Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు సూపర్బ్ రెస్పాన్స్.. ఊహించని రేటింగ్

|

Sep 12, 2024 | 8:31 PM

లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్ అంటూ ముందు నుంచి చెబుతున్నట్లుగానే బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరిగింది. కంటెస్టెంట్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు ఈ రియాలిటీ షోలో సందడి చేశారు. న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, నివేదా థామస్, అనిల్ రావి పూడి లాంటి స్టార్స్ వచ్చి బిగ్ బాస్ షో ను మరింత కలర్ ఫుల్ గా మార్చారు

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు సూపర్బ్ రెస్పాన్స్.. ఊహించని రేటింగ్
Bigg Boss Telugu Season 8
Follow us on

 

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ లాంఛింగ్ జరిగింది. టాలీవుడ్ అగ్ర హీరో, అక్కినేని నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్ అంటూ ముందు నుంచి చెబుతున్నట్లుగానే బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరిగింది. కంటెస్టెంట్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు ఈ రియాలిటీ షోలో సందడి చేశారు. న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, నివేదా థామస్, అనిల్ రావి పూడి లాంటి స్టార్స్ వచ్చి బిగ్ బాస్ షో ను మరింత కలర్ ఫుల్ గా మార్చారు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్నమైన రీతిలో కంటెస్టెంట్లను పరిచయం చేశారు. సింగిల్ గా కాకుండా జోడీలుగా ఇంట్లోకి పంపించారు. ఇలా ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగిన బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ లోనూ దుమ్ము దులిపింది. ఏకంగా 18.9 టీఆర్పీతో గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్. ఎంటర్‌టైన్మెంట్ పవర్ ఇలా ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు 8 రేటింగ్‌ల రికార్డులను బద్దలు కొట్టింది. బిగ్ బాస్ కొత్త శిఖరాలకు చేరుకునేలా చేసిన మీ ప్రేమాభిమానాలను చూసి మాకెంతో సంతోషంగా ఉంది. ఆడియెన్స్ కు వినోదాన్ని అందించడంలో మేం మరిన్ని కొత్త ప్రమాణాలు ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ కు 18.9 రేటింగ్ వచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చారు నాగార్జున. కాగా బిగ్‌బాస్ తెలుగు 8 చరిత్రలో ఇలాంటి టాప్ రేటింగ్ రావడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున ట్వీట్ ఇదిగో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.