Brahmamudi, January 4th episode: కావ్యకి అడ్డంగా దొరికిపోయిన రాజ్, శ్వేతలు.. దుగ్గిరాల ఇంట్లో అడుగడుగునా రచ్చే!

|

Jan 04, 2024 | 11:31 AM

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో రాజ్ అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి హడావిడిగా ఆఫీస్‌కి వెళ్తాడు. దీంతో శ్వేత కాల్ చేసి కలవాలని అని చెప్తుంది. దీంతో బయట శ్వేతను కలవడానికి వెళ్తాడు రాజ్. ఆ తర్వాత కావ్య ఏదో పని మీద బయటకు వెళ్తుంది. సరిగ్గా అప్పుడే రాజ్, శ్వేతలు ఐస్ క్రీమ్ తింటూ, కబుర్లు చెప్పుకుంటూ క్లోజ్‌గా ఉండటం కావ్య చూసేస్తుంది. అదంతా ఆటోలో వెళ్తున్న కావ్య చూసి షాక్ అవుతుంది. ఆఫీస్‌కు అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పక్కన ఆ అమ్మాయి ఎవరు..

Brahmamudi, January 4th episode:  కావ్యకి అడ్డంగా దొరికిపోయిన రాజ్, శ్వేతలు.. దుగ్గిరాల ఇంట్లో అడుగడుగునా రచ్చే!
Brahmamudi
Follow us on

కళ్యాణ్, అనామిక పెళ్లి తర్వాత దుగ్గిరాల ఇంట్లో రచ్చ కొనసాగుతూనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా కావ్యపై ఒక్కసారిగా ఇంట్లో వాళ్లందరూ ఎటాక్ చేస్తూనే ఉంటున్నారు. ముఖ్యంగా ధాన్య లక్ష్మి.. సూటి పోటి మాటలతో కావ్యపై సైటర్లు వేస్తుంది. మరోవైపు అపర్ణ కూడా కావ్య ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు రుద్రాణి.. అనామిక, కావ్యల మధ్య ఎలా చిచ్చు పెట్టాలా అని వెయిట్ చేస్తుంది. అనామిక కూడా కావ్య కోసం కన్నింగ్ ప్లాన్స్ రెడీ చేస్తుంది. ఈ క్రమంలోనే సీరియల్ కొనసాగుతుంది.

రాజ్, శ్వేతలను చూసేసిన కావ్య..

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. కావ్యకి ఐలవ్యూ చెప్పి అందరి ముందూ ముద్దు పెడతాడు రాజ్. ఇదంతా చూస్తున్న అపర్ణ కుళ్లుకుంటూ.. లోలోపలే ఆవేశ పడుతూ ఉంటుంది.  ఆ తర్వాత రాజ్ అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి హడావిడిగా ఆఫీస్‌కి వెళ్తాడు. దీంతో శ్వేత కాల్ చేసి కలవాలని అని చెప్తుంది. దీంతో బయట శ్వేతను కలవడానికి వెళ్తాడు రాజ్. ఆ తర్వాత కావ్య ఏదో పని మీద బయటకు వెళ్తుంది. సరిగ్గా అప్పుడే రాజ్, శ్వేతలు ఐస్ క్రీమ్ తింటూ, కబుర్లు చెప్పుకుంటూ క్లోజ్‌గా ఉండటం కావ్య చూసేస్తుంది. అదంతా ఆటోలో వెళ్తున్న కావ్య చూసి షాక్ అవుతుంది. ఆఫీస్‌కు అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పక్కన ఆ అమ్మాయి ఎవరు? మా ఆయనతో చనువుగా ఉందని కంగారు పడుతుంది.

కావ్యకి అబద్ధం చెప్పిన రాజ్.. ఏం చేస్తుందో మరి..

దీంతో వెంటనే రాజ్‌కి కాల్ చేస్తుంది కావ్య. ఫోన్ రావడంతో రాజ్ కంగారు పడతాడు. భయంగా ఫోన్ ఎత్తి హలో అంటాడు. ఎక్కడ ఉన్నారు? అని కావ్య అడుగుతుంది. ఇదేమీ తెలియని రాజ్.. ఆఫీస్‌లోనే ఉన్నాను. ఏంటి అని అడుగుతాడు. అదే ఆఫీస్‌కి వెళ్లారా లేదా అని అడుగడానికి ఫీనో చేశా అంటుంది. ఆఫీస్‌లోనే ఉన్నాను అని చిరాకుగా ఫోన్ పెట్టేస్తాడు రాజ్. దీంతో కావ్య బాధగా కాల్ కట్ చేస్తుంది. రాజ్, శ్వేతలను అలానే చూస్తుంది. మరి వీరిద్దర్నీ చూసిన కావ్య.. రాజ్‌ని నిలదీస్తుందా.. శ్వేత ఎవరు? అని అడుగుతుందా? లేక రాజ్ ఏం చేస్తాడో గమనిస్తూ ఉంటుందా.

ఇవి కూడా చదవండి

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో…

డిన్నర్ తర్వాత స్వీట్ ఇవ్వడం మర్చిపోయానని.. చెప్పి అందరికీ స్వీట్ ఇస్తుంది కావ్య. ఇలా అందరికీ ఇచ్చే క్రమంలో అపర్ణ తీసుకోదు. ధాన్య లక్ష్మి మాత్రం నచ్చని వాళ్లు ఇస్తే అమృతం కూడా విషంలాగే ఉంటుందని అంటుంది. దీంతో కావ్య బాధ పడి పక్కకు వెళ్తుంది. ధాన్య లక్ష్మి అన్న మాటలకు ప్రకాష్ సెటైర్ వేస్తాడు. నచ్చకపోతే వద్దు అని చెప్పాలి.. అంతే కానీ ఇలా మాట్లాడితే.. మన సంస్కారం అందరికీ తెలుస్తుందని ఇందిరా దేవి అంటుంది. పెళ్లిలో జరిగిన గొడవ మర్చిపోయారా అని ధాన్య లక్ష్మి అంటే.. అవును మర్చిపోయారు.. కానీ మీరు మాత్రమే గుర్తు పెట్టుకున్నారని కావ్యకు సపోర్ట్‌గా స్వప్న జవాబు ఇస్తుంది. మా అత్తగారు అవతారం చాలించారు.. ఇప్పుడు అవతారం ఎత్తరా అత్తయ్యా అని స్వప్న సీరియస్ అవుతుంది.

ఇక ఆ తర్వాత ఇది కూడా ఒక స్వీటేనా అని అనామిక అంటుంది. దానికి రాజ్ రియాక్ట్ అవుతూ.. అవును ఇదేంటి స్వీట్.. దీన్ని ఏమంటార్రా కళ్యాణ్ అని రాజ్ అంటే.. అమృతం అంటారు అన్నయ్యా అని అంటాడు. ఆ తర్వాత అపర్ణ, ధాన్య లక్ష్మిల దగ్గరకు వెళ్లి బలవంతంగా స్వీట్ ఇస్తాడు రాజ్. దీంతో కళ్యాణ్, అనామికల శోభనం అయ్యేదాకా విడి విడిగా ఉండాలని ఇందిరా దేవి అంటే.. సరే అందరం కలిసి హాలులో పడుకుందాం అని ప్రకాష్ అంటాడు.

పెళ్లి జరిగిన దానికి కనకం, కృష్ణమూర్తిలు బాధ పడుతూ కూర్చుంటే.. అప్పూ మాత్రం ఏమీ జరగనట్టు చికెన్ తీసుకొచ్చి.. వంట చేస్తుంది. సరిగ్గా భోజనం దగ్గరకు తినేసరికి.. కళ్యాణ్ ప్రేమ గుర్తుకు వచ్చి ఆగి పోతుంది. ఏమైందే అలా వెళ్లిపోతున్నావ్ అని అడిగితే.. గుండెల్లో బాధ.. ఆకలిని మింగేసిందని చెప్తుంది. ఇక మరోవైపు దుగ్గిరాల ఫ్యామిలీ సరదగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు.