Bigg Boss Nainika: కొత్త కారు కొన్న బిగ్ బాస్ నైనిక.. వీడియో వైరల్.. ధర ఎంతో తెలుసా?

ఢీ డ్యాన్స్ షో ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో నైనిక అనసురు. ఈ క్రేజ్ తోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొందీ డ్యాన్సర్. అయితే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది. తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీ ఒక కొత్త కారు కొంది.

Bigg Boss Nainika: కొత్త కారు కొన్న బిగ్ బాస్ నైనిక.. వీడియో వైరల్.. ధర ఎంతో తెలుసా?
Bigg Boss Nainika

Updated on: May 03, 2025 | 1:53 PM

బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నైనిక అనసురు ఒకరు. అంతకు ముందు ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఒకటి రెండు సీజన్లలో తళుక్కుమన్న నైనిక మెరుపు తీగలా డ్యాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఎన్నో కవర్ సాంగ్స్ కూడా చేసింది. పలుషార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించి మెప్పించింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ సీజన్ 8 లోకి కూడా అడుగు పెట్టింది. అయితే హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. టాస్కుల్లో యాక్టివ్ గా పాల్గొనకపోవడం, పెద్దగా ఫెర్ఫార్మెన్స్ లేకపోవడంతో మూడు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని టీవీ షోల్లో కనిపిస్తోంది నైనిక. యూట్యూబ్ లోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక కొత్త కారు కొనుగోలు చేసింది నైనిక. ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది. ‘నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను.. నా కుటుంబం నన్ను చూసి గర్వపడుతుంది. బంగారమ్స్.. నేను ఈరోజు కారు కొనడానికి మీరే కారణం.. మీ సపోర్ట్ లేకపోయి ఉంటే ఇది సాధ్యం అయ్యేది కాదు.. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయ్యింది నైనిక. ప్రస్తుతం నైనిక కొత్త కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

నైనిక పోస్టును చూసిన స్నేహితులు, సన్నిహితులు, తోటి సెలబ్రెటీలు అభినందనలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. నైనికకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిన కిర్రాక్ సీత ఈ పోస్టుపై స్పందిస్తూ.. ‘కంగ్రాట్స్ చుట్కీ.. నాకు చాలా ఆనందంగా ఉంది.. నీ కారులో రైడ్ వెళ్లడానికి నేను రెడీ’ అని కామెంట్ చేసింది. వీరితో పాటు మరికొందరు సెలబ్రిటీలు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొత్త కారుతో బిగ్ బాస్ నైనిక..

నైనిక కొన్న ఈ కారు టాటా మోటార్స్ కంపెనీకి చెందినది. కర్వ్ అంటూ వచ్చిన ఈ మోడల్ కారు ధర మార్కెట్ లో రూ.10-15 లక్షల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది.కాగా బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలో మొదలుకానుందని తెలుస్తోంది.

నైనిక డ్యాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.