Brahmamudi Serial, August 4th Episode: ఇంటిని కాపాడిన కావ్య.. కావ్యపై భారీ కుట్రను ప్లాన్ చేసిన స్వప్న.. ఇంట్లో పెద్ద రచ్చే!!

| Edited By: Ravi Kiran

Aug 12, 2023 | 6:46 AM

ఈ రోజు బ్రహమ్ముడి ఎపిసోడ్ లో నా చెల్లి కోసమే ఈ ట్యాబ్లెట్స్ తెప్పించాను అంటూ స్వప్న తన అత్త రుద్రాణి, రాహుల్ ముందు అబద్దం చెబుతుంది. ఇంకోసారి నాకు ఇలాంటి పనులు చెప్పకు.. నీ భర్త ఉన్నాడు కదా తనతో తెప్పించుకో అంటూ స్వప్న అంటుంది. దీంతో రుద్రాణి.. నీకోసమే స్వప్న ట్యాబ్లెట్స్ తెప్పించిందా.. అంటూ అని కావ్యని అడుగుతుంది. దీనికి  కావ్య ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను అబద్దం చెప్తే.. అక్క చేస్తున్న తప్పుకు నేను కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుందని లోపల అనుకుంటుంది. దీంతో రుద్రాణి మళ్లీ కావ్యని అడగ్గా..

Brahmamudi Serial, August 4th Episode: ఇంటిని కాపాడిన కావ్య.. కావ్యపై భారీ కుట్రను ప్లాన్ చేసిన స్వప్న.. ఇంట్లో పెద్ద రచ్చే!!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహమ్ముడి ఎపిసోడ్ లో నా చెల్లి కోసమే ఈ ట్యాబ్లెట్స్ తెప్పించాను అంటూ స్వప్న తన అత్త రుద్రాణి, రాహుల్ ముందు అబద్దం చెబుతుంది. ఇంకోసారి నాకు ఇలాంటి పనులు చెప్పకు.. నీ భర్త ఉన్నాడు కదా తనతో తెప్పించుకో అంటూ స్వప్న అంటుంది. దీంతో రుద్రాణి.. నీకోసమే స్వప్న ట్యాబ్లెట్స్ తెప్పించిందా.. అంటూ అని కావ్యని అడుగుతంది. దీనికి  కావ్య ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను అబద్దం చెప్తే.. అక్క చేస్తున్న తప్పుకు నేను కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుందని లోపల అనుకుంటుంది. దీంతో రుద్రాణి మళ్లీ కావ్యని అడగ్గా.. అవును నా కోసమే తెప్పించింది. అంటూ చెబుతుంది. దీంతో స్వప్న రెచ్చిపోతూ.. మీరు నన్ను ఇలా ప్రతిసారీ అనుమానించకండి అని చెప్తుంది. అలాగే భార్య నిజాలు మాత్రమే చెబుతుంది అంటూ రాహుల్ ని చూసి అంటుంది. దీంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంచెం అయి ఉంటే దొరికేసేదాన్ని.. అడుగుతుంటే చెప్పవేంటి అని కావ్యని అడుగుతుంది స్వప్న. దీంతో స్వప్నని కావ్య.. గదిలోకి లాక్కెళ్తుంది.

స్వప్నకి మళ్లీ క్లాస్ పీకుంది కావ్య. నీ పాపంని నాకు కూడా పంచుతున్నావా.. అంటూ అక్కపై సీరియస్ అవుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పేసేయ్ అక్కా.. కొంచెం ఉంటే దొరికేసేదానివి అని అంటుంది. దొరకలేదుగా అంటుంది స్వప్న. నీకు ఎగతాళిగా ఉందా..? ఇప్పుడు కాకపోయినా.. ఆ తర్వాతైన ఇంట్లో అందరికీ ఈ నిజం తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు నువ్వు అందరి ముందూ దోషిగా ఉండాల్సి వస్తుందని అని హెచ్చరిస్తుంది కావ్య. దీనికి స్వప్న మాట్లాడుతూ.. ఏంటి నన్ను ఇంట్లో నుంచి తరిమేసి.. నువ్వు ఒక్కదానివే రాజ్యం ఏలదామనుకుంటున్నావా.. అని ఎప్పటిలానే రెచ్చిపోతుంది స్వప్న. అలా చెయ్యాలనుకుంటే నాకు ఒక్క నిమిషం చాలు.. ఇందాక మీ అత్తయ్య దగ్గరే నీ బండారం బయట పెట్టేసేదాన్ని. ఇంక నా వల్ల కాదు.. ఇంట్లో వాళ్లందరూ కలిసి అబద్దం ఆడి.. రాహుల్ తో పెళ్లి చేశారన్న నింద అందరి మీద పడుతుంది. ఇప్పటికే అమ్మ వాళ్లు నీ పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెట్టి.. వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా.. ఎప్పుడూ నీ స్వార్థమే చూసుకుంటావ్ అంటూ ఫైర్ అవుతుంది. ఏదో సమయానికి నా భర్త 50 వేలు సహాయం చేయడం వల్ల ఆ వడ్డీ డబ్బులు కట్టడానికి నేను వెళ్తున్నాను.. లేకపోతే వాళ్లు ఎంత ఇబ్బంది పడేవాళ్లో అంటుంది. ఆ తర్వాత నిజం చెప్పాలంటూ స్వప్నకి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది కావ్య.

ఈ సీన్ కట్ చేస్తే.. అటు కృష్ణ మూర్తి ఇల్లు తాకట్టు పెట్టడానికి సీతారాంని పిలుస్తాడు. ఆ తర్వాత సేటు కూడా వస్తాడు. ఈలోపు వారిపై సెటైర్లు వేస్తుంది అప్పు. మీకు ఇంటికి రూ.22 లక్షలు ఇస్తానని చెప్పా.. ఇదిగో ఇప్పుడు 10 లక్షలు తెచ్చాను. మరో 12 లక్షలు తర్వాత ఇస్తాను అని చెప్తాడు సీతారాం. అబ్బా వడ్డీ డబ్బుల కోసం అని వస్తే.. అసలే ఇచ్చేస్తున్నారన్నమాట. ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదని సేటు అంటాడు. దీంతో ఇదిగోండి పది లక్షలు.. ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి తీసుకోండి అని కృష్ణమూర్తి చేతికి ఇస్తాడు సీతారాం. సరిగ్గా సంతకాలు పెట్టే సమయానికి కావ్య వస్తుంది. ఆగండి నాన్న.. ఏం చేస్తున్నారు మీరు.. ఈ ఇల్లు అమ్మేస్తున్నారా అని అడుగుతుంది. నాకు కనీసం ఒక్క మాటైనా చెప్పాలని అనిపించలేదా అని కావ్య అనగా.. దాందేముంది అమ్మా.. ఇప్పుడు తెలిసింది కదా.. సంతకం పెట్టు అంటాడు సీతారాం. చచ్చినా పెట్టను.. మీకు ఈ ఇల్లు అమ్మడం లేదు అని అంటుంది కావ్య. ఇంకా అప్పు కట్టడానికి ఎంత సమయం ఉందని కావ్య అడగ్గా.. ఆరు నెలలు అని సేటు అంటాడు. 6 నెలల్లో 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావమ్మా అని సేటు అంటాడు. అవన్నీ మీకెందుకు.. నేను ఆ అప్పు కడతాను అని చెప్తుంది కావ్య.

ఇవి కూడా చదవండి

ఏంటమ్మా.. నువ్వు ఎక్కడినుంచి తెచ్చి కడతావ్ అని కృష్ణమూర్తి, కనకం అడుగుతారు. ఈలోపు సేటు వడ్డీ డబ్బులు అడగ్గా.. ఇదిగోండి అని ఇచ్చి పంపించేస్తుంది కావ్య. ఎందుకమ్మా డబ్బు ఇస్తానని సేటుకి మాట ఇచ్చావ్.. అంత డబ్బు నువ్వెలా కడతావ్ అంటాడు కృష్ణమూర్తి. అయినా ఈ ఇల్లు అమ్మాలని మీకెలా అనిపించింది నాన్న. ఈ ఇంటిలోనే మేము ముగ్గురు పుట్టి పెరిగామని చెప్తుంది. ఈ ఇల్లు కన్న తల్లిలా మనల్ని కాపాడింది. మనకి నీడను ఇచ్చిన ఇలాంటి ఇంటిని అమ్మకూడదు నాన్న అని అంటుంది కావ్య. తప్పలేదమ్మా అప్పు తీర్చడానికి వేరే దారి కనిపించలేదని కృష్ణమూర్తి బాధపడతాడు. ఇదంతా నా వల్లే వచ్చిందంటూ కనకం బోరుమని విలపిస్తుంది. కనకాన్ని పట్టుకుని ఓదార్చుతుంది కావ్య. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయి అక్క.. రేపైనా అంత అప్పు ఎలా కడతావ్ అని అప్పు అడుగుతుంది. నేను మా కంపెనీలోనే డిజైనర్ గా పని చేస్తున్నారు.. నేను వేసి ఇచ్చిన డిజైన్స్ కి మా ఆయన కు ఈ పారితోషికం ఇచ్చారని అని చెప్తుంది కావ్య.

ఈలోపు కావ్యపై భారీ కుట్రను ప్లాన్ చేస్తుంది రాకాసి స్వప్న. అపర్ణ దగ్గర ఇరికిస్తుంది. నాకే వార్నింగ్ ఇస్తావా.. ఇప్పుడు చూడు నీ అత్త దగ్గర నిన్ను ఎలా ఇరికిస్తానో అంటూ.. కనకంతో ఫోన్ మాట్లాడినట్టు నటిస్తుంది స్వప్న. ఏంటమ్మా.. మీరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నన్ను ప్రశాంతంగా కాపురం చేసుకోనివ్వరా.. మీరు ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే.. మా అత్తగారింట్లో నన్ను ఏం అనుకుంటారు అంటూ కలరింగ్ ఇస్తుంది. ఆ కావ్యని డబ్బులు అడగొద్దంటే అడుగుతారు.. నా మాట మీరు వినరు. పోనీ ఆ కావ్య అని ఆలోచించాలి కదా.. రాజ్ కి మాయమాటలు చెప్పి.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకుని వచ్చి మీకు ఇస్తుంది. రాజ్ అమాయకుడు కాబ్టటి ఇచ్చేస్తున్నాడు.. రేపు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎలా? అంటూ డ్రామాలు ఆడుతుంది స్వప్న.

ఈ మాటలు విన్న అపర్ణ రగిలిపోతూ ఉంటుంది. రాజ్ మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఈ ఇంటి నుంచి ఒక్క రూపాయి తీసుకెళ్లినా నేను ఒప్పుకోను.. నిజాన్ని బయట పెట్టేస్తాను.. అని ఫోన్ కట్ చేసినట్లు నాటకం ఆడుతుంది స్వప్న . వెనకాల అపర్ణను చూసి షాక్ అయిపోనట్లు ఫేస్ పెడుతుంది.. కావ్య నీ కోసం పెద్ద గిఫ్ట్ సిద్ధం చేసి ఉంచాను రా.. నా గురించి కాదు ఇప్పుడు నీ జీవితం గురించి ఆలోచించు అని మనసులో అనుకుంటూ సంతోషపడుతుంది స్వప్న. దీంతో కావ్య ఎప్పుడు వస్తుందా.. దులిపేద్దామని అపర్ణ ఆవేశంతో ఎదురు చూస్తూ ఉంటుంది.

మరోవైపు కావ్య వేసిన డిజైన్స్ చూపి క్లయింట్స్ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. ఆవిడ కాన్ఫిడెంట్ కి కారణం తన టాలెంటే అని ఇప్పుడు అర్థమైందన్నారు. ఆ కళావతికి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని గుర్తుపట్టింది నేను అని మనసులో అనుకుంటాడు రాజ్. మేము ఆఫర్ చేసిన బడ్జెట్ లో ఇంత మంచి డిజైన్స్ వస్తాయని అనుకోలేదని ఆనంద పడతారు క్లయింట్స్. కావ్య గారి లాంటి టాలెంటెడ్ ఎంప్లాయ్ ని మీదగ్గర పెట్టుకోవం చాలా ప్లస్ అయింది అంటారు. రేపు మా ఆడిటర్ తో కలిసి మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుందాం. ఈ సారి మీ డిజైనర్ కి కూడా తీసుకురండి.. అప్రిషియేట్ చెయ్యాలి కదా అని కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోతారు క్లయింట్స్. ఇక ఆ తర్వాత రాజ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్ లో అత్తగారు అపర్ణ అంటుంది.. దానికి కావ్య ఎలాంటి జవాబు ఇస్తుందో చూడాలి.