Brahmamudi, January 2nd episode: కావ్యపై దుగ్గిరాల ఫ్యామిలీ ఎటాక్.. భార్యకు మద్దతుగా రాజ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్, అనామికల పెళ్లి చెడగొట్టాలని, తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని చూసిందని కావ్యని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం శత్రువులా చూడటం మొదలవుతారు. కేవలం ఇందిరా దేవి, రాజ్, కళ్యాణ్‌లు, సీతారామయ్య తప్ప మిగిలిన వాళ్లందరూ కావ్యపై ఎటాక్‌కి దిగుతారు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కావ్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. కావ్య వడ్డిస్తుండగా.. లాక్కుని అపర్ణ వడ్డించుకుంటుంది. కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ధాన్య లక్ష్మి దగ్గరకు వచ్చి..

Brahmamudi, January 2nd episode: కావ్యపై దుగ్గిరాల ఫ్యామిలీ ఎటాక్.. భార్యకు మద్దతుగా రాజ్!
Brahmamudi

Updated on: Jan 02, 2024 | 11:54 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్, అనామికల పెళ్లి చెడగొట్టాలని, తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని చూసిందని కావ్యని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం శత్రువులా చూడటం మొదలవుతారు. కేవలం ఇందిరా దేవి, రాజ్, కళ్యాణ్‌లు, సీతారామయ్య తప్ప మిగిలిన వాళ్లందరూ కావ్యపై ఎటాక్‌కి దిగుతారు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కావ్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. కావ్య వడ్డిస్తుండగా.. లాక్కుని అపర్ణ వడ్డించుకుంటుంది. కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ధాన్య లక్ష్మి దగ్గరకు వచ్చి.. కూర వడ్డించనా అత్తయ్యా అని అడుగుతుంది. వద్దు.. నువ్వు నాకే ఏమీ వడ్డించాల్సిన అవసరం లేదు. నాకు ఏం కావాలోనే నేను చూసుకుంటాను అని కసురుగా అంటుంది. దీంతో కావ్య చిన్నబోతుంది.

కావ్యపై ఎటాక్ స్టార్ట్ చేసిన రుద్రాణి, ధాన్యలక్ష్మి:

ధాన్యలక్ష్మి మాటలకు రుద్రాణి రియాక్ట్ అవుతుంది. ఏంటి కావ్యని ఎవరైనా ఏదైనా అంటే.. సుర్రున పరిగెత్తుకుంటూ వచ్చి నేనున్నాను అని అంటావు కదా.. ఇప్పుడేమైంది? అని అంటుంది రుద్రాణి. అప్పుడు నా అమాయకత్వం నా కళ్లను కమ్మేసింది. అందరూ మంచివాళ్లే అని గుడ్డిగా నమ్మాను. ఎప్పటికీ ఎవర్నీ నమ్మకూడదు. కానీ ఇప్పుడే తెలిసింది. నాకు ఎవరి సహాయం అవసరం లేదని ధాన్య లక్ష్మి అంటుంది. అక్కడ జరిగేదంతా.. రాజ్, సుభాష్, ఇందిరా దేవిలు గమనిస్తూ ఉంటారు.

కావ్యకు రాజ్ మద్దతు..

వాళ్లందరూ అవమానిస్తూ ఉన్నా.. ఈ కళావతి అస్సలు పట్టించుకోదు. పాపం కళావతి.. అని కావ్యని పిలుస్తాడు. ఇటు.. రా.. నాకు వడ్డించు. అదేం కూర.. చాలా బావుందే అని అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ కూడా కావ్యకి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. ఇదంతా గమనిస్తున్న అనామిక కూడా.. కావ్యని ఎలాగైనా అందరి ముందూ దోషిలా నిలబెట్టాలి. కళ్యాణ్‌ని నమ్మించి మోసం చేస్తుందా.. ఎలాగైనా టైమ్ చూసి కావ్యని ఇరికించాలని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది అనామిక.

ఇవి కూడా చదవండి

ఎలా ఎదురు నిలుస్తుందో..

మొత్తానికి దుగ్గిరాల ఇంట్లో.. కావ్యకి మళ్లీ కష్టాలు మొదలైయ్యాయి. ఇప్పుడు ఇంట్లోని ఉన్న లేడీస్ అందరూ కావ్యని టార్గెట్ చేశారు. అత్తింట్లో అందరికీ శత్రువుగా మారిన కావ్య ముందు ముందు ఎలాంటి కష్టాలు పడుతుందో.. తాను ఏ తప్పూ చేయాలేదని ఎలా రుజువు చేసుకుంటుందో చూడాలి. మొత్తానికి మళ్లీ బ్రహ్మముడి సీరియల్ ఆసక్తికరంగా మారింది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో..

కనకం, కృష్ణమూర్తి, అప్పూలు కళ్యాణ్ పెళ్లి నుంచి వెళ్లిపోతారు. పుట్టింటి వాళ్లు అలా వెళ్లిపోవడంతో కావ్య పడుతుంది. మమ్మల్ని వదిలేయ్.. మా దరిద్రం నీకు అంట కూడదు. ఇక నుంచి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి కృష్ణ మూర్తి ఫ్యామిలీ వెళ్లి పోతారు. వెళ్లండి మళ్లీ రాకండి అని ధాన్యలక్ష్మి ఘాటుగా విమర్శిస్తుంది. ఇప్పటివరకూ మా పక్కనే ఉంటూ మమ్మల్ని నమ్మించి.. అవకాశం దొరికితే పెళ్లి ఆపించి.. మీ కూతుర్ని ఇచ్చి చేయాలని చాలు.. మీ అందరి అసలు స్వరూపం బయట పడింది. ఇక మిమ్మల్ని మా ఇంట్లో ఎవరూ బంధువులుగా ఎప్పటికీ పిలవరు. ఒక వేళ సంస్కారం కాదని పిలిచినా.. మీరెవరూ మా గడప తొక్కడానికి వీల్లేదని ధాన్య లక్ష్మి అంటుంది.

కావ్య హారతి ఇస్తే ఒప్పుకోం: అనామిక పేరెంట్స్

ఆ తర్వాత పెళ్లైన నూతన దంపతులకు హారతి తీసుకురమ్మని కావ్యకు చెబుతుంది ఇందిరా దేవి. ఆగండి.. ఎవరితో ఎవరికి హారతి ఇప్పిస్తున్నారు. ఈ పెళ్లి ఆగిపోయేలా చేసి.. తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని కుట్ర చేసింది కావ్య. అలాంటి తనతో నా కూతురికి హారతి ఇప్పిస్తారా.. అన్యాయం చేయాలనుకున్న మనిషితో ఎలా హారతి ఇప్పిస్తారు. దుగ్గిరాల కుటుంబానికి గొప్ప గొప్ప కోడల్ని తెచ్చుకున్నారు అనుకున్నాం. కానీ మీ కోడళ్ల కుటుంబం ఎలాంటిదో కళ్లారా చూశాం. ఆ కుటుంబం వచ్చిన కావ్య.. నా కూతురికి ఎలా మనస్ఫూర్తిగా హారతి ఇస్తుందని అనామిక పేరెంట్స్ శైలు, సుబ్రమణ్యం అంటారు.

కావ్య హారతి ఇస్తే ఇంట్లోకి రాను: అనామిక

ఆ తర్వాత కళ్యాణ్ సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నా.. అనామిక కూడా ఒప్పుకోదు. కావ్య ఎలాంటిదో ఈ పెళ్లిలోనే అర్థం చేసుకున్నా. తన మంచిది అన్నట్టు నమ్మించి మోసం చేయాలనుకుంది. తన చెల్లెలి కోసం నా జీవితం నాశనం చేయాలని చూసింది. కొత్తగా పెళ్లైన దంపతులకు మంచి మనసుతో హారతి ఇచ్చేవాళ్లు ఎదురు రావాలని అనామిక నోరు పారేసుకుంటుంది. అదేంటమ్మా.. ఆ గొడవ అక్కడే వదిలేయకుండా.. పుట్టింటి సారె మోసుకొచ్చినట్టు అది కూడా మోసుకొచ్చావా.. కావ్య మనసులోకి తొంగి చూసినట్టు మాట్లాడతావేంటి? అని పెద్దావిడ అంటే.. అనామిక ఫ్యామిలీకి రుద్రాణి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత అపర్ణ, ధాన్య లక్ష్మిలు కూడా అనామికకే సపోర్ట్‌గా మాట్లాడతారు.

కావ్యకు సపోర్ట్‌గా నిలిచిన రాజ్..

విన్నారు కదా.. ఇదీ కావ్య సంస్కారం. ఇంట్లో ఇంత మంది తప్పు పట్టినా.. తను మీ కూతురు మంచే కోరుకుంటుంది. నాకు తెలుసు.. కళ్యాణ్, అనామికల పెళ్లి జరగాలని ఎంత కోరుకుందో. ఆమె సంకల్పం వల్లే ఈ రోజు మీ కూతురు మా ఇంటి కోడలిగా అడుగు పెడుతుంది. అది మీరూ మీ అమ్మాయి గుర్తిస్తే మంచిది సుబ్రమణ్యం గారూ.. అని రాజ్.. అనామిక తండ్రికి సేటుకు ఇవ్వాల్సిన అప్పు గురించి గుర్తుకువచ్చి.. అనామిక ఇప్పుడు నువ్వేం గొడవ చేయకు.. తను మనకు డబ్బు సహాయం చేస్తానని చెప్తాడు సుబ్రమణ్యం.

అనామిక అండ్ పేరేంట్స్ కుట్ర..

అనామిక, శైలు, సుబ్రమణ్యం.. ఏంటి డైరెక్ట్‌గా కావ్యపై వార్ స్టార్ట్‌ చేశావేంటి? అని అంటారు. లేకపోతే ఏంటి మామ్.. ఆ కావ్యను చూస్తుంటే ఒళ్లు మండి పోతుంది. అప్పటికీ చాలా పద్దతిగా మాట్లాడాను. కళ్యాణ్ కూడా ఆ కావ్యకే సపోర్ట్ చేయాలని చూశాడు. ఆ విషయం అస్సలు నచ్చడం లేదని అంటుంది. అదే చెప్తున్నా ముందు నీ మొగుడిని నీ కంట్రోల్‌లోకి తెచ్చుకో. అప్పుడు ఈ ఇంట్లో నువ్వు ఏం చెప్పినా నడుస్తుంది. అవకాశం దొరికినప్పుడు కావ్య గురించి బయట పెట్టు అని శైలు, సుబ్రమణ్యం చెప్తారు. సరే అని అంటుంది అనామిక.

Follow Us