Brahmamudi, October 20th episode: కావ్య నడుముకి జెండూ బామ్ రాస్తున్న రాజ్.. రొమాంటిక్ ఫీల్ లో రాజ్, కావ్యలు!

|

Oct 20, 2023 | 10:24 AM

కావ్యపై రాజ్ కి రోజు రోజుకూ ప్రేమ పెరుగుతుంది. కానీ ఆ విషయాన్ని మిస్టర్ పర్ఫెక్ట్ కి తెలియడం లేదు. తనకు తెలియకుండానే కావ్య ప్రేమలో పడిపోయాడు రాజ్. తన కోసం ఇంతకు ముందూ తీసుకోని, చేయని పనులన్నీ చేస్తున్నాడు. తనకు ఇష్టం లేకపోయినా.. కావ్య కోసం చేస్తున్నారు. మరి ఇదంతా నిజంగానే ప్రేమనా లేక నటిస్తున్నాడో తెలీడం లేదు కానీ.. పైకి మాత్రం కావ్యతో నిజంగానే రాజ్ ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఇక కావ్య కూడా తన భర్త ప్రేమ కోసం ఎంతగానో తపిస్తుంది. మొత్తానికి మిస్టర్ పర్ఫెక్ట్ తో తనకు ఇష్టమైన పనులన్నీ చేయిస్తుంది. మొన్న ఎపిసోడ్ లో కావ్యకు కిల్లీ కావాలని..

Brahmamudi, October 20th episode: కావ్య నడుముకి జెండూ బామ్ రాస్తున్న రాజ్.. రొమాంటిక్ ఫీల్ లో రాజ్, కావ్యలు!
Brahmamudi
Follow us on

కావ్యపై రాజ్ కి రోజు రోజుకూ ప్రేమ పెరుగుతుంది. కానీ ఆ విషయాన్ని మిస్టర్ పర్ఫెక్ట్ కి తెలియడం లేదు. తనకు తెలియకుండానే కావ్య ప్రేమలో పడిపోయాడు రాజ్. తన కోసం ఇంతకు ముందూ తీసుకోని, చేయని పనులన్నీ చేస్తున్నాడు. తనకు ఇష్టం లేకపోయినా.. కావ్య కోసం చేస్తున్నారు. మరి ఇదంతా నిజంగానే ప్రేమనా లేక నటిస్తున్నాడో తెలీడం లేదు కానీ.. పైకి మాత్రం కావ్యతో నిజంగానే రాజ్ ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఇక కావ్య కూడా తన భర్త ప్రేమ కోసం ఎంతగానో తపిస్తుంది. మొత్తానికి మిస్టర్ పర్ఫెక్ట్ తో తనకు ఇష్టమైన పనులన్నీ చేయిస్తుంది. మొన్న ఎపిసోడ్ లో కావ్యకు కిల్లీ కావాలని అడగ్గానే.. రాజ్ తీసుకెళ్లాడు. అంతకు ముందు కావ్యకు కాలి నొప్పి వస్తే.. పాదాన్ని తీసుకుని ఆయింట్మెంట్ రాసాడు. ఇక దీంతో కావ్య నెక్ట్స్ లెవల్ ప్లాన్ చేసింది.

సరసం తెలియని మొగుడు అంటూ తిట్టుకున్న కావ్య:

ఇవాళ ఎపిసోడ్ లో ఇంట్లో పని అంతా చేసి.. కావ్యకి నడుం పట్టేస్తుంది. దీంతో నడుముకి జెండూబామ్ రాసుకుంటూ ఉంటుంది. ఆ నడుము అందక కావ్య కష్టపడుతూ ఉంటుంది. కావ్య కష్ట పడటాన్ని చూసీ చూడనట్టు చూస్తున్నాడు రాజ్. ఇది గమనించిన కావ్య.. పెళ్లాం ఇంత కష్ట పడుతుంటే చూస్తూంటారేంటి? వచ్చి హెల్ప్ చేయవచ్చుగా అని అంటుంది. అమ్మో నేనా రాను అంటాడు రాజ్. సరసం తెలియని మంచి మొగుడు దొరికాడు నాకు అంటూ నోట్లో మాట్లాడుకుంటూ ఉంటుంది కావ్య. ఏయ్ ఏంటి అంటున్నావ్ అని రాజ్ అంటాడు.

ఇవి కూడా చదవండి

రొమాంటిక్ ఫీల్ లో కావ్య, రాజ్ లు:

ఏమీ లేదులెండి.. ఏదో నా కష్టం నేను పడుతున్నా.. వచ్చి హెల్ప్ చేయవచ్చుగా అని కావ్య మళ్లీ అంటుంది. సరే అని వస్తాడు రాజ్. ఇక జెండూ బామ్ తీసి.. కావ్య నడుముకి రాస్తూ ఉంటే.. ఇటు కావ్య.. అటు రాజ్ ఇద్దరూ ఎంతో రొమాంటిక్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇప్పుడే ‘మధురమే ఈ క్షణమే.. ఓ చెలీ.. మధురమె ఈ క్షణమే’ అనే సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఆ తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే.. రేపటి ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో..

కళ్యాణ్ పిలవగానే అప్పూ బయటకు వస్తుంది. ఏంటి కార్ కొత్తగా ఉంది అంటూ వచ్చి డోర్ తీస్తుంది. అప్పుడే అందులో ఉన్న అనామికను చూసి షాక్ అవుతుంది. ఇక అప్పు.. కళ్యాణ్ వైపు చూస్తుంది. నిజంగానే మీ అమ్మగారు పిలిచారు బ్రో.. అలా బట్టలు ఇచ్చేసి చిన్న షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం అని అంటాడు కళ్యాణ్. అనామిక కూడా ప్లీజ్ అంటూ అనగా.. అప్పు కార్ ఎక్కి కూర్చుంటుంది. ఆ తర్వాత రాహుల్ లాయర్ కి ఫోన్ చేసి బెయిల్ ఏర్పాటు చేయమని చెప్తాడు. తర్వాత డబ్బు ఇస్తాను అని అంటే.. చూడండి మీరేమీ నాకు ఇవ్వలేదు.. మీరు చేసిన పనులకు ఇచ్చారు. మీరు ఎప్పుడు డబ్బులు ఏర్పాటు చేస్తే.. అప్పుడే బెయిల్ ఇప్పిస్తాను అని లాయర్ చెప్పగా సరే అని కాల్ కట్ చేస్తాడు రాహుల్.

కావ్యని చూస్తుంటే.. నువ్వే గుర్తొస్తున్నావ్ చిట్టీ: సీతా రామయ్య

ఇక ఇంట్లోని పనులన్నీ చకచకా చేసేస్తుంది కావ్య. ఇది చూసిన పెద్దాయన సీతా రామయ్య, పెద్దావిడ ఇందిరా దేవి మురిసి పోతారు. కావ్య అలా చురుకుగా పనులు చేస్తుంటే.. పెళ్లైన కొత్తలో నువ్వు ఎలా చేసేదానివో గుర్తొస్తున్నావ్ చిట్టీ అని అంటాడు సీతా రామయ్య. ఇప్పటి కాలం ఆడ పిల్ల అయినా.. అప్పటి వాళ్లలా ఎంత చక్కగా పనులు చక్క బెట్టేస్తుందో అని ఇందిరా దేవి పొగుడుతూ ఉంటారు. ఇక అప్పుడే పై నుంచి వచ్చిన కనకం.. కావ్యకి హెల్ప్ చేద్దామని వస్తుంది. కానీ అపర్ణా దేవి వద్దు.. అని చెప్తుంది. ఇక ఈలోపు స్వప్నని నగలు ఇమ్మని అడుగుతాడు రాహుల్. కానీ స్వప్న ఇవ్వనని చెప్తుంది.

రాహుల్ ని కాపాడిన స్పప్న:

దీంతో స్వప్న బయటకు వెళ్లగానే.. రాహుల్ నగలన్నింటినీ బ్యాగ్ లో పెట్టుకుని బయటకు వెళ్తూంటాడు. ఇక అప్పుడే రాజ్ వచ్చి అడగ్గా ఏమీ లేదని చెప్తాడు. ఆ తర్వాత ప్రకాష్.. రాహుల్ దగ్గరకు వెళ్లి కొత్త డిజైన్స్ అనుకుంటా అని అడుగుతాడు. అవును అని చెప్పగా.. ఏది ఒకసారి చూస్తాను అని ప్రకాష్ లాక్కుంటాడు. దీంతో బాక్సుల్లో ఉన్న నగలన్నీ బయట పడతాయి. ఇది చూసిన ఇంటి సభ్యులందరూ షాక్ అవుతారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు రాహుల్ ని నిలదీస్తారు. ఇక అప్పుడే వచ్చిన స్వప్న ఆగండి.. ఎందుకు అందరూ నా భర్తపై నోరు పారేసుకుంటున్నారు. ఆ నగలకు మెరుగు పెట్టించమని రాహుల్ కి చెప్పింది నేనే. అందుకే తీసుకెళ్తున్నాడు అని అంటుంది. దీంతో రాహుల్ బయట పడతాడు. అంత జరిగినా కూడా నగలు దక్కలేదని బాధ పడతాడు రాహుల్.