
ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. వెన్నెల దొరికితే ఏం చేయాలి అనుకుంటున్నావ్? వెన్నెల దొరికిన తర్వాత ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నీకు తెలుసా? అని పెద్దావిడ అడుగుతుంది. నాకు ఇప్పుడు మీ మనవడి మనసులో, ఇంట్లో స్థానం ఉందా లేదా? అన్నది కాదు.. నిజం కావాలి. ప్రశ్నగా మిగిలి పోవడం కంటే.. ఒంటరిగా మిగిలి పోవడం మంచిది కదా? కావ్య అంటుంది. మరోవైపు అప్పూ చేసిన దానికి బాధ పడతాడు కృష్ణమూర్తి. ఎందుకు నువ్వు ఇలా చేశావ్? అని అప్పూని అడుగుతాడు. అక్కడ మీడియా ఉంటుందని, ఇంత పెద్ద గొడవ జరుగుతుందని నాకు తెలీదని అప్పూ అంటుంది. అయినా నాదే తప్పు. కళ్యాణ్ బాబు నిన్ను తీసుకెళ్తుంటే ఆపలేదు. ఇప్పుడు ప్రశ్నించే హక్కును కోల్పోయాను. ఇప్పుడు నలుగురూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఎంతైనా మన హద్దుల్లో మనం ఉండాలి అని చెప్తాడు కృష్ణ మూర్తి.
ఎందుకు ఉండాలి? మన బిడ్డ ఏం తప్పు చేసిందని ఉండాలి? ఇన్నాళ్లూ నోరు మూసుకుని ఉన్నాను. ఇకపై ఊరుకునేదే లేదు. ఆ రోజు అల్లుడు ఒక బాబును తీసుకొచ్చి నా బిడ్డా అని అన్నాడు. ఏంటని అడిగితే.. మనదే తప్పుగా మాట్లాడారు. ఇకపై తప్పుగా ఎవరు మాట్లాడినా నేను ఊరుకోను. వసేయ్ అప్పూ నువ్వ తప్పు చేయనంత కాలం.. ఏం చేయాలనుకుంటే అది చెయ్. నేను నీకు అండగా ఉంటాను. ఎవరు అడ్డం వస్తే వాళ్ల తాట తీస్తాను అని కనకం అంటుంది. ఊరుకో నాన్నా.. ఎందుకు ఫీల్ అవుతున్నావ్. అమ్మ చెప్పిందనో.. ఎవరో రెచ్చగొట్టారనో నేను ఏ పనీ చేయను అని అప్పూ అంటుంది.
ఈ సీన్ కట్ చేస్తే.. హాలులో బిడ్డకు స్నానం చేయించి బట్టలు వేస్తుంది కావ్య. అప్పుడే వచ్చిన రుద్రాణి.. కావాలనే కావ్యను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ తల్లి ఎవరో కానీ ఆమె పోలికలు ఏమీ రాలేనట్టు ఉన్నాయి. రాజ్ పోలికలే కనిపిస్తున్నాయి. చాలా ముద్దుగా ఉన్నాడని రుద్రాణి అంటే.. కావ్య కోపంగా చూస్తుంది. ఇంతలో బిడ్డ వీపుపై ఉండే మచ్చను చూస్తుంది. సరిగ్గా ఇలాంటి పుట్టుమచ్చే ఇక్కడే రాజ్‌కి కూడా ఉన్నట్టు గుర్తు. వాడిని చిన్నప్పుడు ఎక్కువగా నేనే ఎత్తుకునేదానిలే. నమ్మితే నమ్ము లేదంటే లేదుని వెళ్లిపోతుంది రుద్రాణి. వీడు ఆయన కొడుకే అయితే.. ఇలాంటి పుట్టుమచ్చే ఆయనకే ఉంటే వేరే సాక్ష్యాలు వెతుక్కోవడం ఎందుకు? ఈ రాత్రికే తేల్చుకోవాలి అని కావ్య అనుకుంటుంది.
అనుకున్నట్టుగానే గదిలోకి వెళ్తుంది. అప్పుడే రాజ్ స్నానం చేసి వచ్చి.. అద్దం దగ్గర ఉంటాడు. రాజ్ నడుముపై ఉండే పుట్టుమచ్చ చూడటానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది కళావతి. రాజ్ బనియన్ ఎత్తి.. చూడాలని ప్రయత్నిస్తుంది. అప్పుడే రాజ్ ఉలిక్కి పడతాడు. ఏంటి? ఏం చేస్తున్నావ్? అంటూ ఇక్కడ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. రాజ్, కావ్య ఇద్దరూ సరదగా వాదించుకుంటూ ఉంటారు. సేమ్ ఖుషీ సీనే రివర్స్‌గా చూపించారు. ఇక ఇప్పుడు మిస్ కావడంతో.. ఇవాళ రాత్రికి ఎలాగైనా పుట్టుమచ్చ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది కావ్య.
మరోవైపు అనామిక.. గదిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. జరిగినదాని గురించి చాలా కోపంగా ఉన్నావ్ అని తెలుసు అనామిక అని రుద్రాణి అంటే.. ఎంత కోపం ఉన్నా ఏమీ చేయలేకపోతున్నా.. ఆ అప్పూతోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు కళ్యాణ్ మీద కోపం చూపిస్తే.. నువ్వు అనుకున్నది సాధించలేం. కాబట్టి నీ కోపాన్ని పక్కన పెట్టి.. కళ్యాణ్‌ని పూర్తిగా ఎదగనివ్వు. ఆ తర్వాత ఆ అప్పూని టైమ్ చూపి పక్కకు తప్పించొచ్చు. నువ్వు కళ్యాణ్‌తో కోపంగా కాకుండా ప్రేమగా ఉండు. అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావ్ అని రుద్రాణి చెప్తుంది. మీరు చాలా మంచి వారు ఆంటీ.. నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోగలం అని అనామిక అంటుంది. తింగరి దానా వాడు ఆఫీస్‌కి వెళ్తేనే కదా.. వాడి చేత తప్పులు చేయించి.. రాహుల్‌ని ఎండీ పోస్టులో కూర్చోబెట్టగలను అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.
ఆ తర్వాత కళ్యాణ్ గదికి వస్తాడు. కళ్యాణ్‌ని చూసిన అనామిక.. పాలు లేదా జ్యూస్ తాగుతావా? అని అడుగుతుంది. నాకేమీ వద్దు.. చేసిందంతా చేసి.. ఇప్పుడేం తెలియనట్టు మాట్లాడకు అని కళ్యాణ్ అంటాడు. అయినా ఇప్పుడు ఆ గొడవల గురించి ఎందుకు? మంచిగా ఉండొచ్చు కదా.. ఎండీ పోస్ట్ అంటే ఎంత పెద్దది. నీకు చాలా గౌరవం పెరుగుతుందని అనామిక అంటుంది. అలాంటి గొప్పలు నీకు నచ్చుతాయి కానీ నాకు నచ్చవు. అయినా మా రాజ్ అన్నయ్య.. తిరిగి రాగానే నేను తప్పుకుంటాను అని వెళ్లి పడుకుంటాడు కళ్యాణ్.
రాజ్ నడుముపై పుట్టుమచ్చ ఉందో లేదో చూద్దామని కళావతి ట్రై చేస్తుంది. అప్పుడే రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ లేస్తాడు. హేయ్.. హేయ్ అంటూ అరుస్తాడు. ఏంటిది? ఏం చేస్తున్నావ్? అని రాజ్ అంటాడు. బొద్దింక మీ షర్టులోకి దూరిందని అంటుంది కళావతి. ఆ తర్వాత బొద్దింక ఉందని.. షర్టు తీస్తాడు రాజ్. పుట్టుమచ్చ లేకపోవడంతో.. కావ్య కన్ఫ్యూజన్‌లో పడుతుంది. ఇక్కడ కూడా కామెడీ సూపర్‌గా ఉంటుంది. కావ్య పడుకుంటూ.. మనసులో పుట్టుమచ్చ గురించి ఆలోచిస్తుంది. అప్పుడే రాజ్.. పుట్టుమచ్చ లేకపోయినంత మాత్రాన నా కొడుకే అని రాజ్ అంటాడు. అది విని కావ్య షాక్ అవుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.