Brahmamudi, November 17th episode: రాజ్, కావ్యలకు తెలిసిపోనున్న నిజం.. స్వప్నపై పెద్దావిడ అనుమానం!

|

Nov 17, 2023 | 11:03 AM

ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని తింటూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న ఇందిరా దేవిని చూసి భయపడి వెళ్లి పోతుంది స్వప్న. నాన్నమ్మని చూసి భయ పడి వెళ్లిపోతుందని రాహుల్ అంటే.. అదే కదా మనకు కావాల్సిందని రుద్రాణి అంటాడు. వెళ్లి పోతున్న స్వప్నని పిలుస్తుంది రుద్రాణి. ఆకలిగా లేదు తర్వాత తింటాను అని అంటుంది స్వప్న. పెద్దావిడ మాత్రం స్వప్ననే చూస్తూ ఉంటుంది. ఇది గమనించిన రుద్రాణి.. ఏంటమ్మా నా కోడల్ని అలా చూస్తున్నావ్.. ఏమైనా అడగాలా అని అడుగుతుంది. ఏంటి రుద్రాణి.. నీకు జాతకాలు చెప్పడం కూడా వచ్చిందా అని అడుగుతుంది ధాన్య లక్ష్మి. ఆ తర్వా రాజ్ టిఫిన్ కి వస్తాడు. నాతోనే సారీ చెప్పించుకుంటావా..

Brahmamudi, November 17th episode: రాజ్, కావ్యలకు తెలిసిపోనున్న నిజం.. స్వప్నపై పెద్దావిడ అనుమానం!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని తింటూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న ఇందిరా దేవిని చూసి భయపడి వెళ్లి పోతుంది స్వప్న. నాన్నమ్మని చూసి భయ పడి వెళ్లిపోతుందని రాహుల్ అంటే.. అదే కదా మనకు కావాల్సిందని రుద్రాణి అంటాడు. వెళ్లి పోతున్న స్వప్నని పిలుస్తుంది రుద్రాణి. ఆకలిగా లేదు తర్వాత తింటాను అని అంటుంది స్వప్న. పెద్దావిడ మాత్రం స్వప్ననే చూస్తూ ఉంటుంది. ఇది గమనించిన రుద్రాణి.. ఏంటమ్మా నా కోడల్ని అలా చూస్తున్నావ్.. ఏమైనా అడగాలా అని అడుగుతుంది. ఏంటి రుద్రాణి.. నీకు జాతకాలు చెప్పడం కూడా వచ్చిందా అని అడుగుతుంది ధాన్య లక్ష్మి. ఆ తర్వా రాజ్ టిఫిన్ కి వస్తాడు. నాతోనే సారీ చెప్పించుకుంటావా.. ఇప్పుడు నా నటన ఎలా ఉంటుందో చూపిస్తాను అని రాజ్ అంటాడు. ఏంటి కళావతి.. నేను వచ్చినా టిఫిన్ పెట్టడం లేదు. నోరు తెరిచి అడిగితేనే పెడతావా అని రాజ్ అడుగుతాడు. మీరేమైనా చిన్న పిల్లలా అండి.. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా వడ్డించుకోండి అని కావ్య అంటే.. మరి వాళ్లకు వడ్డిస్తున్నావ్ అని రాజ్ అంటాడు. అంటే వాళ్లు పెద్ద వాళ్లు కదా అని కావ్య అంటుంది. ముసలి వాళ్లు అయిపోయారు. వాళ్లంతట వాళ్లు వడ్డించుకోలేరు అని చెప్తున్నావ్ అంతేనా.. అని రాజ్ అంటే.. రేయ్ తనేమీ ఇలా అనలేదు నువ్వే అంటున్నావ్ అని సుభాష్ అంటాడు. ఈ ప్రకాష్ మాట్లాడితే.. ఏవండి రాజ్ ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థం కావడం లేదు. తన భార్య చేత వడ్డించుకోవడానికి వంకలు వెతుకుతున్నాడని ధాన్య లక్ష్మి అంటుంది. పిన్నీ వంకలు ఎందుకు.. నా పెళ్లామే కదా. రాజ్ మాటలకు అందరూ నవ్వుతారు. ఆ తర్వాత కళావతి రా వడ్డించు అని అంటాడు రాజ్.

రాజ్, కావ్యలను అనుమానించి రుద్రాణి:

మీరిద్దర్నీ చూస్తుంటే అన్యోన్యంగా ఉన్నట్టు లేరు. కోపాన్ని కవర్ చేసుకుంటూ పగ తీర్చుకుంటున్నట్టు ఉంది అని రుద్రాణి అంటుంది. ఆలూమగలు అన్నాక.. కోపాలు.. తాపాలు ఉంటాయి. అలా అయితేనే కాపురం సరదాగా ఉంటుందని ఇందిరా దేవి అంటే.. తనకేం తెలుస్తుంది లేండి అత్తయ్యా అని ధాన్య లక్ష్మి అంటుంది. ఎక్కడికి వెళ్లినా.. నా మొగుడి దగ్గరకే రావాలా.. అని టిఫిన్ వదిలేసి వెళ్లి పోతుంది రుద్రాణి. ఏంటి ధాన్య లక్ష్మి ఎందుకు అలా అన్నావ్.. ఇప్పుడు చూడు తినకుండా వెళ్లి పోయిందని పెద్దావిడ అంటుంది. అయ్యో అమ్మా ప్లేట్ లో పెట్టిన టిఫిన్ అంతా తినేసి వెళ్లిందిలే అని ప్రకాష్ అంటాడు.

ఇవి కూడా చదవండి

కావ్య యాక్టింగ్ కి బుక్ అయిన రాజ్.. అపర్ణ మండిపాటు:

నాతోనే ఆడుకుంటారా.. ఇప్పుడు నా యాక్టింగ్ చూడండి అని కావ్య సరదాగా.. చట్నీ కావాలా అని రాజ్ ని అడుగుతుంది. పైపైకి నవ్వుతూ దోశ తీసుకురా అని అంటాడు. ఇదంతా చూస్తున్న అపర్ణ.. మండిపోతూ ఉంటుంది. ఇక ఇద్దరూ నోట్లో నోట్లో మాట్లాడుతూ నాటకం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నా టిఫిన్ అయిపోయిందని రాజ్ చేయి కడుక్కోవడానికి వెళ్తాడు. కావ్య కావాలనే తన చీర కొంగును ఇచ్చి.. అయ్యో ఏంటండీ నా చీర కొంగుతోనే తుడుచుకోవాలా ఏంటి అని గట్టిగా అందరికీ వినబడేలా చెప్తుంది. చిన్నప్పుడు వాడు అలా వాళ్ల అమ్మ కొంగుకు తుడిచేవాడమ్మా.. ఇప్పుడు నువ్వు వచ్చావు కదామ్మా అందుకే అని సుభాష్ అంటాడు. అంటే అత్తయ్య గారి స్థానం నాకు ఇచ్చారా అండీ అని గట్టిగా అరిచి చెప్తుంది కావ్య. ఇదంతా విన్న అపర్ణ షాక్ అవుతుంది. భలే ఇరికించేశావు కదా అని రాజ్ నోట్లో అంటే.. అట్లుంటది మనతోని అని కావ్య అంటుంది.

కంగారు స్వప్న.. డ్రామా మొదలు పెట్టేసిన రాహుల్:

అక్కడ అందరి ముందు అమ్మమ్మ చూసే చూపు తట్టుకోలేక పోతున్నా.. అసలు దీనంతటికీ కారణం అరుణ్ గాడే అని కాల్ చేస్తుంది స్వప్న. కానీ ఫోన్ కట్ చేస్తాడు అరుణ్. ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని స్వప్న అనుకుటుంది. ఆ నెక్ట్స్ అరుణ్.. రాహుల్ కి కాల్ చేసి స్వప్న ఇప్పటికే చాలా సార్లు కాల్ చేసింది లిఫ్ట్ చేయమంటారా అని అడిగితే.. ఏ నీకు హాస్పటల్ పెట్టాలని లేదా అని రాహుల్ అంటాడు. మీరు చెప్పినట్టు చేస్తున్నా కదా అని అరుణ్ అంటాడు. ఏయ్ అది నా భార్య నాకు లేని జాలి నీకెందుకు. నేను చెప్పేంత వరకూ కాల్ లిఫ్ట్ చేయకు. నేను ఏం చెప్తానో అలానే చేయ్ అని రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత పైకి ఇందిరా దేవి వస్తుంది. అక్కడ రాహుల్ ఓ ఫొటో చూస్తూ బాధ పడుతున్నట్టు నటిస్తాడు. ఫొటో నలిపి అక్కడ పడేసి వెళ్లి పోతాడు. అది చూసి ఇందిరా దేవి ఆలోచనలో పడుతుంది. అంటే రాహుల్ కి ఆ విషయం ముందే తెలుసు. అందుకే బాధ పడుతున్నాడు.. ఈ విషయం రాజ్ కి చెప్పి ఇతను ఎవరో కనుక్కోవాలి అని పెద్దావిడ వెళ్లి పోతుంది.

నాకే తెలీకుండా వాడిపై ప్రేమ పుట్టిందని కనకంతో చెప్పి బాధ పడుతున్న అప్పు:

ఒక్కర్దే కూర్చుని అప్పూ బాధ పడుతుంది. కనకం అప్పూ దగ్గరకు వచ్చి.. బాధ పడుతుంది. ఎప్పుడూ కొడతానని బెదిరించానే తప్ప కొట్టలేదని బాధ పడుతుంది. ఎందుకు నువ్వెందుకు బాధ పడుతున్నావ్.. తప్పు చేసింది నేనే కదా అని అప్పూ అంటుంది. నువ్వెందుకు తప్పు చేశావే అని కనకం అప్పూని అడుగుతుంది. తెలీదమ్మా.. ఇన్ని రోజులూ ఆ బద్మాష్ గానితో తిరిగినా.. ఎప్పుడూ అనిపించ లేదు. అమాయకుడు అనుకున్నా కానీ.. వాడి మీదే మనసు అయితదని ఊహించలేదని అప్పూ అంటుంది. అదేంటే అని కనకం అంటే.. దగ్గరగా ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు. దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. ఆ అనామిక వచ్చిన దగ్గర్నుంచే ఆ పిల్లకు దగ్గర అయిపోయాడు. ముందు పట్టించు కోవడం లేదని కోపం పడేదాన్ని. కానీ నా మనసుకు కూడా ప్రేమ అనేది ఒకటి ఉంటుందని ొేదలోనేను అనుకోలేదే.. అని అప్పూ బాధ పడుతుంది. లేకపోతే ఏంటమ్మా.. కావ్య అక్కడ పడే కష్టాలు తెలిసి కూడా.. నేనెందుకు ఆ ఇంటి అబ్బాయినే ప్రేమిస్తాను. కోరి కోరి ఆ ఇంట్లో పడాలని ఏ ఆడ పిల్ల అనుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని బాధ ఇది అని అప్పూ.. కనకాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య, రాజ్ లు గదిలో ఉంటారు. రాజ్ అప్పుడే స్నానం చేసి వస్తాడు. అది గమనించిన కావ్య.. బుక్ లోని కథను చదువుతున్నట్టు చదువుతుంది. కావ్య చదివేది వింటూ ఉంటాడు రాజ్. ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.