలి.. మరి ఎలాంటి ట్విస్టులు జరుగుతాయో.